కేసీయార్ అన్నకు రాములమ్మ పంచ్.. రాజీనామా ఎప్పుడు?
21-02-202021-02-2020 07:57:49 IST
Updated On 21-02-2020 08:06:46 ISTUpdated On 21-02-20202020-02-21T02:27:49.222Z21-02-2020 2020-02-21T02:27:33.200Z - 2020-02-21T02:36:46.940Z - 21-02-2020

తెలంగాణ రాజకీయాల్లో అప్పుడప్పుడూ పంచ్ లు వేస్తూ తన ఉనికిని చాటుకుంటూ వుంటారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి. సినిమాల్లోలాగే ఆమె పంచ్ లు కూడా పేలుతుంటాయి. తాజాగా తను అన్నగా భావించే సీఎం కేసీయార్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పని చేయండి లేదా, పదవి నుంచి తప్పుకోండి... అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ గారు కొత్తగా ఎన్నికైన మున్సిపాలిటీలకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు మేయర్ లను ఉద్దేశించి వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం ఈ వార్నింగ్ ప్రజాప్రతినిధులకు మాత్రమే వర్తిస్తుందా? లేక పనిచేయని పక్షంలో సీఎం కూడా ఆ మాటకు కట్టు బడతారా? అంటూ ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల్లో కెసిఆర్ గారి పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. ఎందుకంటే మొన్న మున్సిపాలిటీలకు చెందిన ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల చందంగానే, గతంలో జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన తర్వాత, ఆ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్ లను మేయర్ ను ఉద్దేశించి, హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ప్రగతి రిసార్ట్స్ లో కెసిఆర్ ఇచ్చిన ప్రసంగాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వార్నింగులు మామూలేనని పత్రికలు, మీడియాను బాగా ఫాలో అయ్యే జనానికి విదితమే. ఇప్పుడు ఏదైతే వార్నింగ్ ఇచ్చారో, అప్పుడు కూడా ఇదే రకమైన ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి జనాన్ని మభ్య పెట్టేందుకు కేసీఆర్ గారడీ చేసిన విషయం హైదరాబాద్ ఓటర్లు ఎవరూ మర్చిపోలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో టిఆర్ఎస్ కార్పొరేటర్లు ఇచ్చిన ఎన్నికల హామీకి కట్టుబడతారనే నమ్మకంతోనే... హైదరాబాద్ ఓటర్లు ఓట్లు వేసి గెలిపించారని, తప్పనిసరిగా ఈ హామీని నెరవేర్చాలని కెసిఆర్ గారు అప్పట్లో కార్పొరేటర్లకు ఉపదేశించారు. కానీ నాలుగేళ్లు గడుస్తున్నా హైదరాబాదులోని చాలా ప్రాంతాల్లో ఇంకా డబుల్ బెడ్ రూమ్ ఊసే కనిపించడం లేదు. గతంలో చెప్పిన మాటలకు కట్టుబడి కెసిఆర్ తన పదవికి రాజీనామా చేస్తారా? శివారు ప్రాంతాలకు మిషన్ భగీరథ నీళ్ళిస్తామని, ఇవ్వకపోతే ఓట్లే అడగమని ముందస్తు ఎన్నికలకు ముందే కేసీయార్ ప్రకటించిన విషయాన్ని, హామీలను గుర్తుచేసుకుంటున్నారు జనం. ఇప్పుడు ఇవేం అమలు కాలేదని, రాజీనామా ఎప్పుడని హైదరాబాద్ వాసులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ అంతటా వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తామని చెప్పి, టిఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇంటిముందు వాటర్ ట్యాప్ లు వెక్కిరిస్తున్నాయి. అప్పుడప్పుడూ నీళ్ళు వదిలి టెస్టింగ్ అంటూ ఊదరగొడుతున్నారని విజయశాంతి మండిపడ్డారు. ఎన్నికలు అయిపోయి నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు ఇంటింటికి మంచినీరు పథకం అమలైన దాఖలాలు లేవు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు... గత ఐదేళ్లలో కేసీఆర్ గారు ఇచ్చిన హామీలకు సంబంధించి ఆయన ఎన్నిసార్లు మాట తప్పారో దానికి ఆయన ఎన్నిసార్లు పదవి నుంచి తప్పుకోవాలో టిఆర్ఎస్ నేతలే లెక్క చెప్పాలి. ఇక కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని టిఆర్ఎస్ నేతలు ఆరోపించడం, దానికి బిజెపి నేతల ఎదురుదాడి చేస్తున్న తీరు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కేంద్రాన్ని నిధుల విషయంలో నిలదీస్తున్న టిఆర్ఎస్ నాయకత్వం... గత ఐదేళ్ళ కాలంలో సీఎం దొరవారి పాలనలో ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఏ మేరకు విడుదల చేశారు అనే విషయంపై సమాధానం చెప్పాలి. అవసరమయితే ఆర్ టీఐ చట్టం ద్వారా ఎవరైనా వెలుగులోకి తేవాలి. తెలంగాణలోని ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి అభివృద్ధి నిధి విడుదల చేయకుండా, మొత్తం ప్రభుత్వ సొమ్మును టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ గారు దోచి పెట్టిన వైనాన్ని తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. నిధుల విషయంలో కేంద్రం చేసేది తప్పు అయితే, మీరు చేసేది ఎలా రైట్ అవుతుంది? కేంద్రానికి ఒక న్యాయం, కెసిఆర్ గారికి ఒక న్యాయమా? అని తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు. తప్పనిసరిగా టిఆర్ఎస్ అధినాయకత్వం దీనికి సమాధానం చెప్పి తీరాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
31 minutes ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
14 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
10 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
12 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
17 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
20 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
21 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
a day ago
ఇంకా