newssting
BITING NEWS :
* సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్, చైనాల మధ్య సుదీర్ఘ చర్చలు. చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 9 గంటల రాత్రి 9 గంటల వరకు ఆరవ విడత చర్చలు. * మహారాష్ట్ర థానే జిల్లా భివండీలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య. మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు, మహిళలు అధికం. * బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకు సమాజ్‌వాదీ పార్టీ మద్ధతు. సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ట్విట్టర్ ద్వారా సోమవారం రాత్రి ప్రకటన. * ముంబై నగరంతోపాటు పలు పరిసర నగరాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరికలు. ముంబై, థానే, రాయగడ్, పూణే, సతార, సిందూర్గ్ ప్రాంతాల్లో మంగళవారం ఉరుముులు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముంబై వాతావరణ శాఖ హెచ్చరికలు. రష్యా దేశంలో భారీ భూకంపం. రష్యాలోని ఇర్కుట్సు రీజియన్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రష్యన్ ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ వెల్లడి. భూకపంపంతో ప్రజలు భయాందోళనలు. విగత జీవిగా దొరికిన సరూర్ నగర్ తపోవన్‌కాలనీ వద్ద ఆదివారం రాత్రి వరదలో కొట్టుకుపోయిన నవీన్‌కుమార్‌. * కేంద్రంలో తెచ్చిన వ్యవసాయ బిల్లులతో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య సాగుతున్న విమర్శ, ప్రతి విమర్శలు. * కేంద్ర బిల్లులతో రైతులకు మేలని బీజేపీ వర్గాలు, కొత్తగా తెచ్చిన బిల్లులతో రైతులను తీవ్ర నష్టమని టీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు. 280వ రోజుకు చేరుకున్న రాజధాని అమరావతి రైతుల ఉద్యమం. కొనసాగుతున్న శిబిరాల్లో రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం. నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ జరిగే అవకాశం. బుధవారం తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సి ఉన్నా మంగళవారం ఆకస్మిక ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం గమనార్హం. రాష్ట్రంలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ, షాలతో చర్చకు అవకాశం. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం.

కేసీఆర్ ‘ప్రజా కృతజ్ఞత సభ’.. హుజూర్‌నగర్‌కు వరాల జల్లు

26-10-201926-10-2019 18:38:13 IST
2019-10-26T13:08:13.718Z26-10-2019 2019-10-26T13:08:08.412Z - - 22-09-2020

కేసీఆర్ ‘ప్రజా కృతజ్ఞత సభ’.. హుజూర్‌నగర్‌కు వరాల జల్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్ కంచుకోట హుజూర్ నగర్ లో భారీ మెజారిటీతో టీఆర్ఎస్ ను గెలిపించిన ఓటర్లకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్. పద్మావతిరెడ్డిపై 43,358 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ బహిరంగసభ సందర్భంగా హుజూర్‌నగర్‌కు వరాలు ప్రకటిస్తారన్న వార్తలు హల్ చల్ చేశాయి. అవినిజమేనని తేలింది. 

హుజూర్ నగర్ నియోజకవర్గదంలో ఉన్న 134 గ్రామపంచాయితీలకు ఒక్కో గ్రామపంచాయితీకి 20 లక్షలు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేస్తానన్నారు. దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల అవుతుందన్నారు. ఏ గ్రామంలో ఏఏ పనులు చేపట్టాలో మీరే నిర్ణయించుకోండన్నారు.

ప్రతి మండల కేంద్రానికి 30 లక్షలు కేటాయించారు సీఎం. ఈ బహిరంగ సభకు ప్రజా కృతజ్ఞత సభగా పేరు పెట్టారు. హుజూర్ నగర్ పట్టణానికి 25 కోట్లు కేటాయించారు. పరిశుభ్రమయిన పట్టణంగా తీర్చిదిద్దండని నేతలకు సూచించారు. రాష్ట్రంలో ప్రతీ ఎకరాకు నీళ్లు తెచ్చే బాధ్యత తనదేనని సభలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. 

‘గోదావరి నీళ్లు నాగార్జునసాగర్‌ లెఫ్ట్‌ కెనాల్‌కు రావాలి. వచ్చే బడ్జెట్‌లో నియోజకవర్గానికి నిధులు మంజూరు చేస్తాం. అవసరమైన లిఫ్ట్‌లు, కాలువలు నిర్మిస్తాం’ అన్నారు కేసీఆర్. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ముందుకు సాగుతున్నానన్నారు. 

నేరేడుచర్ల పట్టణాభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించారు. బంజారా భవన్ ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం కేసీఆర్. హుజూర్ నగర్ కు రెవిన్యూ డివిజన్ కేటాయించారు. ఈఎస్ఐ ఆస్పత్రి కూడా ఏర్పాటుచేస్తామన్నారు. గిరిజన విద్యార్ధుల కోసం గిరిజన పాఠశాల మంజూరు చేశారు. సభలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సభకు భారీగా జనసమీకరణ చేశారు టీఆర్ఎస్ నేతలు. 

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు ఆయనే..!

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు ఆయనే..!

   3 minutes ago


ఆంధ్రప్రదేశ్ లో అణు విద్యుత్ కేంద్రం

ఆంధ్రప్రదేశ్ లో అణు విద్యుత్ కేంద్రం

   24 minutes ago


నిందలూ, ఆరోపణలతో మహా సర్కార్ పబ్బం..!

నిందలూ, ఆరోపణలతో మహా సర్కార్ పబ్బం..!

   7 hours ago


 మీ సేవలు ప్రజలకు అందకపోతే మీ చదువుతో ఏం లాభం.. వైద్యులకు ఈటెల ప్రశ్న

మీ సేవలు ప్రజలకు అందకపోతే మీ చదువుతో ఏం లాభం.. వైద్యులకు ఈటెల ప్రశ్న

   8 hours ago


ఒక్క యాప్‌తో 87 రకాల పోలీస్ సేవలు.. ఏపీ కొత్త రికార్డు

ఒక్క యాప్‌తో 87 రకాల పోలీస్ సేవలు.. ఏపీ కొత్త రికార్డు

   9 hours ago


చిన్నారి సుమేధ మృతిపై మేయర్ బొంతు రామ్మోహన్ అనుమానం..

చిన్నారి సుమేధ మృతిపై మేయర్ బొంతు రామ్మోహన్ అనుమానం..

   21 hours ago


బడా రైతులు, భూస్వాముల దోపిడీకి చట్టబద్ధత- అగ్రో బిల్లులు

బడా రైతులు, భూస్వాముల దోపిడీకి చట్టబద్ధత- అగ్రో బిల్లులు

   21 hours ago


ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

   21 hours ago


స్టేటస్ సింబల్ గా పులస.. రూ.21 వేలకు పులస దక్కించుకున్న వైసీపీ నేత

స్టేటస్ సింబల్ గా పులస.. రూ.21 వేలకు పులస దక్కించుకున్న వైసీపీ నేత

   21 hours ago


భారీ విధ్వంసం సృష్టించనున్న మావోయిస్టులు.. వరంగల్ లో హై అలర్ట్

భారీ విధ్వంసం సృష్టించనున్న మావోయిస్టులు.. వరంగల్ లో హై అలర్ట్

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle