newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

‘‘కేసీయార్‌ది మైండ్ గేమ్...ఆర్టీసీ ఉద్యోగులు భయపడొద్దు’’

25-10-201925-10-2019 17:45:16 IST
2019-10-25T12:15:16.500Z25-10-2019 2019-10-25T12:07:38.336Z - - 15-08-2020

‘‘కేసీయార్‌ది మైండ్ గేమ్...ఆర్టీసీ ఉద్యోగులు భయపడొద్దు’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ వ్యాప్తంగా రాజకీయంగా ప్రకంపనలు కలిగిస్తోంది ఆర్టీసీ ఉద్యోగుల నిరవధిక సమ్మె. ఉద్యోగులు మనోస్థైర్యం కోల్పోకుండా ఉద్యమం కొనసాగించాలని, ఆత్మహత్యలకు గురికావద్దని ఆర్టీసీ జేఏసీ కోరుతోంది. తాజాగా ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆర్టీసీ కార్మికుల జేఏసీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. 

సీఎం ఎంత భయభ్రాంతులకు గురిచేసినా సమ్మె కొనసాగి తీరుతుందని ఆర్టీసీ ఉద్యోగులు స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె సమయంలో తిరుగుతున్న బస్సుల్లో కాంట్రాక్టు డ్రైవర్ల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేసీయార్  మానవత్వంతో ఎందుకు ఆలోచించడంలేదని వారు ప్రశ్నించారు. కూకట్ పల్లి డిపోలో పలువురు ఆర్టీసీ ఉద్యోగులు ‘న్యూస్ స్టింగ్’తో మాట్లాడారు.

ఆర్టీసీ ఆదాయం, అప్పులు, ఆస్తులు, ప్రైవేటీకరణ వల్ల నష్టాలపై కేసీయార్ కి దిమ్మతిరిగే సమాధానాలిచ్చారు. ఆర్టీసీ యాజమాన్యం-ఉద్యోగుల మధ్య చర్చలు జరగాలని.. కానీ ఉద్యోగులను భయపెట్టేలా కేసీయార్ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకూ సమంజసం అన్నారు. ఆర్టీసీ డ్రైవర్ల వల్లే ఆర్టీసీకి అధిక ఆదాయం వస్తోందని, అద్దె బస్సుల వల్ల కాదని ఉద్యోగులు వివరించారు. 

ఆర్టీసీకి నష్టాలు రావడానికి, ఆర్టీసీ ఈ స్థితికి చేరడానికి ప్రభుత్వమే కారణం అన్నారు ఓ మహిళా ఉద్యోగి. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తుందని, వాటిని అమలుచేసేది ఆర్టీసీయే అన్నారు.

కానీ ఆర్గీసీకి చెల్లించాల్సిన రాయితీలను ఎందుకు చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇచ్చేస్తే తమ సంస్థ నష్టాల పాలు కాదన్నారు. వికలాంగులకు, పోలీసులకు, సీనియర్ సిటిజన్లకు, జర్నలిస్టులకు ఇస్తున్న రాయితీల మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్ చేయడంలేదన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ చెల్లించకుండా అప్పులు అంటున్నారని, ఈ విషయంలో బహిరంగంగా చర్చకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. 

ఆర్టీసీని కాపాడుకోవడం ఉద్యోగులతో పాటు ప్రజల కర్తవ్యం అన్నారు. ఆర్టీసీ ఆస్తులు చాలా వున్నాయి, వాటిని రక్షించుకోవాలన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం వల్ల బస్ పాస్ లు ఉండవు. రాయితీలు ఉండవు.  ప్రజలు ఇబ్బంది పడతారన్నారు. ప్రజారవాణా వ్యవస్థ మెరుగుపరచాల్సిన అవసరం ఉందని, అవన్నీ మరిచిపోయి కార్మికుల సమ్మెను విమర్శించడం కేసీయార్ కు తగదన్నారు. 

యూనియన్ల ఎన్నికలు వస్తున్నాయని, అందుకే సమ్మె చేస్తున్నారని సీఎం అనడంపై ఉద్యోగులు మండిపడ్డారు. టీఎంయూ అనే యూనియన్ ని తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనే నెలకొల్పారని, మీ పాలనపై నమ్మకం కోల్పోయారా ...ఆర్టీసీపై సీఎం చెప్పిన అన్ని లెక్కలకు సమాధానం చెప్పాలన్నారు.

20 రోజులుగా ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడని సీఎం ఇప్పుడు ఈ విధంగా ఆర్టీసీ కార్మికులను కించపరిచేలా మాట్లాడడం ఏంటని ఉద్యోగులు ప్రశ్నించారు. మరోవైపు ఉద్యోగులకు రాజకీయపార్టీలు సంఘీభావం తెలపడంతో సమ్మె మరింతకాలం కొనసాగుతుందని భావిస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle