newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

కేటీఆర్ చెప్పినా డోన్ట్ కేర్ అంటున్నారా..?

13-01-202013-01-2020 07:39:59 IST
Updated On 13-01-2020 11:11:56 ISTUpdated On 13-01-20202020-01-13T02:09:59.170Z13-01-2020 2020-01-13T02:09:50.334Z - 2020-01-13T05:41:56.669Z - 13-01-2020

కేటీఆర్ చెప్పినా డోన్ట్ కేర్ అంటున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో రెబెల్స్ బెడ‌ద టీఆర్ఎస్‌కు త‌ల‌నొప్పిగా మారింది. కేటీఆర్ రంగంలోకి దిగి వారం రోజులుగా రెబెల్స్ లేకుండా ప్ర‌య‌త్నిస్తున్నా ఎక్క‌డిక‌క్క‌డ టీఆర్ఎస్‌కు రెబెల్స్ స‌మ‌స్య త‌ప్ప‌డం లేదు.

కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ కీల‌క నాయ‌కులే టిక్కెట్ ద‌క్క‌ని త‌మ అనుచ‌రుల‌ను రెబెల్స్‌గా పోటీ చేయిస్తున్నారు. దీంతో ప్ర‌తి రోజు కేటీఆర్ వ‌ద్దకు ఫిర్యాదులు వ‌స్తున్నాయి. దీంతో రెండు వ‌ర్గాల వారిని కేటీఆర్ పిలిపించి మాట్లాడుతున్నారు. ప్ర‌తీ రోజు జిల్లాల వారీగా ఫోన్లు చేసి స‌మీక్షిస్తున్నారు.

నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్ వ్య‌వ‌హారం ఎటూ తేల‌డం లేదు. స్వ‌యంగా కేటీఆర్ జోక్యం చేసుకున్నా కొల్లాపూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌లేదు.

మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి వ‌ర్గీయులు టిక్కెట్ల కోసం తీవ్రంగా పోటీ ప‌డ్డారు. అయితే, టిక్కెట్ల కేటాయింపు బాధ్య‌తను పార్టీ ఎమ్మెల్యేల‌కు ఇచ్చింది. దీంతో ఎమ్మెల్యే హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి చేతికి బీఫాంలు వ‌చ్చాయి. దీంతో జూప‌ల్లి కృష్ణారావు వ‌ర్గం అసంతృప్తికి గుర‌య్యింది. ఈ మున్సిపాలిటీలోని మొత్తం 22 వార్డుల్లోని 20 వార్డుల్లో జూప‌ల్లి అనుచ‌రులు రెబెల్స్‌గా నామినేష‌న్లు వేశారు. వీరంతా ఆల్ ఇండియా ఫార్వ‌ర్డ్ బ్లాక్ పార్టీ త‌ర‌పున పోటీకి దిగారు.

మంత్రిగా ప‌ని చేసిన జూప‌ల్లికి కొల్లాపూర్‌లోనే కాకుండా గ‌ద్వాల‌, అలంపూర్‌, ఐజా మున్సిపాలిటీల్లోనూ అనుచ‌ర‌వ‌ర్గం ఉంది. ఈ మున్సిపాలిటీల్లోనూ టిక్కెట్లు ద‌క్క‌ని జూప‌ల్లి అనుచ‌రులు రెబెల్స్‌గా నామినేష‌న్లు వేశారు.

వీరు పోటీలో ఉంటే టీఆర్ఎస్ విజ‌యావ‌కాశాలు దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు విష‌యాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేటీఆర్‌.. జూప‌ల్లిని తెలంగాణ భ‌వ‌న్‌కు పిలిపించి మాట్లాడారు. రెబెల్స్ లేకుండా చూసుకోవాల‌ని, ఎమ్మెల్యేతో స‌యోధ్య‌కు కుదిర్చేందుకు ప్ర‌య‌త్నించారు.

కానీ, ఈ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. రెబెల్స్‌గా బ‌రిలో దిగిన వారితో త‌న‌కు సంబంధం లేద‌ని జూప‌ల్లి కృష్ణారావు స్ప‌ష్టంగా చెప్పేశార‌ని తెలుస్తోంది. తాము చెబితే రెబెల్స్ వింటారా అని కూడా జూప‌ల్లి వ్యాఖ్యానించిన‌ట్లు స‌మాచారం. దీంతో ఆయ‌న అనుచ‌రులు పోటీకే మొగ్గు చూపుతున్నార‌ని తెలుస్తోంది. ఇదే ప‌రిస్థితి మిగ‌తా ప్రాంతాల్లోనూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ రెండు వ‌ర్గాలుగా ఉంది.

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని డోర్న‌క‌ల్‌, మ‌రిపెడ మున్సిపాలిటీల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. ఇక్క‌డ ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్ వ‌ర్గానికి టిక్కెట్లు ద‌క్క‌గా మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ వ‌ర్గీయులు రెబెల్స్‌గా మారారు. పాలేరులో ఎమ్మెల్యే ఉపేంద‌ర్ రెడ్డి వ‌ర్గీయులకు టిక్కెట్లు వ‌చ్చాయి. ఇక్క‌డ మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అనుచ‌రులు రెబెల్స్‌గా పోటీ చేస్తున్నారు.

ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా క‌ల్వ‌కుర్తి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే జైపాల్ యాద‌వ్ వ‌ర్గీయులకు టిక్కెట్లు ద‌క్క‌గా ఎడ్మ కృష్ణారెడ్డి, క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి అనుచ‌రులు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారు. నేత‌ల‌ను కేటీఆర్ పిలిపించుకొని మాట్లాడుతున్నా రెబెల్స్ వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle