newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

కేసీఆర్ ఆలోచనేంటి? ఆర్టీసీ కార్మికులకు షాకేనా?

22-11-201922-11-2019 08:41:19 IST
2019-11-22T03:11:19.154Z22-11-2019 2019-11-22T03:10:55.849Z - - 22-02-2020

కేసీఆర్ ఆలోచనేంటి? ఆర్టీసీ కార్మికులకు షాకేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచనేంటి?

కార్మికులు సమ్మె విరమించినా డ్యూటీల్లో చేరేది ఎప్పుడు?

కేసీఆర్ విధించే షరతులు ఏంటి?

ప్రైవేట్ పర్మిట్లు షురూ

సమ్మె విరమణపై జేఏసీల మధ్య  ఏకాభిప్రాయం లేదా? 

సమ్మె కాలంలో జీతం సంగతేంటి? 

పాత బకాయిలు చెల్లిస్తారా? 

చనిపోయిన కార్మిక కుటుంబాల పరిస్థితేంటి? 

...ఇవే ప్రశ్నలు అటు ఆర్టీసీ కార్మికులు, ఇటు సాధారణ ప్రజానీకాన్ని తొలిచేస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై చాలా కఠినంగా వ్యవహరించారు.  ఏమీ సాధించకుండానే ఆర్టీసీ జేఏసీ సమ్మెకు ఫుల్ స్టాఫ్ పెట్టింది. సమ్మెకు స్వస్తి చెప్పి షరతులు లేకుండా డ్యూటీలో చేరతామని ప్రకటించినా.. కేసీఆర్ మాత్రం ఇంకా ఏ నిర్ణయం ప్రకటించలేదు. ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ ఇవ్వడానికే కేసీఆర్ కాలయాపన చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. 

ఇదిలా ఉంటే.. ఆర్టీసీ కార్మికులపై నిర్ణయాన్ని ఆర్టీసీ యాజమాన్యం సీఎం కేసీఆర్ చేతిలో పెట్టింది.  తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమీక్ష గురువారం రాత్రి వరకూ సాగింది. అంతకుముందు ఆర్టీసీ ఇన్ ఛార్జి ఎండీ సునీల్ శర్మ అధికారులతో భేటీ అయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, తదనంతర పరిణామాలు, సమ్మె ముగింపు, ఉద్యోగులను విధుల్లోకి తీసుకునే విషయాలను చర్చించారు. ఈ సమావేశం వివరాలను సునీల్ శర్మ సీఎం కేసీయార్ కు వివరించారు.

అనంతరం జరిగిన సమీక్షలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం పెండింగ్ లో పెట్టారు. ఆ వివరాలను శుక్రవారం వెల్లడించే అవకాశం ఉంది. సమీక్ష ముగిసిన వెంటనే సమ్మెపై ప్రభుత్వం నిర్ణయం వెలువడుతుందని భావించింది ఆర్టీసీ జేఏసీ.

ఆర్టీసీ ప్రైవేటీకరణ, పర్మిట్ల గురించి శుక్రవారం హైకోర్టులో విచారణ ఉండడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇవాళ హైకోర్టు వెలువరించే తీర్పును పరిశీలించిన తర్వాతే ప్రభుత్వ నిర్ణయం ప్రకటించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఆర్టీసీ సమ్మె విరమణ విషయంలో టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీలో చీలికలు వచ్చాయని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తామంతా ఐకమత్యంతో ఉన్నామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెబుతున్నారు. కార్మికులు తమను తక్షణం విధులలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కార్మికులను విధులలోకి తీసుకుంటే షరతులు విధించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకునే క్రమంలో ఎలాంటి షరతులు విధించాలి ? ఎలాంటి షరతులు పెడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. 

ఆర్టీసీలోని 5,100 రూట్లను ప్రైవేటీకరించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం... ఈ నిర్ణయాన్ని సాధ్యమైనంత తొందరగా అమలు చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

కాబట్టి కార్మికులు విధుల్లో చేరడానికి ముందే షరతులు విధించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు లేకుండా... సమ్మెలకు దిగకుండా కఠినంగా నిబంధనలు విధించనుంది. 

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   4 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   5 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   6 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   6 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   7 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   7 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   9 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   10 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   10 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle