newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

కేబినెట్‌ నిర్ణయంపై అతిరహస్యం అవసరమా.. హైకోర్టు ప్రశ్న

15-11-201915-11-2019 12:07:11 IST
Updated On 15-11-2019 16:43:18 ISTUpdated On 15-11-20192019-11-15T06:37:11.332Z15-11-2019 2019-11-15T06:37:07.829Z - 2019-11-15T11:13:18.352Z - 15-11-2019

కేబినెట్‌ నిర్ణయంపై అతిరహస్యం అవసరమా.. హైకోర్టు ప్రశ్న
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ ప్రయివేటీకరణలో భాగంగా తెలంగాణ ఆర్టీసీలోని 5,100 రూట్లను ప్రైవేట్ పరం చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని బయటకు వెల్లడించకుంటే ప్రజల్లో అపోహలు పెరిగే ప్రమాదం ఉందని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. సగం ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరిస్తూ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం గోప్యమని, ఈ విషయంలో పూర్తి ప్రక్రియ జరిగే వరకూ నిర్ణయాన్ని వెల్లడించకూడదంటూ ప్రభుత్వం పేర్కొనడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

మంత్రిమండలి నిర్ణయాన్ని తొక్కిపెట్టడం, నిశ్శబ్దంగా ఉండటం వల్ల ప్రజల్లో దురభిప్రాయాలు, అపోహలు కలుగుతున్నా యని ధర్మాసనం అభిప్రాయపడింది. కేబినెట్‌ నిర్ణ యాన్ని ప్రజలు ప్రశ్నించవచ్చని, వాటిపై తాము న్యాయ సమీక్ష చేయవచ్చని స్పష్టం చేసింది. గతంలో ఎర్రమంజిల్‌ భవనం కేసులో మంత్రివర్గ నిర్ణయాన్ని రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేసింది.

కేబినెట్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదిస్తూ బస్సు రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం తర్వాత మోటార్‌ వాహన చట్టం కింద గెజిట్‌ నోటిఫికేషన్, ఆ తర్వాత జీవో జారీ చేశాకే తర్వాతే ఎవరికైనా ప్రశ్నించే హక్కు వస్తుంద న్నారు.

కేబినెట్‌ నిర్ణయా నికి సంబంధించిన పత్రాలను సీల్డ్‌ కవర్‌లో ధర్మాసనానికి అందజేశారు. ఆ ప్రక్రియ పూర్తి చేసేందుకు స్టే అడ్డంకిగా ఉందని, సమాచార హక్కు చట్ట నిబంధనల ప్రకారం కూడా మంత్రిమండలి నిర్ణయ పత్రాలు ఇవ్వడానికి వీల్లేదన్నారు. 

ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఎర్రమంజిల్‌ హెరిటేజ్‌ భవనాన్ని కూల్చి అక్కడ చట్టసభల సముదాయ భవనాల్ని నిర్మించాలని కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేసిన కేసులో ఇదే హైకోర్టు ఆ నిర్ణయం చెల్లదని తీర్పు చెప్పిందని గుర్తుచేసింది. కేబినెట్‌ ఒక నిర్ణయం తీసుకొని రెండేళ్లపాటు గెజిట్‌జీవోలు ఇవ్వకుంటే అప్పుడు ఏం చేయాలో చెప్పాలని ఏజీని కోరింది. కేబినెట్‌ నిర్ణయాలను సవాల్‌ చేయవచ్చునని, అలాంటి కేసుల్లో హైకోర్టు తగిన ఉత్తర్వులు ఇవ్వొచ్చని తేల్చిచెప్పింది. మంత్రిమండలి నిర్ణయం రహస్యమని చెబుతున్నప్పుడు పిటిషనర్‌ ఊహాగానాలతో హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారని ప్రభుత్వం తరఫున ఎలా చెబుతారని, ఆ విధంగా చెప్పే హక్కు ఎక్కడిదని ప్రశ్నించింది.

ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణ తీర్మానాన్ని 102 సెక్షన్‌ కింద చేయడమంటే గుర్రాన్ని కట్టడానికి ముందే బండిని కట్టినట్లు ఉందని వ్యాఖ్యానించింది. ప్రైవేటీకరణ ప్రతిపాదన గురించి ఆర్టీసీ కార్పొరేషన్‌ ఏం చెప్పదల్చుకుందో ముందుగా వినాలని, పోనీ ఆర్టీఏ అయినా ఆర్టీసీకి నోటీసు ఇచ్చిందా అని ప్రశ్నించింది.

అయితే హైకోర్టు స్టే ఉత్తర్వులు కారణంగా ఇవ్వలేకపోయామని ఏజీ జవాబు చెప్పారు. ప్రజల కోసం కేబినెట్‌ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ప్రజలు ఎందుకు ప్రశ్నించకూడదో వివరించాలని ఏజీని కోరింది. 

పవన్ అభిమాని అత్యుత్సాహం.. ఏ రెడ్డి తలైనా నరుకుతా!

పవన్ అభిమాని అత్యుత్సాహం.. ఏ రెడ్డి తలైనా నరుకుతా!

   8 hours ago


ఎంఐఎంకి కీలక పదవి.. పీఏసీ ఛైర్మన్‌గా అక్బరుద్దీన్ నియామకం

ఎంఐఎంకి కీలక పదవి.. పీఏసీ ఛైర్మన్‌గా అక్బరుద్దీన్ నియామకం

   9 hours ago


అమరావతి వార్: వైసీపీ టీడీపీ పోటాపోటీ సమావేశాలు

అమరావతి వార్: వైసీపీ టీడీపీ పోటాపోటీ సమావేశాలు

   10 hours ago


ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల లిస్ట్.. ఎక్కడో తేడా కొట్టేస్తుందే?!

ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల లిస్ట్.. ఎక్కడో తేడా కొట్టేస్తుందే?!

   10 hours ago


శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్

శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్

   11 hours ago


జర్నలిస్ట్ అవతారం ఎత్తిన పవన్ కళ్యాణ్

జర్నలిస్ట్ అవతారం ఎత్తిన పవన్ కళ్యాణ్

   11 hours ago


అప్పులు చేయడంలో జగన్ సరికొత్త రికార్డులు..!

అప్పులు చేయడంలో జగన్ సరికొత్త రికార్డులు..!

   12 hours ago


మోడీ సర్కార్ విఫలం.. నిప్పులు చెరిగిన చిదంబరం

మోడీ సర్కార్ విఫలం.. నిప్పులు చెరిగిన చిదంబరం

   13 hours ago


దిశ కేసులో దర్యాప్తు మమ్మరం.. నెలలోపే హంతకులకు శిక్ష

దిశ కేసులో దర్యాప్తు మమ్మరం.. నెలలోపే హంతకులకు శిక్ష

   13 hours ago


రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమై పోయాయా పవన్.. విజయసాయి విమర్శలు

రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమై పోయాయా పవన్.. విజయసాయి విమర్శలు

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle