newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేసీయార్ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం.. నిందితుడి అరెస్ట్

19-08-202019-08-2020 15:33:05 IST
Updated On 19-08-2020 15:39:05 ISTUpdated On 19-08-20202020-08-19T10:03:05.013Z19-08-2020 2020-08-19T10:02:27.966Z - 2020-08-19T10:09:05.114Z - 19-08-2020

కేసీయార్ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం.. నిందితుడి అరెస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సోషల్ మీడియా తీవ్రత బాగా పెరిగిపోయింది. గాసిప్స్, అవాస్తవాలను వెలుగులోకి తెస్తోంది. సోషల్ మీడియా పోస్టులతో ప్రముఖుల పరువుకు భంగం వాటిల్లుతోంది. ఒక్కోసారి శాంతిభద్రతల సమస్య కూడా వస్తోంది. ఇటీవల కర్నాటకలో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. తాజాగా తెలంగాణలో ఓ ఆకతాయి పెట్టిన సోషల్ మీడియా పోస్టు అతడిని జైలు పాలు చేసింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దుబాయ్‌లో ఉంటున్న జగిత్యాలకు చెందిన రాజు అనే యువకుడు కేసీఆర్ కరోనాతో చనిపోయారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టుతో గందరగోళం నెలకొంది. ఈ పోస్టు చూసిన కొందరు టీఆర్ఎస్ నేతల దృష్టికి తెచ్చారు. దీంతో రాజుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.

సౌదీ అరేబియా నుండి తిరిగి వచ్చిన రాజును ముంబై ఎయిర్ పోర్ట్‌లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు రాజును ముంబై నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. ఈ కేసులో అతన్ని పోలీసులు జ్యుడీషియల్‌ కస్టడికి పంపారు. బెంగళూరు సంఘటన తరవాత పోలీసులు ఇలాంటివాటిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తప్పుడు కథనాలు, వదంతులు వ్యాపింపచేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   8 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   11 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   15 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   13 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle