newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేసిఆర్ మళ్ళీ 'జాతీయ' ప్రయత్నాలు మొదలెట్టారా?

28-12-201928-12-2019 11:20:02 IST
2019-12-28T05:50:02.685Z28-12-2019 2019-12-28T05:50:00.376Z - - 17-04-2021

కేసిఆర్ మళ్ళీ 'జాతీయ' ప్రయత్నాలు మొదలెట్టారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ముందస్తు ఎన్నికల తర్వాత.. 2019 సాధారణ ఎన్నికలకు ముందు కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. బెంగాల్ మమతా బెనర్జీ, కేరళ పినరయ, ఏపీలో జగన్మోహన్ రెడ్డి లాంటి నేతలతో సమావేశమై కేంద్రంలో చక్రం తిప్పాలని ప్రయత్నాలు చేశారు. సాధారణ ఎన్నికలలో అటు ఎన్డీఏ.. ఇటు యూపీఏకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని, ఈక్రమంలోనే రాష్ట్రాలలో మనమే కింగులం అవుతామని రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల సభలో మైకులు పగిలేలా అరచి చెప్పారు.

నాలుగు రాష్ట్రాలలో పార్టీలను కలుపుకొని తమ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి అక్కడ కూడా చక్రం తిప్పాలని కెసిఆర్ ఆశపడ్డారు. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి పదవులు కూడా ఇవ్వకుండా కేంద్రంలో ఫలితాలను బట్టి ఇక్కడ పరిస్థితులను చక్కదిద్దుకోవాలని చూశారు. అయితే కేంద్రంలో కెసిఆర్ లాంటి వాళ్ళ అంచనాలను తలక్రిందులు చేసేలా బీజేపీ గ్రాండ్ విక్టరీని నమోదు చేసుకుంది. దీంతో కెసిఆర్ జాతీయ ఆశలు ఆవిరైపోయాయి.

అయితే ఇప్పుడు మరోసారి సీఎం కేసిఆర్ జాతీయ ప్రయత్నాలు మొదలుపెట్టారా? అనే చర్చ రాజకీయ వర్గాలలో మొదలైంది. దీనికి కారణం కూడా తాజాగా రాజకీయ పరిణామాలే కారణంగా కనిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల నుండి సాధారణ ఎన్నికలకు ముందు వరకు బీజేపీతో కెసిఆర్ స్నేహంగానే మెలిగారు. అయితే సాధారణ ఎన్నికలలో కత్తి దూసినా మళ్ళీ ఫలితాల అనంతరం బీజేపీతో సఖ్యతగానే ఉంటూ వచ్చారు. ఈక్రమంలోనే కేంద్రం తీసుకొచ్చిన అనేక బిల్లులకు ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చారు.

ఇంకా చెప్పాలంటే మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఆర్టికల్ 370కి తెరాస రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఏకంగా ప్రత్యేక హెలికాఫ్టర్ లో వెళ్లి మరీ ఓటింగ్ లో పాల్గొన్నారు. అంతగా కేంద్రాన్ని మచ్చిక చేసుకొనే ప్రయత్నం చేశారు కెసిఆర్. కానీ మోదీ నుండి అనుకున్నంత సానుకూలత రాకపోవడంతోనే క్రమేపీ బీజేపీని శత్రువుగా చూసే వరకు వెళ్లారని రాజకీయ వర్గాలలో వినిపించే మాట. ఇక ఇప్పుడు ఏకంగా కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన సంగతి తెలిసిందే.

కాగా, ఇప్పుడు ఆ కేంద్రం తెచ్చిన పౌరసత్వ బిల్లు సాక్షిగా రాష్ట్రంలో మిత్రపక్షమైన ఎంఐఎంతో కలిసి యుద్ధమే ప్రకటించేందుకు సిద్దమైనట్లుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రధాన శత్రువుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సహా మోదీ వ్యతిరేక శక్తులను ఒకే వేదిక మీద తెచ్చేందుకు సిద్దమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇందుకు హైదరాబాద్ ను వేదికగా ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. ఇదంతా సీఎం కెసిఆర్ మరోసారి జాతీయ ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానాలను రేకెత్తిస్తుంది.

ఇదే క్రమంలో గత వారం రోజులుగా పార్టీలో కెసిఆర్ తర్వాత కేటీఆర్ అనే మాటలు మొదలయ్యాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం అయితే కెసిఆర్ తర్వాత కేటీఆర్ కాబోయే సీఎం అంటూ కీలక ప్రకటన చేశారు. కెసిఆర్ ఢిల్లీ రాజకీయాలకు వెళ్తే కేటీఆర్ కు పార్టీతో పాటు ప్రభుత్వ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే కెసిఆర్ మరోసారి ట్రయల్స్ మొదలుపెట్టారా? లేక బీజేపీపై ఉన్న కోపమే ఇలా ప్రచారంగా మారిందా? మున్సిపల్ ఎన్నికల కోసమే సభలా అన్నది ఆయనకే తెలియాలి.

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   10 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   11 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   15 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   18 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   17 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   16 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle