కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ
29-05-202029-05-2020 12:45:33 IST
2020-05-29T07:15:33.427Z29-05-2020 2020-05-29T07:14:50.452Z - - 15-04-2021

కేసీయార్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. కానీ ఆయన తనయుడు, మంత్రి కేటీయార్ మాత్రం కొత్త అర్థం తెరమీదకు తెచ్చారు. కేసీయార్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లట. ఈమేరకు ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకెళ్తున్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చి.. రైతుల ముఖాల్లో సంతోషం నింపే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. గోదావరి, కృష్ణా జలాలను ఒడిసిపట్టి.. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు కేసీఆర్.

ఇందులో భాగంగా గోదావరి జలాలను నిల్వ చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి.. ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగమైన తుది పంపు హౌజ్ మర్కూక్ పంపు హౌజ్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మెతుకు సీమను సస్యశ్యామలం చేసేందుకు కొండపోచమ్మ సాగర్ ను సీఎం ప్రారంభించి.. గోదావరి జలాలకు హారతి పట్టారు.
ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. కేసీఆర్‌కు కొత్త నిర్వచనమిచ్చారు. కే అంటే కాల్వలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అని కేటీఆర్ తెలిపారు. కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతుండటంతో కేసీఆర్ పేరు సార్థకమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ వరకు గోదావరి జలాలను తరలించారని తెలిపారు. సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తున ఉన్న మేడిగడ్డ నుంచి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ వరకు గోదావరి జలాలను ఎత్తిపోసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్ధ సాధక ప్రాజెక్టు కాళేశ్వరాన్ని యువ తెలంగాణ రాష్ర్టం.. కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసింది అని కేటీఆర్ తెలిపారు.
కొండపోచమ్మ సాగర్ కింద 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా.. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కేశావపురం రిజర్వాయర్‌ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు కేటీఆర్. దీంతో హైదరాబాద్ ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. దూరదృష్టితో భవిష్యత్ తరాలకు ఉపయోగపడేవిధంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న సీఎం కేసీఆర్‌కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. గోదావరి జలాలను అరకిలో మీటరు ఎత్తుకు తీసుకెళ్లి లక్షలాది ఎకరాలను తడపాలన్న సీఎం కేసీఆర్ కల సాకారం అయ్యింది.
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 4, ప్యాకేజీ 14లో భాగంగా నిర్మించిన మర్కూక్ పంపు హౌజ్‌ను సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామితో కలిసి శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులోకి నీరు వదల డానికి 6 మోటార్లను 34 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయగా వాటిలో ఒక మోటార్ ను సీఎం ఆన్ చేసారు. దీంతో కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి కాళేశ్వరం జలాల ఎత్తిపోతను ప్రారంభం అయింది. మరికొద్ది సేపటిలోనే కొండపోచమ్మ సాగర్ డెలివరీ సిస్టర్న్ వద్దకు గోదావరి జలాలు చేరుకోనున్నాయి. ఈ కార్యక్రమంలో చినజీయర్ స్వామి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సముద్ర మట్టానికి 510 మీటర్ల ఎత్తులో దాదాపు రూ.1,600 కోట్ల వ్యయంతో కొండ పోచమ్మ ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ 4, ప్యాకేజీ 14లో భాగంగా చేపట్టారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాలకు సాగు నీరందనుంది. ఈ రిజర్వాయర్‌తో గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని సుమారు 26 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. అంతే కాదు హైదరాబాద్ నగరానికి తాగునీటి సౌకర్యంతో పాటు ఐదు జిల్లాల పరిధిలోని 2.85 లక్షల ఎకరాలకు సాగునీటిని అందుతుంది.
అంతకుముందు మర్కూక్ పంపు హౌజ్ వద్ద నిర్వహించిన సుదర్శన యాగం పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్ దంపతులు, త్రిదండి శ్రీమన్నానారాయణ చినజీయర్ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులు, చినజీయర్ స్వామికి వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. సీఎం కేసీయార్ కొండపోచమ్మ జలాశయం వద్ద గోదావరి జలాలకు హారతి ఇచ్చారు. అనంతరం మర్కూక్ మండల కేంద్రంలోని వరదరాజస్వామి దేవాలయంలో సీఎం పూజలు నిర్వహించారు.

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
3 minutes ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
2 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
4 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
5 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
7 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
7 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
8 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
6 hours ago

నా రూటే సెపరేటు
10 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
a day ago
ఇంకా