newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు *ఈసారి భక్తులు లేకుండానే భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు *కరోనా వ్యాక్సిన్ తయారీకి సన్నాహాలు-కేంద్ర ఆరోగ్య శాఖ* అమెరికాలో సమ్మర్ ఇంటర్న్ షిప్ లు రద్దు ... భారతీయ విద్యార్థులకు భారీ నష్టం *కరోనా కేసులకు ప్రాంతాలుగా 10 హాట్ స్పాట్ లు... ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, యూపీలోని 10 ప్రాంతాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదు అయినట్టు గుర్తింపు-కేంద్రం *తెలంగాణలో నిన్న 30 మందికి కరోనా నిర్ధారణ, ముగ్గురు మృతి, రాష్ట్రంలో తొమ్మిదికి చేరిన కరోనా మృతుల సంఖ్య*తెలంగాణలో 127 , ఆంధ్రప్రదేశ్ లో 111 కరోనా పాజిటివ్ కేసులు*భారత్ లో క్రమంగా పెరుగుతోన్న కరోనా.. నిన్న ఒకేరోజు 437 కొత్త కేసులు నమోదు, దేశంలో 1834 కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య*ఏపీలో 111 కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు... నిన్న ఒక్కరోజే 67 కొత్త కేసులు నమోదు

కేసీఆర్ ఎవ‌రిని క‌నిక‌రిస్తారో..?

11-12-201911-12-2019 12:25:50 IST
Updated On 11-12-2019 12:29:16 ISTUpdated On 11-12-20192019-12-11T06:55:50.282Z11-12-2019 2019-12-11T06:55:48.570Z - 2019-12-11T06:59:16.844Z - 11-12-2019

కేసీఆర్ ఎవ‌రిని క‌నిక‌రిస్తారో..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్ర స‌మితి ఏర్పడిన నాటి నుంచి ఆ పార్టీకి ఎప్పుడూ క‌లిసి రాలేదు ఖ‌మ్మం జిల్లా. మొద‌ట్లో జిల్లాలో ఆ పార్టీకి స‌రైన నాయ‌క‌త్వం లేక ఇబ్బంది ప‌డింది.

ఇప్పుడు మాత్రం నాయ‌కులు ఎక్కువై ఇబ్బంది ప‌డుతోంది. ముఖ్యంగా జిల్లా పార్టీ వ‌ర్గాలుగా చీలిపోయి ఉంది. అందుకే, 2018 ఎన్నిక‌ల్లో రాష్ట్ర‌వ్యాప్తంగా టీఆర్ఎస్ హ‌వా వీచినా ఖ‌మ్మం జిల్లాలో మాత్రం టీఆర్ఎస్‌కు భంగ‌పాటు తప్ప‌లేదు. కేవ‌లం ఒకే స్థానానికి ఆ పార్టీ ప‌రిమితం అయ్యింది.

జిల్లాలో కీల‌క నేత‌లుగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు రెండువ‌ర్గాలుగా పార్టీని న‌డిపించారు. ఈ రెండు వ‌ర్గాల‌కు స‌మ‌న్వ‌యం లేక‌పోవ‌డం, లోపాయికారి రాజకీయాల‌కు పాల్ప‌డ‌టంతో జిల్లాలో ఎక్కువ స్థానాల‌ను ఆ పార్టీ గెల‌వ‌లేక‌పోయింది. ఇదే విష‌యాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా చెప్పారు. త‌మ నేత‌లే ఒక‌రినొక‌రు ఓడించుకున్నార‌ని ఆయ‌న గుర్తించారు.

దీంతో ఇద్ద‌రు నేత‌ల‌కూ ప‌నిష్‌మెంట్ ఇచ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు కేసీఆర్‌. తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావును ఈసారి మంత్రివ‌ర్గంలోకి తీసుకోలేదు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆయ‌నకు అవ‌కాశం ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రిగినా ఆయ‌న‌ను కాకుండా అదే సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన పువ్వాడ అజ‌య్‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు.

ఇక‌, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ‌ల‌మైన నాయ‌కుడు అయినా, గెలిచే అవ‌కాశాలు ఉన్నా, సిట్టింగ్ ఎంపీ అయినా మ‌ళ్లీ టిక్కెట్ ఇవ్వ‌లేదు. ఇలా ఇద్ద‌రు ముఖ్య నేత‌ల‌కూ కేసీఆర్ ప‌నిష్‌మెంట్ ఇచ్చిన‌ట్లు చేశారు.

కానీ, ఇద్ద‌రు నేత‌ల‌నూ పార్టీలోనే ఉంచ‌గ‌లిగారు కేసీఆర్‌. ఇద్ద‌రికీ భ‌విష్య‌త్‌పై హామీ ఇచ్చారు. ఖ‌మ్మం ఎంపీ సీటును క‌లిసిక‌ట్టుగా పనిచేసి గెలిపించే బాధ్య‌త‌ను పొంగులేటి, తుమ్మ‌ల‌పై పెట్టారు.

దీంతో వీరిద్ద‌రూ క‌లిసి ఖ‌మ్మం ఎంపీగా నామా నాగేశ్వ‌ర‌రావును గెలిపించారు. దీంతో ఇప్పుడు వీరిద్ద‌రికి తోడుగా మంత్రిగా అజ‌య్‌, ఎంపీగా నామా నాగేశ్వ‌ర‌రావు జిల్లాలో కీల‌క నేత‌లుగా మారారు.

ప‌ద‌వులు లేక‌పోయినా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి యాక్టీవ్‌గా ఉంటున్నారు. గ‌తంలోలానే త‌ర‌చూ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్లో ఉండే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌న‌కు అవ‌కాశం ల‌భిస్తుంద‌ని ఆయ‌న భావించారు. కానీ, ఆయ‌న‌కు అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌డంతో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా అవ‌కాశం ఇస్తార‌ని పొంగులేటి ధీమాగా ఉన్నారు. ఈ ప‌ద‌వి కూడా ఇవ్వ‌క‌పోతే మ‌రో నాలుగేళ్ల పాటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖాళీగా ఉండాల్సిందే.

ఇక‌, మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కూడా రాజ్య‌స‌భ అవ‌కాశం ల‌భిస్తుంద‌నే ఆశ‌తో ఎదురుచూస్తున్నారు. ఆయ‌న కూడా జిల్లా పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

ముఖ్య‌మంత్రితో ఉన్న సాన్నిహిత్యం, జిల్లాలో సీనియ‌ర్ నేత కావ‌డంతో ఆయ‌న‌కు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా అవ‌కాశం ల‌భిస్తుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. వీరిద్ద‌రిలో ఎవ‌రికి ఇచ్చినా ఇంకో నేత అసంతృప్తికి గుర‌య్యే అవ‌కాశం ఉంది. ఇదే స‌మ‌యంలో ఒకే జిల్లా నుంచి ఇద్ద‌రికి ఇచ్చే అవ‌కాశం లేదు. మ‌రి, ఇద్ద‌రిలో కేసీఆర్ ఎవ‌రిని క‌నిక‌రిస్తారో చూడాలి.

 

అప్సుడు జీన్స్ హబ్... ఇప్పుడు మాస్క్‌ల తయారీ అడ్డా!

అప్సుడు జీన్స్ హబ్... ఇప్పుడు మాస్క్‌ల తయారీ అడ్డా!

   3 hours ago


తెలుగు రాష్టాలలో నిఘా వ్యవస్థ నిద్రలోకి జారుకుందా?

తెలుగు రాష్టాలలో నిఘా వ్యవస్థ నిద్రలోకి జారుకుందా?

   3 hours ago


కాలుజారి మరణిస్తే వైద్యులపై రోగి బంధువుల దాడి.. గాంధీలో విధ్వంసం

కాలుజారి మరణిస్తే వైద్యులపై రోగి బంధువుల దాడి.. గాంధీలో విధ్వంసం

   4 hours ago


జగన్‌కు మీడియా ఫోబియా.. రికార్డెడ్ ప్రెస్‌మీట్లు షురూ!

జగన్‌కు మీడియా ఫోబియా.. రికార్డెడ్ ప్రెస్‌మీట్లు షురూ!

   5 hours ago


గోవులపై కరోనా ఎఫెక్ట్ .. దాణా కరువై ఆకలి అరుపులు

గోవులపై కరోనా ఎఫెక్ట్ .. దాణా కరువై ఆకలి అరుపులు

   6 hours ago


ప్రధాని మోడీ, అమిత్ షాతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

ప్రధాని మోడీ, అమిత్ షాతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

   7 hours ago


శంషాబాద్ నుంచి జర్మనీకి 38మంది తరలింపు

శంషాబాద్ నుంచి జర్మనీకి 38మంది తరలింపు

   8 hours ago


సింగరేణి  గనులలో లే ఆఫ్.. ఎమర్జెన్సీ ఉద్యోగులకు మినహాయింపు

సింగరేణి గనులలో లే ఆఫ్.. ఎమర్జెన్సీ ఉద్యోగులకు మినహాయింపు

   9 hours ago


గ్రామ వలంటీర్లకు జైహో.. ఒక్కరోజులో 93 శాతం మందికి ఫించన్లు

గ్రామ వలంటీర్లకు జైహో.. ఒక్కరోజులో 93 శాతం మందికి ఫించన్లు

   10 hours ago


ఒంటిమిట్టపై ఎందుకీ వివక్ష... చంద్రబాబు ఆవేదన

ఒంటిమిట్టపై ఎందుకీ వివక్ష... చంద్రబాబు ఆవేదన

   10 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle