newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేసీయార్, కేటీయార్ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్, బీజేపీ

28-01-202028-01-2020 16:54:55 IST
2020-01-28T11:24:55.524Z28-01-2020 2020-01-28T11:24:53.440Z - - 16-04-2021

కేసీయార్, కేటీయార్ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్, బీజేపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మునిసిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తీరుపై కాంగ్రెస్, బీజేపీ మండిపడ్డాయి.  ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ ఖూనీ చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి విమర్శించారు. మంత్రి కేటీఆర్ దిగజారుడు రాజకీయాలు చేశారని, న్నికల నియమావళికి విరుద్ధంగా.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డికి ఓటు కల్పించారని ఉత్తమ్ విమర్శించారు. సుభాష్‌రెడ్డి ఓటు కోసమే సోమవారం చైర్మన్‌ ఎన్నికను వాయిదా వేయించారన్నారు. కాంగ్రెస్ దళిత అభ్యర్థిని చైర్మన్ కాకుండా అడ్డుకున్న టీఆర్ఎస్ పార్టీ దళితులంటే అభిమానం లేదన్నారు.

తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలో, చావాలో ప్రభుత్వమే చెప్పాలన్నారు. ఓటు వేయడానికి వచ్చిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రాంచందర్‌రావుకు అనుమతి లేదని పోలీసులు ఆపివేయడంపై ఆయన ఫైర్ అయ్యారు. కొంతమంది నేతలు మంత్రులై పోజులు కొడుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు.

మునిసిపల్‌ కమిషనర్‌ ఓ ఫేక్‌ గెజిట్‌ తీసుకొని కేవీపీ ఓటు రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేవీపీ రాంచందర్‌రావును తెలంగాణ రాజ్యసభ సభ్యుడు కాదని గుర్తించే స్థాయి కమిషనర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. తనకు ఓటు లేకపోయినా.. తెలంగాణ ప్రజలకు తన సేవలు కొనసాగిస్తానని ఎంపీ కేవీపీ రాంచందర్‌రావు అన్నారు.

మరోవైపు టీఆర్ఎస్ అప్రజస్వామికంగా మునిసిపల్ ఎన్నికల్లో గెలిచిందని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. బీజేపీ అంటే టీఆర్ఎస్‌కు భయం పెరిగిందని.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. కేసీఆర్ భాష గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. సోమవారం ప్రెస్ మీట్లో కేసీయార్ విపక్షాలను విమర్శించారన్నారు.

నిజామాబాద్ లో మూడవస్థానంలో ఉన్న టీఆర్ఎస్ మేయర్ పీఠం దక్కించుకోవడం ఏంటని లక్ష్మణ్ ప్రశ్నించారు. మంత్రి సబితారెడ్డి చర్యలతో ఇంద్రారెడ్డి ఆత్మ ఘోషిస్తోందన్నారు. పార్లమెంట్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను తిరస్కరించారన్నారు. బైంసాలో ఒక్క వార్డు కూడా గెలవని టీఆర్ఎస్.. బీజేపీని విమర్శించడం ఏంటన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్‌ను మించిన నియంత దేశంలోనే ఎవ్వరూ లేరు. కేసీఆర్ అవినీతి పాలనపై ఉద్యమించి ప్రజలకు చేరువవుతాం అన్నారు.

 

తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   3 minutes ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   an hour ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   13 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   18 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle