కేటీఆర్ దూకుడు... ఈసారి కచ్చితంగా సెంచరీ కొట్టాలనే..!
17-08-202017-08-2020 08:34:11 IST
Updated On 17-08-2020 10:14:17 ISTUpdated On 17-08-20202020-08-17T03:04:11.532Z17-08-2020 2020-08-17T03:03:55.404Z - 2020-08-17T04:44:17.408Z - 17-08-2020

తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దూకుడు మీదున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వరుస ఓపెనింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు. బస్తీ దవాఖానాలు, ఫ్లైఓవర్లు, థీమ్ పార్కులు అంటూ నగరంలో కేటీఆర్ ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కేటీఆర్ ఇప్పుడు చూపిస్తున్న దూకుడు వెనుక మరో ఆరు నెలల్లో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి నగర పీఠాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ ముందుకెళుతున్నారు. తెలంగాణకు హైదరాబాద్ మహానగరం గుండెకాయ లాంటిది. నగరంలో కోటికి పైగా జనాభా నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా ఉంటాయి. నిజానికి గతంలో హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ప్రభావం ఏ మాత్రం ఉండేది కాదు. ఒక్క సికింద్రాబాద్ నియోజకవర్గం మినహా ఎక్కడా టీఆర్ఎస్ పేరు వినిపించకపోయేది. 2009 గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అయితే టీఆర్ఎస్ పార్టీ కనీసం పోటీ కూడా చేయలేదు. అప్పుడు టీఆర్ఎస్ నగరంలో ఎంత బలహీనంగా ఉందో చెప్పుకునేందుకు ఇది ఒక ఉదాహరణ. అయితే, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్లో పార్టీ బలోపేతంపైన దృష్టి పెట్టారు. ఈ బాధ్యతలను మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ హైదరాబాద్ నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. భారతదేశానికి ఐటీ హబ్‌గా ఎదుగుతున్న కేటీఆర్ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రిగా ఉండటం హైదరాబాద్‌కు అదనపు బలంగా మారింది. మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన నగరాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. నగరాభివృద్ధితో పాటు నగరంలో పార్టీ అభివృద్ధి బాధ్యతలను కూడా స్వీకరించిన కేటీఆర్ 2016 జనవరిలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీని గెలిపించే పనిని స్వీకరించారు. నిజానికి అప్పటికి ఇది కేటీఆర్ సాహసం లాంటిదే. ఆ ఎన్నికల్లో 150 డివిజన్లలో 100 డివిజన్లు సాధిస్తామని కేటీఆర్ చేసిన సవాల్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇందుకోసం కేటీఆర్ పెద్ద ఎత్తున నగరంలో ప్రచారం నిర్వహించారు. ప్రతి డివిజన్ తిరిగి పార్టీ అభ్యర్థుల పక్షాన ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 సీట్లు గెలిచింది. టీఆర్ఎస్ ధాటికి గ్రేటర్లో బలమైన పార్టీలుగా ఉండే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కొట్టుకొని పోయాయి. ఇప్పుడు మరోసారి గ్రేటర్ ఎన్నికలు దగ్గరకు వచ్చాయి. వచ్చే సంవత్సరం జనవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి గ్రేటర్ ఎన్నికలపై కేటీఆర్ నజర్ పెట్టారు. వాస్తవానికి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే గ్రేటర్ ఎన్నికలకు వెళ్లాలని కేటీఆర్ భావించారు. ముఖ్యంగా నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పెద్ద ఎత్తున రోడ్లు, ఫ్లైఓవర్లు, స్కైవేల నిర్మాణం జరుగుతోంది. నగరంలో సుమారు 20 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే పూర్తయ్యాయి. చాలా వరకు చివరి దశలో ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో 24 గంటల పాటు నగరంలో అభివృద్ధి పనులు జరిగాయి. నగర సుందరీకరణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. వరుసగా కేటీఆర్ ఈ అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలోనే ఓపెనింగ్లను కేటీఆర్ స్పీడప్ చేశారు. ఇంకా చాలాచాలా చేయబోతున్నారు. ఈ ఎన్నికల్లోనూ గ్రేటర్లో 100 డివిజన్లను గెలుచుకోవడమే కేటీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 100కు ఒక్క సీటు ముందు ఆగిపోయిన టీఆర్ఎస్ ఈసారి 100 సాధిస్తుందా చూడాలి.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
4 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
5 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
5 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
9 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
10 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
8 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
11 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
11 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
6 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
13 hours ago
ఇంకా