newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

కేసీఆర్‌ది మొండి తనమా..? వూహాత్మకమా?

26-11-201926-11-2019 13:05:06 IST
Updated On 26-11-2019 15:03:19 ISTUpdated On 26-11-20192019-11-26T07:35:06.608Z26-11-2019 2019-11-26T07:35:04.652Z - 2019-11-26T09:33:19.726Z - 26-11-2019

కేసీఆర్‌ది మొండి తనమా..? వూహాత్మకమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎప్పుడు ఏది చేసినా సంచలనమే. నిర్ణయం తీసుకుంటే దాన్ని నెగ్గించుకొనేవరకు పోరాడుతూనే ఉంటారు. అది ఇప్పటికే పలుమార్లు రుజువైంది. తెలంగాణా ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లి రాష్ట్రాన్ని సాధించుకోవటంలో కేసీఆర్‌ది కీలక భూమిక. అధికారంలోకి వచ్చిన తరువాతసైతం కేసీఆర్‌ అదే పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. పట్టువిడుపులు లేకుండా తనదే నెగ్గాలనే భావనలో పాలన సాగిస్తున్నారు.

రెండవసారి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌ లో ఈ స్వభావం మరింత పెరిగినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజాగా ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్‌ వైఖరి మొడి తనమా..? వ్యూహాత్మకమా? అనేది చర్చనీయాశంగా మారింది. ఆర్టీసీ జేఏసీ నాయకులు వర్సెస్‌ సీఎం కేసీఆర్‌గా రాష్ట్రంలో గత 52రోజులుగా యుద్ధవాతావరణాన్ని తలపిస్తుంది. సీఎంగా కేసీఆర్‌ కార్మికుల డిమాండ్‌లను ఏకోశాన పట్టించుకున్న పరిస్థితి కనిపించలేదు.

మీరులేకపోతే నేనే వేరేవాళ్లతో ఆర్టీసీని నడిపిస్తానంటూ తన మొండితనాన్ని ప్రదర్శించారు. హైకోర్టు సైతం ప్రభుత్వానికి తామేమీ చెప్పలేమని అనడంతో ఆర్టీసీ జేఏసీ నాయకులు ఓమెట్టు దిగివచ్చినా కేసీఆర్‌ మాత్రం వెనక్కు తగ్గకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోమని ఖరాఖండీగా తేల్చి చెప్పారు. తాజాగా స్వచ్ఛందంగా తాము విధుల్లోకి చేరేందుకు కార్మికులు ప్రయత్నించినా డిపోల వద్దనే నిలిపివేశారు.

కేసీఆర్‌ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతమొండితనం పనికిరాదనే భావన అందరిలోనూ వ్యక్తమవుతుంది. స్వయాన కేబినెట్‌లోని పలువురు మంత్రులుసైతం కేసీఆర్‌కు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినలేదని ప్రచారం సాగుతుంది. ఇలా అయితే పార్టీకే నష్టమని పలువురు తెరాస నేతలు కేసీఆర్‌ వద్ద ప్రస్తావించలేక లోలోన మదనపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కేసీఆర్‌పై రెవెన్యూ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఇటీవల తహసీల్దార్‌ విజయా పై దాడి ఘటన సీఎం రెచ్చగొట్టడం వల్లనే జరిగిందనేది రెవెన్యూ ఉద్యోగుల భావన. కేసీఆర్‌ వ్యాఖ్యలతో, ఆయన సొంత పత్రికలో వచ్చే కథనాలతో రైతులు రెవెన్యూ ఉద్యోగులపై దాడులకు పాల్పడుతున్నారని బాహాటంగానే ఉద్యోగులు విమర్శిస్తున్నారు.

ఇదే సమయంలో ఆర్టీసీ కార్మికులు సైతం కేసీఆర్‌ వైఖరిపట్ల తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈపరిస్థితులన్ని తెరాస ప్రభుత్వం పట్ల ఉద్యోగుల్లో వ్యతిరేఖత తెస్తున్నాయని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్‌ వైఖరి ఏమిటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు కార్మికుల పట్ల కేసీఆర్‌ది మొండివైఖరేనని.. వ్యూహమేమీ లేదని పలువురు నేతలు పేర్కొంటున్నారు.

కార్మికులకు నచ్చజెప్పినా వినకుండా సమ్మెకు వెళ్లడం వల్లనే కేసీఆర్‌ కార్మికుల పట్ల మొండివైఖరిని ప్రదర్శిస్తున్నారని, మరోసారి ఇలాంటి చర్యలకు ఇతర ఏ ఉద్యోగులు పాల్పడకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. దీనిని సమర్థించాల్సిన విషయమైనప్పటికీ మున్ముందు కాలంలో పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు.

ఉద్యోగుల్లో ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేఖత వచ్చిందని, ఆర్టీసీ కార్మికులసైతం తెరాస అంటే మండిపడుతున్నారని, ఉద్యోగ వర్గాలన్నీ దాదాపు టీఆర్‌ఎస్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీఆర్‌ఎస్‌లోని పలువురు సీనియర్‌ నేతలు చర్చించుకోవటం కొసమెరుపు. మరి కేసీఆర్‌ వైఖరి రాబోయే కాలంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాల్సిందే.  

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle