newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

కేసీఆర్ డెడ్ లైన్‌ని లెక్కచేయలేదా?.. విధుల్లో చేరింది 487 మంది

06-11-201906-11-2019 13:26:05 IST
2019-11-06T07:56:05.961Z06-11-2019 2019-11-06T07:56:01.429Z - - 24-02-2020

కేసీఆర్ డెడ్ లైన్‌ని లెక్కచేయలేదా?.. విధుల్లో చేరింది 487 మంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సాక్షాత్తూ సీఎం కేసీఆర్ డెడ్ లైన్ విధించారు. ఆర్టీసీ కార్మికులకి నిన్న అర్ధరాత్రితో డెడ్ లైన్ ముగిసింది. సిఎం పెట్టిన గడువును పట్టించుకోలేదు కార్మికులు. ఈ నేపథ్యంలో సిఎం తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విధులలో చేరకుంటే మిగిలిన 5000 బస్సులను ప్రైవేటీకరిస్తా అన్నారు సీఎం కేసీఆర్. కానీ కార్మికుల నుంచి అంతగా స్పందన కనిపించలేదు. మొత్తం 487 మంది మాత్రమే విధుల్లో చేరడంతో కేసీఆర్ మాటను ఎవరూ లెక్కచేయలేదని భావించవచ్చు. 

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 33 రోజులుగా సమ్మె నిరాటంకంగా సాగుతోంది. ఇటు ఆర్టీసీ జేఏసీ-ప్రభుత్వం ఎవరూ తగ్గడం లేదు.  కార్మికుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. 

మంగళవారం రాత్రిలోగా విధుల్లో చేరకుంటే తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాలను పోగొట్టుకున్నట్టేనని ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టినా, కార్మికులు మాత్రం బెట్టు వీడలేదు. అర్థరాత్రి దాటే సమయానికి దాదాపు 50 వేల మంది ఉద్యోగుల్లో కేవలం 360 మంది మాత్రమే విధుల్లోకి చేరుతామని చెబుతూ లేఖలు అందించారు.

వీరిలో డ్రైవర్లు, కండక్టర్ల బదులు హైదరాబాద్ బస్ భవన్ లోని పరిపాలనా సిబ్బందే అత్యధికులు ఉండటం గమనార్హం. ఈ సిబ్బందిలోనే 200 మంది వరకూ విధుల్లో చేరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 62 మంది, హైదరాబాద్ జోన్ లో 31 మంది, ఇతర డిపోల్లో మిగతావారు విధుల్లోకి చేరేందుకు ముందుకు వచ్చారు.

ఆర్టీసీ సమ్మె సాగుతుండడంతో ప్రయాణికులు, విద్యార్ధులు నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కాలేజీలకు వెళ్లే విద్యార్ధులు బస్సు వెనుక రాడ్ లు పట్టుకుని వెళ్ళడం ఆందోళన కలిగిస్తోంది. బస్సులు తిరుగుతున్నాయని అధికారులు చెబుతున్నా ఉదయం పూట తప్ప రాత్రి 7-8 గంటలు దాటాక హైదరాబాద్ రోడ్ల మీద అక్కడక్కడా ఒక్కో బస్సు మాత్రమే కనిపిస్తోంది. దీంతో ఆటోలను ఆశ్రయించక తప్పడంలేదు. శివారుప్రాంతాల్లో ఉండే కంపెనీ బస్సులే వారికి దిక్కవుతున్నాయి.

ఆటోవాలాలు ఇదే అదనుగా భావించి డబుల్ రేట్లు తీసుకుంటున్నారు. పదిరూపాయల ఛార్జి గతంలో వసూలు చేస్తే రెండుమూడు కిలోమీటర్ల దూరానికే ఇప్పుడు 20-30 రూపాయలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు.

బస్సులు సరిగా తిరగకపోవడంతో తమ గమ్యస్థానానికి చేరలేకపోతున్నారు. సమ్మెను కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికులు వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, మానవహారాలు చేపట్టారు. నేటితో సమ్మె 33వ రోజుకు చేరగా, కార్మికులు సైతం సమ్మెను విరమించేది లేదంటున్నారు.

సీఎం ఇచ్చిన గడువును ఎవరూ లెక్కచేయలేదని, 1 శాతం కూడా విధుల్లో చేరలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వథ్థామరెడ్డి అన్నారు. ప్రైవేటు పర్మిట్లు ఇవ్వడం ఒక్క సంతకంతో అయిపోదని, అందుకు కేంద్రం ఒప్పుకోవాలన్నారు. అసెంబ్లీని సమావేశపరచాలన్నారు. ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి సీరియస్ చర్చలకు ఉపక్రమించాలని మేధావులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle