newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

22-02-202022-02-2020 09:56:03 IST
2020-02-22T04:26:03.482Z22-02-2020 2020-02-22T04:24:22.223Z - - 07-04-2020

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ప్రభుత్వం పాలనపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికలు అన్నీ ముగియడంతో సీఎం కేసీయార్ తన మంత్రివర్గ సహచరుల పనితీరుని మదింపు చేస్తున్నారు. కొంతమంది మంత్రులపై ఆయన గుర్రుగా వున్నారు. మంత్రులకు అప్పగించిన శాఖలు, వారి సమర్థత విషయంలో కేసీఆర్ ఆసంతృప్తితో ఉన్నట్లు ప్రగతి భవన్ వర్గాలు అంటున్నాయి. తన కుమారుడు కేటీయార్ కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించే ముందు మంత్రివర్గాన్ని ఆయనకు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

మంత్రివర్గంలో కొందరు ఐటీ శాఖ మంత్రి కేటీయార్ పట్ల వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో భవిష్యత్ లో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే సరైన బాటను వేయాలని కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. శాసనసభ్యుల్లో తనకు అనుకూలమయిన కొందరికి కేటీఆర్ ఇప్పటికే హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు వారిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చుననే ప్రచారం జరుగుతోంది. 

ప్రస్తుత మంత్రుల్లో జగదీష్ రెడ్డి, మల్లారెడ్డితో పాటు మరో ఇద్దరు మంత్రుల పనితీరుపై కేటీఆర్ ఆగ్రహంగా ఉన్నరంటున్నారు. వీరిలో జగదీశ్వర రెడ్డి మినహా మిగిలిన వారిపై కేసీఆర్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు సమచారం.

గతంలో జగదీశ్వర్ రెడ్డిపై విమర్శలు వచ్చినా కాంగ్రెస్ కంచుకోటలాటి హుజూర్ నగర్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధి సానా యాదిరెడ్డిని గెలిపించడంతో ఆయనపై కొంత సానుకూల దృక్పథం ఏర్పడింది. 

అటు తన నిర్ణయం, ఇటు కుమారుడి ఆలోచన ఒకేలా ఉండడంతో మంత్రివర్గంలో కొందరిని తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ఇలా మంత్రివర్గంలో మార్పులు చేసి మెల్లిగా కేటీఆర్‌కు అనుకూల వాతావరణం తీసుకురావాలనేది సీఎం కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల సమావేశంలో సరిగా పని చేయని వారు తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనంటూ సీఎం కేసీఆర్ హెచ్చరించారు. దీని వెనుక ఉద్దేశం కూడా ఇదే. 

మంత్రులకు కూడా ఇదే హెచ్చరిక పనిచేస్తుందని. కేసీయార్ ఈ విషయం చెప్పకనే చెబుతున్నారని అంటున్నారు. మంత్రుల్లో కొందరిని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని, మంత్రులను కొందరిని మార్చేందుకు ఈ హెచ్చరిక పావుగా ఉంటుందని గులాబీ నేతలు అంటున్నారు. తనయుడు కేటీఆర్ నిర్ణయం మేరకు మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పార్టీ సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారు. 

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

   5 hours ago


కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

   9 hours ago


తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

   9 hours ago


కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

   12 hours ago


ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

   15 hours ago


బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

   15 hours ago


‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

   15 hours ago


డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

   16 hours ago


గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

   18 hours ago


లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

   18 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle