newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేసీయార్‌కు బీజేపీ మద్దతు.. కరోనా ఎఫెక్ట్

25-03-202025-03-2020 17:33:08 IST
2020-03-25T12:03:08.204Z25-03-2020 2020-03-25T11:59:36.162Z - - 15-04-2021

కేసీయార్‌కు బీజేపీ మద్దతు.. కరోనా ఎఫెక్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సాధారణంగా బద్ధ శత్రువులు ఏ విషయంలోనూ ఏకాభిప్రాయంతో వుండరు. రాజకీయాల్లో అయితే చెప్పాల్సిన పనిలేదు, తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ, టీఆర్ఎస్ నిప్పు-ఉప్పు తరహాలో వుంటారు. అయితే ఒకే ఒక్క విషయంలో మాత్రం వీరి ఆలోచనలు కలిశాయి. కరోనా విషయంలో కేసీయార్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని సమర్ధించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. అంతేకాదు తమ పూర్తి సహకారం అందిస్తామని మీడియా సాక్షిగా ప్రకటించారు. 

ఇక ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించి ప్రజలు బయటకు రాకుండా చూస్తోంది. అనేక ముందస్తు నివారణ చర్యలు చేపట్టింది ప్రభుత్వం. కరోనా పెరిగిపోతున్న వేళ ప్రభుత్వానికి సహకారం అందిస్తామని లేఖ రాసిన బీజేపీ చీఫ్ తెలంగాణా ప్రభుత్వం కరోనా నేపధ్యంలో సామాన్యులకు సాయం అందించే పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఉచిత రేషన్ అందించడమే కాకుండా రూ 1500రూపాయలు అందించటం అభినందనీయం అన్నారు.

ఇలాటి విపత్తు సమయంలో పార్టీలు రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కరోనా విపత్తును ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన ఈ లేఖ ద్వారా స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తల సేవలు వాడుకోవాలని లేఖ బీజేపీ కార్యకర్తలు సేవ చెయ్యటానికి సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వానికి అవసరం అయితే వారి సేవలు వినియోగించుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు . 

రాష్ట్రంలోని లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు కరోనా పై ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త కరోనా వ్యతిరేక సేవకుడిగా సేవలందించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపు నిచ్చారు.

ఈ పరిస్థితిలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా దళారుల మీద చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ కు సంజయ్ తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఆయుష్మాన్ భారత్ లో కరోనాను చేర్చిన దృష్ట్యా తెలంగాణాలో కూడా ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయాలని సీఎంకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. తమ వంతు సాయం అందించటానికి ఏ సమయమైనా సిద్ధం అని ప్రకటించారు. 

ఇలాంటి విపత్తులను రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్న నేపధ్యంలో సీఎం కేసీఆర్ కు బీజేపీ చీఫ్ ఈ లేఖ రాశారు.  అంతేకాదు సింగరేణి కార్మికులకు లాక్ డౌన్ ప్రకటించాలని బండి సంజయ్ కోరారు.  క్లిష్ట పరిస్థితుల్లో వారిని విధుల్లో ఉంచడం తగదని, ఈ విషయాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళానని చెప్పారు బండి సంజయ్.  సింగరేణి కార్మికుల ఉద్యమ స్ఫూర్తి మరువలేనిదని, .తెలంగాణ రాష్ట్ర సాధనలో 42 రోజులు సకల జనుల సమ్మెలో ఉన్నారని,  కరోనా వైరస్ నివారణకు ప్రతి అంశాన్ని ఆలోచించాలన్నారు.  తక్షణమే కార్మికులకు లాక్ డౌన్ అమలు చేయాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,బండి సంజయ్ కుమార్. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle