newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు... కరోనా కేసుల తీవ్రతపై చర్చ

06-08-202006-08-2020 08:15:36 IST
Updated On 06-08-2020 08:17:41 ISTUpdated On 06-08-20202020-08-06T02:45:36.914Z06-08-2020 2020-08-06T02:41:15.906Z - 2020-08-06T02:47:41.084Z - 06-08-2020

కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు... కరోనా కేసుల తీవ్రతపై చర్చ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  సచివాలయం కొత్త భవన సముదాయం నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన డిజైన్లను ఆమోదించింది. తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాల విద్యార్థులకు డిజిటల్‌ క్లాసులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్‌ను వినియోగించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ రూపొందించాలని కోరింది.పెట్రోల్, డీజిల్ వాహనాల వల్ల ఎక్కువయ్యే కాలుష్యాన్ని తగ్గించడానికి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని, ఈ పరిశ్రమకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిక్ వెహికిల్ &ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీని కేబినెట్ ఆమోదించింది.

డిగ్రీ, పీజీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షల నిర్వహణ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించింది. త్వరలో ఫుడ్‌ ప్రాసెసింగ్,వలస కార్మికుల పాలసీలు, ఐటీ గ్రిడ్, టీఎస్‌–బీపాస్‌లకు ఆమోదం తెలిపింది. కరోనా బాధితులకుహోం ఐసోలేషన్‌ కిట్లు, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. 

కరోనా కేసుల తీవ్రత, డిశ్చార్జ్ అవుతున్నవారి గురించి చర్చించింది. కరోనా కేసుల గురించి ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు కేబినెట్‌ కు వివరించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ఎన్ని కేసులు వచ్చినా వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేబినెట్‌ ఉద్ఘాటించింది.

ఎక్కువ వ్యయం చేసి ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు, మందులు, నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, వారిని ఉపయోగించుకోవాలని కేబినెట్‌ ప్రజలను కోరింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావాల్సిన మందులు, పరికరాలు, వసతులు ఏర్పాటు చేయడానికి ఎంత డబ్బుకైనా వెనకాడేది లేదని మంత్రి ఈటల అన్నారు.

కరోనా పరీక్షలో పాజిటివ్‌ వచ్చినట్లు తేలగానే వారికి వెంటనే హోమ్‌ ఐసోలేషన్‌ కిట్స్‌ ఇవ్వాలి. 10 లక్షల హోమ్‌ ఐసోలేషన్‌ కిట్స్‌ సిద్ధంగా ఉంచాలి. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఆక్సిజన్‌ బెడ్లను సిద్ధంగా ఉంచాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే తాత్కాలిక పద్ధతిలో నియమించుకునేందుకు కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. ప్రతీ రోజు 40వేల వరకు పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.

మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సిన కరెంటు బిల్లులను ప్రతీ నెలా క్రమం తప్పకుండా చెల్లించాలని కేబినెట్‌ ఆదేశించింది. కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించనుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle