newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

కేసీయార్ అబద్దాలాడుతున్నారు... ఉత్తమ్ ధ్వజం

09-05-202009-05-2020 12:50:19 IST
Updated On 09-05-2020 16:33:11 ISTUpdated On 09-05-20202020-05-09T07:20:19.073Z09-05-2020 2020-05-09T07:15:52.697Z - 2020-05-09T11:03:11.741Z - 09-05-2020

కేసీయార్ అబద్దాలాడుతున్నారు... ఉత్తమ్ ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ సీఎం కేసీయార్ తీరుపై మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం ధాన్యం కొనుగోళ్ళ విషయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై చేసిన ఆరోపణలపై స్పందించారు. తెలంగాణలో 1835 రూపాయలు క్వింటాలు వరికి మద్దతు ధర ఇస్తే ఛత్తీస్ ఘడ్ లో రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కలిపి 2500 మద్దతు ధర ఇస్తోందన్నారు.  కాంగ్రెస్ హయాంలో హమాలీల ఖర్చు ప్రభుత్వమే భరించింది నేడు రైతుల వద్ద వసూలు చేస్తున్నారని విమర్శించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 

శుక్రవారం పీసీసీ బృందం కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ బృందం సందర్శించింది.రైతుల తరఫున మాట్లాడితే సీఎం కేసీఆర్, ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని అంటున్నారని ఆయన విమర్శించారు. రైతుల తరఫున మాట్లాడితే రాజకీయమా అని ప్రశ్నించారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేసీఆర్, రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఉత్తమ్ ఆరోపించారు. జనవరి, ఫిబ్రవరిలో అమ్మిన కందుల డబ్బులు ఇప్పటికీ రైతులకు అందలేదన్నారు. వరి, బత్తాయి, నిమ్మ, మామిడి, పసుపు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

మిల్లర్లు ప్రభుత్వం కలిసి రైతులను తాలు కటింగ్ పేరిట నిలువు దోపిడీ చేస్తోందని,  కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న ఐ కే పీ మహిళా సంఘాలకు నాలుగుసార్లు ప్రభుత్వం కమిషన్ చెల్లించకపోవడం విచారకరం అన్నారు. నెల రోజుల్లో నేటివరకు 25 శాతం ధాన్యం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే స్వయాన మంత్రి కేటీయార్ నియోజకవర్డం సిరిసిల్లలో రైతులు ధాన్యాన్ని తగలబెట్టుకున్నారన్నారు. 

మరో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ  సీఎం కేసీఆర్ చెప్పే మాటలు వింటే కడుపు నిండుతుంది కానీ క్షేత్రస్థాయిలో చూస్తే కడుపు ఎండుతుందన్నారు.  ధర్మ కాంటా రశీదుతో ఎందుకు మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని, ఇందులో మతలబు ఏంటి అంటూ ప్రశ్నించారు. రైతులను తాలుగాళ్లుగా అపహాస్యం చేస్తూ ముఖ్యమంత్రి అవమానిస్తున్నారని, రైతులను అపహాస్యం చేస్తున్న ముఖ్యమంత్రి భేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

Image

ఎన్నికల వరకే రాజకీయాలు అన్న ముఖ్యమంత్రి తానే రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలోని రైతుల ధాన్యం కొనుగోలు చేయకపోతే ముక్కు నేలకు రాయించి కొనిపిస్తామన్నారు. పండిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పడం హాస్యాస్పదమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జీవన్‌రెడ్డి విమర్శించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాం నుంచే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయం ముఖ్యమంత్రికి తెలియకపోవడం శోచనీయమన్నారు. మన రాష్ట్రం కంటే ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేస్తున్నారన్నారు.

 

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   3 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   8 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   11 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   11 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   12 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   14 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   14 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   14 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   15 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle