newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

కేటీఆర్ తర్వాత స్థానం ఎవరిది.. జోరుగా సాగుతున్న చర్చ!

19-01-202019-01-2020 11:33:36 IST
Updated On 20-01-2020 12:09:41 ISTUpdated On 20-01-20202020-01-19T06:03:36.549Z19-01-2020 2020-01-19T06:03:33.592Z - 2020-01-20T06:39:41.972Z - 20-01-2020

కేటీఆర్ తర్వాత స్థానం ఎవరిది.. జోరుగా సాగుతున్న చర్చ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మున్సిపల్ ఎన్నికల వేళ టీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ తర్వాత స్థానం ఎవరిది అనే చర్చ జోరుగా జరుగుతుంది. కేసీఆర్ తర్వాత రెండో స్థానం కేటీఆర్ దేనని ఇప్పటికే పార్టీ వర్గాలలో అందరూ ఫిక్స్ అయిపోయారు. మరోవైపు ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆయనే సీఎం కాబోతున్నారని ఏకంగా గులాబీ పార్టీ నేతలు, మంత్రులే ప్రచారం చేస్తున్న సంగతి కూడా తెలిసిందే.

పార్టీలో ఒకటి, రెండు స్థానాలు ఖరారవగా మరి మూడో స్థానం ఎవరిది? కేసీఆర్ మేనల్లుడు, కేటీఆర్ కంటే ముందే పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ.. తెలంగాణలో ఉద్యమంలో కూడా కేసీఆర్ కు వెన్నంటి నడిచిన హరీష్ రావు మూడో స్థానంలో ఉంటారా? లేక కేసీఆర్ కుమార్తె కవితకు మూడవ స్థానం దక్కుతుందా? ఇప్పుడు ఇదే చర్చ ఆ పార్టీలో సాగుతుంది.

ప్రస్తుతం కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఉండగా అసలు మూడవ స్థానంపై చర్చ ఎందుకు అంటారా? కేటీఆర్ ఆదివారం స్విట్జర్లాండ్ టూర్ వెళ్లనున్నారు. అందుకే ఈ చర్చ. మరో మూడు రోజులలో ఎన్నికలు ఉండగా కేటీఆర్ ఈ యాత్రలు ఎందుకు అంటారా? నిజానికి ఇది నెలల క్రితమే ఖరారైన టూర్. స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు కేటీఆర్ హాజరుకానున్నారు.

ఎప్పుడో ఖరారైన పర్యటన.. దీనికి తోడు రాష్ట్రానికి నిధులు తెచ్చే అవకాశం దక్కే పర్యటన.. కేటీఆర్ కు మాత్రమే ఆహ్వానం ఉండడం వంటి కారణాలతో మున్సిపల్, ఐటీ శాఖా మంత్రిగా కేటీఆర్ వెళ్లాల్సివస్తుంది. అందుకే కేటీఆర్ స్థానంలో ఈ మూడు రోజులు ఎన్నికల వ్యవహారాన్ని ఎవరు చక్కబెట్టనున్నారు అని చర్చ రాజకీయ వర్గాలలో సాగుతుంది.

మున్సిపల్ ఎన్నికలు మొత్తం కేటీఆర్ బాద్యతగా ముందుకు వెళ్తున్నారు. పార్టీ టికెట్ల దగ్గర నుండి ఇంచార్జిలు, కమిటీలు, సమీక్షలు, సమావేశాలు, అసంతృప్తుల బుజ్జగింపులు, నేతలకు హామీలు, ప్రచార వ్యూహాలు, బాధ్యతలు అన్నీ కేటీఆర్ సమన్వయం చేసుకుంటున్నారు. కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం ఒకటి, రెండు చోట్ల మొక్కుబడిగా సభలో పాల్గొన్నారు.

మరి ఈ మూడు రోజులు కేటీఆర్ చూసిన బాధ్యతలను అయన తర్వాత ఎవరు చూస్తారు? కీలకమైన ఈ మూడు రోజుల బాధ్యతను అధినేత కేసీఆర్ ఎవరిని నమ్మి అప్పగిస్తారు? హరీష్, కవిత బాధ్యత తీసుకుంటారా? లేక మళ్ళీ కేసీఆర్ యాక్టివ్ గా పరిస్థితులను చక్కబెడతారా? ఒకవేళ మరొకరికి అప్పగిస్తే పార్టీలో తలెత్తే పరిస్థితిలు ఏంటన్నది ఆసక్తిగా మారింది. 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle