newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

కేసీఆర్ దురుసు వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం

30-10-201930-10-2019 16:46:09 IST
2019-10-30T11:16:09.119Z30-10-2019 2019-10-30T11:15:52.409Z - - 22-02-2020

కేసీఆర్ దురుసు వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రదర్శిస్తున్న అహంభావపూరితమైన వైఖరిని, సమ్మెకు సంబంధించి కోర్టు ఆదేశాల పట్ల ఆయన నిర్లక్ష్య వైఖరిని తెలంగాణ హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ అధికారాలను ప్రశ్నించే అధికారం న్యాయస్థానాలకు లేదని, ఆర్టీసీని ప్రైవేటీకరించాలని తాను నిర్ణయించుకుంటే న్యాయస్థానాలు ఏవీ చేయలేవని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కోర్టుకు తెలియడంతో కేసీఆర్ వ్యాఖ్యలను హైకోర్టు రాజ్యాంగపరమైన విధుల ఉల్లంఘనకింద పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. 

ముఖ్యంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ సిబ్బందికి తాను వేతనాలు చెల్లించకున్నా హైకోర్టు తననేమీ చేయలేదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను హైకేర్టు చాలా తీవ్రంగా భావిస్తోంది. కోర్టు నన్నేం చేస్తుంది కొడుతుందా అంటూ కేసీఆర్ గతవారం విలేకరులు అడిగిన ప్రశ్నకు నిర్లక్ష్యపూరితంగా సమాధానమివ్వడం కోర్టు దృష్టికి వచ్చింది. 

రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం ఆర్టీసీ సమ్మెపై సాగుతున్న విచారణ సమయంలో ప్రతిఫలించింది. సమ్మె చేయడం సిబ్బంది హక్కు కాబట్టి ఉద్యోగులను సమ్మె విరమించాలంటా తాను ఆదేశించలేనని హైకోర్టు న్యాయమూర్తులు తేల్చిచెప్పారు. అయితే అదే సమయంలో ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం పడ్డ బకాయలన్నింటినీ చెల్లించాల్సిందిగా తాను కోరగలనని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలంటూ ఏమీ లేవని అడ్వకేట్ జనరల్ బీఎన్ ప్రసాద్ చెప్పడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. వాస్తవాలను దాస్తున్నందుకు అడ్వకేట్‌ను నిలదీసింది.  దీనిపై ఘాటుగా స్పందించిన హైకోర్టు.. ఆర్టీసీకి ఎంత ఇచ్చారో చెప్పామనలేదని, బకాయిలు ఎంత ఉన్నాయో స్పష్టంగా తెలపాలని ప్రశ్నించింది. 

రూ.4253 కోట్లు ఇస్తే.. బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. తమకు సమర్పించే నివేదికలో అధికారులు అతితెలివి ప్రదర్శిస్తున్నారని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీసీకి కేటాయించిన నిధులను ఎలా క్యాటగిరి చేశారని, బ్యాంక్ గ్యారంటీకి ఇచ్చిన నిధుల్లో డీ ఫాల్టర్ మీరే కదా అని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.

ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ. 1,099 కోట్ల అరియర్ల రీయింబర్స్‌మెంట్‍ విషయమై కోర్టు ప్రశ్నించినప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు 42 : 58 నిష్పత్తిలో ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉందని ప్రసాద్ వివరించారు. కానీ అడ్వకేట్ జనరల్ సమాధానం పట్ల అసంతృప్తి చెందిన న్యాయస్థానం ఆర్టీసీకి  తన వంతుగా చెల్లించాల్సిన మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా చెల్లించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.

కానీ హైకోర్టు ఆదేశాల మేరకు రూ. 47 కోట్లు వెంటనే ఇవ్వలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కొంత గడువు ఇస్తే ప్రయత్నిస్తామని తెలిపింది. దీంతో ప్రభుత్వ వాదనతో ఏకీభవించని ధర్మాసనం.. ఉపఎన్నిక జరిగే చోట రూ.100 కోట్ల వరాలు ప్రకటించడంపై సెటైర్లు వేసింది. ప్రభుత్వానికి ఒక్క నియోజకవర్గం ప్రజలు ముఖ్యమా లేక రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా అని ప్రశ్నించింది. హుజూర్‌నగర్‌లో రూ.100 కోట్ల వరాలు ప్రకటించిన ప్రభుత్వానికి ప్రజల ఇబ్బందులు తొలగించడానికి రూ.47 కోట్లు ఇవ్వలేరా అని ప్రశ్నల వర్షం కురిపించింది. 

అలాగే సరూర్ నగర్‌ ప్రాంతంలో ఆర్టీసీ తలపెట్టిన బహిరంగ సభకు అనుమతి నిరాకరించినందుకు కేసీఆర్ ప్రభుత్వాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఆర్టీసీ యూనియన్లు సభ నిర్వహించుకోవడానికి కోర్టు అనుమతిస్తూ అందుకు తగిన ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మంగళవారం విచారణ సందర్భంగా కోర్టు స్పందనను గమనిస్తుంటే ఆర్టీసీ సిబ్బంది పక్షాన్నే న్యాయస్థానం నిలవనున్నట్లు సంకేతాలు వెలుపడుతున్నాయి. సిబ్బందికి జీతాలు చెల్లించకుండే కోర్టు నన్నేమైనా కొడుతుందా అంటూ కేసీఆర్ చేసిన తీవ్రవ్యాఖ్యలు సిబ్బంది సమ్మె విషయంలో హైకోర్టు వైఖరిని పూర్తిగా మలుపు తిప్పినట్లు భావిస్తున్నారు. 

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   4 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   5 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   6 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   7 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   8 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   8 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   10 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   10 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   10 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   11 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle