newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

కేసీఆర్‌ మెత్తబడినట్టేనా.. కేశవరావు రాయబారంతో సమ్మె ఆగుతుందా?

15-10-201915-10-2019 08:14:06 IST
2019-10-15T02:44:06.717Z15-10-2019 2019-10-15T02:43:58.845Z - - 22-02-2020

కేసీఆర్‌ మెత్తబడినట్టేనా.. కేశవరావు రాయబారంతో సమ్మె ఆగుతుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ట్రబుల్ షూటర్ గా ఆర్టీసీ సమస్యను కెకె పరిష్కరిస్తారా?

కేసీఆర్ మెత్తబడినట్టేనా?

ఆర్టీసీ జేఏసీ వైఖరి ఎలా ఉండబోతోంది?

ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉధృతరూపం దాలుస్తోంది. కార్మికులతో పాటు ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు రోడ్లుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నాయి. వంటావార్పులు, నిరసనలతో రాష్ట్రం హోరెత్తుతోంది.

దీనికితోడు ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్‌ వైఖరిని నిరసిస్తూ.. ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీకాంత్‌రెడ్డి, మరో డ్రైవర్‌ సురేందర్‌రెడ్డిలు ఆత్మహత్యలకు పాల్పడటంతో కార్మికులు ఆగ్రహానికి లోనవుతున్నారు. సమ్మెను మరింత ఉధృతంచేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో అప్రమత్తమైన కేసీఆర్‌ తన మొండివైఖరిని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

టీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పలు డిమాండ్‌లతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ అవి విఫలం కావటంతో కార్మికులు సమ్మెబాట పట్టారు.

కానీ దసరా పండుగ ముందు సమ్మెకు ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునివ్వడంతో సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు సమ్మెలో పాల్గొనాలని, లేకుంటే వారు తమంతట తామే ఉద్యోగాలకు రాజీనామాలు చేసినట్లు అవుతుందని కేసీఆర్‌ హెచ్చరించారు. అయినా కార్మికులు విధుల్లో పాల్గొనకుండా సమ్మెను మరింత ఉధృతం చేశారు.

సీఎం కేసీఆర్‌ బెదిరింపులకు పాల్పడుతున్నాడని, ఆయన బెదరింపులకు భయపడబోమని సమ్మెను కొనసాగించారు. ఆర్టీసీ కార్మికులకు తోడు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ, వామపక్షాలు, జనసమితి, ప్రజా సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. దీంతో ఒక్కసారిగా సమ్మె ఉధృత రూపందాల్చింది.

సమ్మెను విచ్ఛన్నం చేసేందుకు ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపించే ప్రయత్నం చేసింది. గత రెండు రోజుల క్రితం డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడటంతో పరిస్థితి తీవ్ర రూపందాల్చింది. దీంతో కార్మికులతో పాటు ప్రజానీకంసైతం కేసీఆర్‌ నిర్ణయంపై వ్యతిరేఖత వ్యక్తం చేశారు.

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం పడుతుందని టీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఉప ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన సీపీఐ తన మద్దతును ఉపసంహరించుకొనేందుకు సిద్ధమైంది. మరోవైపు రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ నాయకత్వం ఈ సమ్మెను ఆసరాగా చేసుకొని అధికార పార్టీపై పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు సాగిస్తుంది.

వీటన్నింటిని గమనించిన సీఎం కేసీఆర్‌ కార్మికులతో మరోసారి చర్చలు జరిపి సమ్మె ఉధృతిని తగ్గిస్తే బాగుంటుందనే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. లేకుంటే సమ్మె ఉధృతమైతే అటు ఉప ఎన్నికల్లో నష్టపోవటమే కాకుండా, మున్ముందు కాలంలో బీజేపీ బలోపేతానికి అవకాశం ఇచ్చినట్లవుతుందని కేసీఆర్‌ భావించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆరే నేరుగా తగ్గినట్లు కాకుండా పార్టీలోని సీనియర్‌ నేతలతో కేసీఆర్‌తో మేం మాట్లాడతాం.. మీరు సమ్మె విరమింపజేయండి అని ప్రకటన చేయించడం ద్వారా సమ్మె ఉధృతిని తగ్గించవచ్చునని కేసీఆర్‌ భావిస్తున్నారు. దీనిలో భాగంగానే తెరాస పార్లమెంటరీ పార్టీనేత కేశవరావు రంగంలోకి దిగారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తప్ప మిగిలిన డిమాండ్లపై చర్చలకు కార్మికులు సిద్ధం కావాలని కేశవరావు ప్రకటన చేశారు.

దీనికి స్పందించిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డిసైతం కేశవరావుపై తమకు నమ్మకం ఉందని చర్చలకు ఆహ్వానిస్తే వెళ్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం అంశాన్ని పక్కన పెట్టి ముందు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే అంశంపై ప్రభుత్వం దృష్టిపెట్టే ఆలోచనలో ఉంది.

ఒకవేళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తేనే చర్చలని కార్మికులు ప్రకటిస్తే.. ఆమేరకు త్వరలో చర్చిద్దాం.. ముందు కార్మికు ల సమస్యలు పరిష్కరించుకుందామని నచ్చజెప్పే ఆలోచనలో టీఆర్‌ఎస్‌ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చకుండా.. కేసీఆర్‌ దిగొచ్చాడనే భావన ప్రజల్లో కలగకుండా పార్టీ నేతలతో రాయబారాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

మరోవైపు కెకె రాయబారాన్ని ఆర్టీసీ జేఏసీ స్వాగతించింది. అయితే,తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతటి దుర్మార్గం చూడలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె, రాష్ట్ర పరిస్థితిపై సోమవారం గవర్నర్‌ తమిళిసైకు వినతి పత్రం అందించారు. మంత్రులు రోజుకో మాట మాట్లాడుతూ.. కార్మికులను రెచ్చకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛలేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో దహనకాండపై గవర్నర్‌కు వివరించామని, తమ వినతులపై ఆమె సానుకూలంగా స్పందించారన్నారు. టీఎన్జీయూ అధ్యక్షుడు కారం రవీందర్‌ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని అశ్వత్థామరెడ్డి అభిప్రాయపడ్డారు. కేకే మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఆహ్వనం పలకాలని సూచించారు. ఏ రాజకీయ నాయకులతో ఒప్పందాలు లేవని ఆయన స్పష్టం చేశారు. 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   4 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   5 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   6 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   7 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   8 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   8 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   10 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   10 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   10 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   11 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle