newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

కేసీఆర్ మీద ఆన.. చికెన్ నిర్బయంగా తినండి.. కేటీఆర్ తాజా ప్రమోషన్

29-02-202029-02-2020 11:01:19 IST
Updated On 29-02-2020 16:17:56 ISTUpdated On 29-02-20202020-02-29T05:31:19.580Z29-02-2020 2020-02-29T05:31:09.256Z - 2020-02-29T10:47:56.605Z - 29-02-2020

కేసీఆర్ మీద ఆన.. చికెన్ నిర్బయంగా తినండి.. కేటీఆర్ తాజా ప్రమోషన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక పక్క కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థే తలకిందులయ్యే సూచనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మరోవైపు ఆయా దేశాల్లో ఆహారపు అలవాట్లలో కూడా భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మన దేశంలో కరోనా వైరస్ జాడ పెద్దగా లేదు కానీ కోడిమాంసం అంటేనే జనం భయపడిపోతున్నారు. ఎంతగా అంటే నెలరోజుల క్రితం 170 వరకు పలికిన స్కిన్ లెస్ చికెన్ ఈ శుక్రవారానికి 60 రూపాయల లోపుకు పడిపోయేంత. దేశవ్యాప్తంగా పౌల్ట్రీ పరిశ్రమకు కరొనా వైరస్ భయంతో చుక్కలు కనిపిస్తుండగా ఇలా కాదని సాక్షాత్తూ తెలంగాణ మంత్రులు స్వయంగా రంగంలోకి దిగి బాబ్బాబూ.. చికెన్ తినండి. ఏమీకాదు అని అభయమిస్తూ తాము స్వయంగా చికెన్ లాగించి మరీ చూపడం విశేషం.

వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజలలలో ఏ ఒక్కరికీ చికెన్, గుడ్డుతో ఇంతవరకు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలూ రాలేదని.. దుష్ప్రచారాలు, అపోహలు, అనుమానాలతో జరుగుతున్న వైరల్‌ క్యాంపెయిన్‌ శుద్ధ తప్పని రాష్ట్ర మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. చికెన్, ఎగ్‌తో కరోనా వైరస్‌ రాదని, ఆరోగ్యానికి మంచి పౌష్టిక విలువలు లభిస్తాయని పేర్కొన్నారు. 

శుక్రవారం నెక్లెస్‌ రోడ్డు పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన చికెన్‌ అండ్‌ ఎగ్‌ మేళాను ఆయన ప్రారంభించారు. తోటి మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలసి ఆయన చికెన్‌ తిని చూపించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గుడ్డు, చికెన్‌లో ఉన్న పోషక విలువలు ఏ ఆహార పదార్థంలో లేవన్నారు. 

మనదేశంలో అధిక మంటపై ఉడికించి తినే వంటలకు ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు లేవన్నారు. చికెన్, గుడ్డు తినడంతో కోవిడ్‌ వ్యాపిస్తుందన్న వదంతులు నమ్మవద్దని, ఆరోగ్య శాఖ మంత్రే వచ్చి చికెన్, గుడ్డు తినడంతో ఎలాంటి హాని జరగదని సర్టిఫికెట్‌ ఇచ్చిన తర్వాత ఇంకా అపోహలు పెట్టుకోవదన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జిల్లాల్లో కూడా చేయాలని.. దీనికోసం నటులు, డాక్టర్లు ముందుకు రావాలన్నారు. 

తమ కుటుంబంలో ముఖ్యమంత్రితో సహా అంతా రోజూ చికెన్‌ తింటామని కేటీఆర్‌ తెలిపారు. త్వరలో తెలంగాణ పౌల్ట్రీ పాలసీ కూడా రాబోతుందని వివరించారు. చికెన్ శుభ్రంగా రోజూ తినొచ్చనడానికి మా కుటుంబమే పెద్ద ఉదాహరణ అని చెబుతూ కేటీఆర్ చికెన్ ఎగ్ మేళాకు హాజరైన వారిని ఉత్సాహపరిచారు.

మన ఆహారపు అలవాట్లకు కోవిడ్‌ వైరస్‌ వచ్చే అవకాశం లేదని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కేరళలో 3 కేసులు నమోదయ్యాయి తప్ప, మన రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదుకాలేదన్నారు. మన వద్ద సగం ఉడికించి తినే ఆహారపు అలవాటు లేదన్నారు. వైరల్‌ వార్తల కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైందన్నారు. 2 నెలల కాలంలో రూ.500 కోట్ల పైచిలుకు నష్టపోయిందన్నారు. వదంతులు నమ్మవద్దని, కరోనా వైరస్‌కు చికెన్‌కు ఎలాంటి సంబంధం లేదని తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

కాగా చికెన్‌ అండ్‌ ఎగ్‌ మేళాలో 6,200 కిలోల మేరకు వివిధ రకాల చికెన్‌ వంటకాలు, 22వేల గుడ్లు నగరవాసులకు ఉచితంగా అందజేశారు. ఎంపీ రంజిత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్‌ ఫౌల్ట్రీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌కుమార్‌రావు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ వి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, సురేందర్, ఫౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు, రైతులు, నగరవాసులు పాల్గొన్నారు.

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   an hour ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   2 hours ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   2 hours ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   2 hours ago


లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

   3 hours ago


కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

   3 hours ago


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

   3 hours ago


హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

   5 hours ago


తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

   5 hours ago


ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   17 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle