newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేసీయార్‌కు హరగోపాల్ లేఖ.. వరవరరావు ఆరోగ్యంపై ఆందోళన

12-07-202012-07-2020 08:00:31 IST
Updated On 12-07-2020 20:32:55 ISTUpdated On 12-07-20202020-07-12T02:30:31.946Z12-07-2020 2020-07-12T02:29:25.525Z - 2020-07-12T15:02:55.418Z - 12-07-2020

కేసీయార్‌కు హరగోపాల్ లేఖ.. వరవరరావు ఆరోగ్యంపై ఆందోళన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ముంబైలోని తలోజా జైలులో వున్న విప్లవ కవి పి.వరవరరావు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. ముంబైలోని తలోజ జైలులో తీవ్ర అనారోగ్యంతో వరవరరావు బాధ పడుతున్నారని, వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడాలని ఆయన కుటుంబసభ్యులతో పాటు హక్కుల కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు.

ముంబై తలోజ జైలులో విచారణ ఖైదీగా ఉన్న వరవరరావుతో జైలు అధి కారులు తనతో ఫోన్లో మాట్లాడించారని, వీవీ మాట్లాడిన తీరు పొంతన లేకుండా ఉందని, మాట మొద్దు బారిపోయిందని ఆయన భార్య హేమలత ఆవేదన చెందారు. వీవీ ఆరోగ్యం బాగా చెడిపోయిందని ఆయన పక్కనే ఉన్న వ్యక్తి ఫోన్‌ తీసుకుని తనతో చెప్పాడని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.  వెంటనే ప్రభుత్వం స్పందించాలని హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వరవర రావును ఆస్పత్రికి పంపించి చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలని ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ సీఎం కేసీఆర్‌కు శనివారం లేఖ రాశారు.వీవీకి తక్షణమే వైద్య సదు పాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయనతో పాటు కవులు, సాహితీ వేత్తలు సామాజిక మార్గాల్లో సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో వరవరరావు అరెస్టయిన సంగతి తెలిసిందే.వరవరరావు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఇటీవల వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని, బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన తరపున లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను కొద్దిరోజుల క్రితం కోర్టు కొట్టి వేసింది. భీమా కోరేగావ్‌ కేసులో వరవరరావు కీలక నిందితుడని, ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది.

దీంతో వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడుదల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు ఇటీవల మహా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖలు కూడా రాశారు.వరవరరావుని మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని వివిధ పార్టీలకు చెందిన 14 మంది ఎంపీలు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరేకు లేఖ రాశారు. ఆయన అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం వారు అభ్యర్థించారు. తాజాగా ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండడంతో సరైన వైద్యం అందించాలని కుటుం సభ్యులు కోరుతున్నారు. 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   12 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   13 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   16 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   19 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   14 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle