newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

కేసీఆర్‌.. చేతకాకపోతే ఆర్టీసీని వదిలేయ్

17-10-201917-10-2019 16:35:18 IST
Updated On 17-10-2019 16:52:50 ISTUpdated On 17-10-20192019-10-17T11:05:18.340Z17-10-2019 2019-10-17T11:05:15.542Z - 2019-10-17T11:22:50.802Z - 17-10-2019

కేసీఆర్‌.. చేతకాకపోతే ఆర్టీసీని వదిలేయ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీని సమర్థంగా నిర్వహించడం సాధ్యం కాకపోతే ప్రభుత్వం సంస్థను తమకు అప్పగించితే ఆర్టీసీని వేలకోట్ల లాభాల్లోకి తీసుకెళతామని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీకి కలుగుతున్న వరుస నష్టాలకు కారణం సంస్థ సిబ్బందికి జీతాలు పెరగడమే కారణమని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన పచ్చి అబద్ధమని ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకులు నాగేశ్వర్ ఎద్దేవా చేశారు. . 

హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్ సగటు వేగం 15కి.మీ.కు మించకపోవడానికి కారణం ట్రాఫిక్,రోడ్లు బాగాలేకపోవడమే అని నాగేశ్వర్ తెలిపారు. ఎమ్మెల్యేల జీతాలపైన టాక్స్ ఉండదు కానీ ఆర్టీసీపైన టాక్స్ ఎందుకు... ప్రభుత్వం చేసేది నష్టాల జాతీయకరణ లాభాల ప్రైవేటీకరణ. ప్రభుత్వ విధానాల వల్ల రోజుకి ఆర్టీసీ రూ. 80లక్షల వడ్డీ కడుతోందని ఆరోపించారు. 

ఇప్పటికి తెలంగాణాలో 1400గ్రామాలకు బస్సులు లేవు. ఆర్టీసీకి ఏటా 700 కోట్లు నష్టం వస్తుంది. లక్ష 60వేల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణా ప్రభుత్వం కోటి మందికి సేవ చేసే ఆర్టీసీకి 700 కోట్లు ఇవ్వలేదా... కేసీఆర్ సర్కార్‌కు నేను సవాల్ చేస్తున్నా.. ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు అన్ని వాస్తవాలు. ఎక్కడ చర్చకు రావడానికి అయినా నేను సిద్ధం. ప్రభుత్వంకు చేతకాక పోతే మాకు అప్పచెప్పండి. ఆర్టీసీని వేల కోట్ల లాభాల్లోకి తీసుకెళ్తాం’ అని నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. 

గురువారం నాడు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన నాగేశ్వర్. ఈ రోజుతో ఆర్టీసీ సమ్మె 12వ రోజుకు చేరినా.. కోర్టు చర్చలు జరపమని చెప్పినా ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడమేంటి.. అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని చేతనైతే నడిపి చూడండి.. మాటలు చెప్పడం కాదు అంటూ ప్రతిపక్షాలపై, ఆర్టీసీ సిబ్బంది మద్దతుదారులపై విరుచుకుపడిన కేసీఆర్‌కు సంస్థను అప్పగిస్తే లాభాల బాటలో నడిపి చూపిస్తాం అని ప్రొఫెసర్ ఎదురు సవాలు చేయడం సంచలనం కలిగిస్తోంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle