కేసీయార్ కీలక నిర్ణయం.. 30 నియోజకవర్గాల్లో 50వేల కరోనా టెస్ట్‌లు
15-06-202015-06-2020 13:43:05 IST
Updated On 16-06-2020 10:16:08 ISTUpdated On 16-06-20202020-06-15T08:13:05.168Z15-06-2020 2020-06-15T08:12:46.631Z - 2020-06-16T04:46:08.816Z - 16-06-2020

తెలంగాణ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తోంది. హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే వారం, పది రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి ముందుజాగ్రత్త చర్యగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకోసం కరోనా నిబంధనలను అనుసరించి ప్రైవేటు లేబొరేటరీలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలు, ధరలను నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. విపక్షాలు సైతం కరోనా టెస్టులు జరుగుతున్న తీరుపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. గతంలో కంటే జిల్లాల్లో కరోనా వ్యాప్తి పెరిగిపోవడం, మరణాలు కూడా ఎక్కువ కావడం అధికారులను కలవరానికి గురిచేస్తోంది. మరోవైపు తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షల నిర్వహణ, ధరలను ప్రకటించింది. కరోనా నిర్దారణకు ధరను రూ. 2,200గా నిర్ణయించింది. వెంటిలేటర్ లేకుండా చికిత్స అందిస్తే రోజుకు, రూ.7000గా, అలాగే వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తే రూ. 9000 ధరలు వసూలు చేయాలని నిర్ధేశించింది. ఈ మేరకు సోమవారం వైద్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆ శాఖమంత్రి ఈటల రాజేందర్ మీడియా భేటీలో ఈ వివరాలను వెల్లడించారు. ఐసీఎంఆర్ నిబంధనలకు లోబడే రాష్ట్రంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి ఈటల తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే టెస్టులు చేయాలని అధికారులకు అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి ప్రకటించారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే లాక్‌డౌన్‌ను విధించామని, ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా వైరస్ వ్యాప్తి చెందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన అనంతరం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. ప్రజలు మాస్కులు లేకుండా బయటకు రావద్దని, సడలింపులు వున్నాయి కదాని ఎక్కడబడితే అక్కడ తిరగవద్దన్నారు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
34 minutes ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
2 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
6 minutes ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
2 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
3 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
5 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
6 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
6 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
a day ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
21 hours ago
ఇంకా