newssting
BITING NEWS :
* జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం *మెట్రో రైలు సర్వీసులకు .. అంతర్జాతీయ విమానాలకు అనుమతి లేదు *సినిమా హాల్స్, జిమ్, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, బార్లు, రాజకీయ వేదికలకు అనుమతి లేదు* ఢిల్లీ ఎయిరిండియా విమానంలో కరోనా కలకలం *ఏపీలో కొత్తగా 70 కరోనా కేసులు.. 2944 కి చేరిన కేసులు .. ఏపీలో యాక్టివ్ కేసులు 792 *పంట కొనుగోలు కేంద్రాలను జూన్ 8వ తేదీ వరకు కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు..మొదట మే 31వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలు

కేటీఆర్ సీఎం వ్యాఖ్యలు ఇమేజ్ కోసమేనన్న రాములమ్మ!

25-01-202025-01-2020 12:07:22 IST
Updated On 25-01-2020 12:09:54 ISTUpdated On 25-01-20202020-01-25T06:37:22.435Z25-01-2020 2020-01-25T06:37:19.487Z - 2020-01-25T06:39:54.074Z - 25-01-2020

కేటీఆర్ సీఎం వ్యాఖ్యలు ఇమేజ్ కోసమేనన్న రాములమ్మ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ సీఎం కాబోతున్నారంటూ తీవ్ర ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు.. వీళ్ళు అన్న తేడా లేకుండా అందరూ ఇదే భజన చేస్తున్నారు. ఒకపక్క తనకి ఆ ఉద్దేశ్యం లేదని, మరో పదేళ్లు కేసీఆర్ సీఎంగా ఉంటారని మంత్రి కేటీఆర్ మొత్తుకున్నా కొందరు మంత్రులు మాత్రం అదే జపం చేస్తూ వస్తున్నారు.

ఇక ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశాయి. ఆయా పార్టీలలో కొందరు నేతలు కేటీఆర్ సీఎం సృష్టి ఎన్నికల కోసమేనని చెప్పుకొస్తే.. మరికొందరు నేతలు సీఎం కెసిఆర్ మీద నమ్మకం లేకనే కేటీఆర్ పేరు పైకి తెచ్చారని విశ్లేషించారు. అంతేకాదు మున్సిపల్ ఫలితాలు కేటీఆర్ ఖాతాలో వేసి ఆయనో గొప్ప నేతగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసారని మరికొందరు చెప్పారు.

అయితే, ఫైనల్ గా కేటీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉందని ప్రతిపక్షాలు కూడా ఒప్పుకున్నట్లే అయిందని తాజాగా మరో విశ్లేషణ ఒకటి వచ్చింది. రాములమ్మ విజయశాంతి ప్రస్తుతం రాజకీయాలకు సమయం తగ్గించి సినిమాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇదే అదనుగా కొందరు మీడియా మిత్రులు విజయశాంతిని రాజకీయాలపై పలు ప్రశ్నలు అడిగారు.

కేటీఆర్ కొత్త సీఎం ప్రచారంపై స్పందించిన విజయశాంతి అదంతా ఇమేజ్ కోసం తెచ్చిన ప్రచారంగా పేర్కొన్నారు. తాజా మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి బలమైన స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుందని.. అయితే ఈ క్రెడిట్ ను కేటీఆర్ ఖాతాలో వేసేందుకు సీఎం కేటీఆర్ అనే ప్రచారాన్ని తెరమీదకి తెచ్చారని ఆమె వెల్లడించారు.

అయితే, టిఆర్ఎస్ నేతలు కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెబితే దానిని ఎవరూ పట్టించుకోరు, కానీ ప్రతిపక్షాలకు చెందిన నేతలు సైతం కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చేస్తున్న ప్రచారం వల్ల ఆయన ఇమేజ్ ప్రజల్లో బాగా పెరుగుతుందనడంలో సందేహం లేదని రాములమ్మ చెప్పడం విశేషం. కానీ, ఫైనల్ గా సీఎం ఎవరు అన్నది ఆ పార్టీ అంతర్గత విషయమని ఆవిడ ముగించారు.

ఒక విధంగా విజయశాంతి చెప్పిన మాటలనే కేటీఆర్ సీఎం అని ప్రచారం మొదలైన రోజునే విశ్లేషకులు తేల్చి చెప్పారు. కేటీఆర్ ను గొప్ప లీడర్ గా ప్రాజెక్ట్ చేసుకునేందుకే ఆ పార్టీ వాడుకున్న ఆయుధంగా ఆ ప్రచారాన్ని భావించాలని చెప్పారు. అయితే, ఆ ఆయుధానికి ప్రతిపక్షాలు కూడా వంతపాడటంతో ప్రజలలో అయనకి క్రేజ్ పెరుగుతుందని రాములమ్మ సొంత పార్టీ నేతలపై కౌంటర్లు వేసినట్లుగా భావించాలి!

 

బ్రేకింగ్: జూన్ 30 వరకూ లాక్ డౌన్ 5.O

బ్రేకింగ్: జూన్ 30 వరకూ లాక్ డౌన్ 5.O

   an hour ago


మెడికల్ స్టూడెంట్స్‌కు జగన్ బంపర్ ఆఫర్

మెడికల్ స్టూడెంట్స్‌కు జగన్ బంపర్ ఆఫర్

   an hour ago


వారసులకే జయ ఆస్తులు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

వారసులకే జయ ఆస్తులు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

   4 hours ago


ఒక వైపు కరోనా ఉధృతి.. పిడుగురాళ్ళలో సున్నపురాయి దోపిడీ

ఒక వైపు కరోనా ఉధృతి.. పిడుగురాళ్ళలో సున్నపురాయి దోపిడీ

   8 hours ago


నిమ్మగడ్డ రమేష్ కేసు.. ఎవరెవరు ఏమన్నారంటే...?

నిమ్మగడ్డ రమేష్ కేసు.. ఎవరెవరు ఏమన్నారంటే...?

   8 hours ago


అనంతలో కలకలం రేపిన మిడతల దండు..శాస్త్రవేత్తల భరోసా

అనంతలో కలకలం రేపిన మిడతల దండు..శాస్త్రవేత్తల భరోసా

   8 hours ago


దేశాన్నే అబ్బురపరిచే కేసీఆర్ ‘తీపి కబురు’ ఏమిటి? సర్వత్రా ఆసక్తి

దేశాన్నే అబ్బురపరిచే కేసీఆర్ ‘తీపి కబురు’ ఏమిటి? సర్వత్రా ఆసక్తి

   9 hours ago


వరవరరావుని వెంటనే విడుదల చేయాలి.. భార్య హేమలత డిమాండ్

వరవరరావుని వెంటనే విడుదల చేయాలి.. భార్య హేమలత డిమాండ్

   10 hours ago


వరవరరావుకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

వరవరరావుకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

   11 hours ago


ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కరోనా కలకలం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కరోనా కలకలం

   11 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle