newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేసీఆర్ ఆదేశాల పాతర.. స్టేషన్ ఘన్ పూర్‌లో వైన్ షాపుల జాతర

23-03-202023-03-2020 11:01:31 IST
Updated On 23-03-2020 14:32:28 ISTUpdated On 23-03-20202020-03-23T05:31:31.306Z23-03-2020 2020-03-23T05:31:24.084Z - 2020-03-23T09:02:28.734Z - 23-03-2020

కేసీఆర్ ఆదేశాల పాతర.. స్టేషన్ ఘన్ పూర్‌లో వైన్ షాపుల జాతర
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించారు సీఎం కేసీయార్. అంతేకాదు వైన్ షాపులను కూడా బంద్ చేస్తున్నామని కేసీయార్ అన్నారు. కానీ సీఎం మాటను కొంతమంది వైన్ షాపు యజమానులు ఖాతరు చేయడం లేదు.  వైన్స్ షాపుల సంగతి ఏంటి? అని మీడియా ప్రతినిధి అడిగితే కేసీఆర్.. మీకు అవసరం ఉందా? అంటూ చమత్కరించారు. అంతేకాదు, తెలంగాణలో  100 శాతం వైన్స్ షాపులు కూడా బంద్ చేస్తామని చెప్పారు. ఇంతకుముందే బార్లు, పబ్స్ మూసివేశామని, రాష్ట్రంలో అన్ని వైన్ షాపులన్నీ మూసివేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

సీఎం చెప్పిందానికి వాస్తవంగా జరుగుతున్నదానికి చాలా తేడా కనిపిస్తోంది. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైన్ షాపులు బార్లా తెరిచారు. తెలంగాణలో లాక్ డౌన్ వున్నా మందుబాబులకు మాత్రం పండగ వాతావరణం కనిపిస్తోంది.  సాక్షాత్తు స్టేషన్గన్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ  ఎదురుగా ఉన్న షాప్ లో విచ్చలవిడిగా పొద్దున పొద్దున్నే కొన్ని వందల మద్యం కార్టన్ లు అమేస్తున్నారు. ఈ షాప్ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు గ్రామస్తులు కోరుతున్నారు. అంతేకాదు దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

ఇటు జనగాంలోనూ అదే పరిస్థితి. ఉదయం ఆరుగంటల నుంచే మందు దొరుకుతోంది. మందుబాబుల చేతుల్లో మద్యం సీసాలు కనిపించాయి. అత్యవసర సేవల సంస్థల్లో పాలు, మెడికల్ షాప్స్, ఆస్పత్రులు, ఫైర్ సర్వీసెస్, వాటర్, విద్యుత్, గ్యాస్, పెట్రోల్ బంకులు ప్రజల అవసరాలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

అయితే, మద్యం షాపులు అత్యవసర సేవల్లో చేర్చారా అని కొంతమంది స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఐదుగురికి మించి జనం గుమిగూడవద్దని ఆదేశాలు వుంటే వాటిని మద్యం షాపు యజమానులు తుంగలో తొక్కుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో జనతా కర్ఫ్యూ కారణంగా వైన్ షాపులను బంద్ చేశారు. తెలంగాణ వైన్‌ డీలర్లు స్వచ్ఛందంగా తమ మద్దతును ప్రకటించారు. అయితే గ్రామాల్లోనూ, చిన్న చిన్న పట్టణాల్లోనూ సీఎం కేసీఆర్ ఆదేశాలు అమలు కావడం లేదు. ఎక్సైజ్ అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   12 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   16 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   18 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   13 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   20 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   20 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   13 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   15 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle