newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేటీఆర్ క్యాబినెట్లో కవితకు మంత్రి పదవి?

26-02-202026-02-2020 08:52:19 IST
2020-02-26T03:22:19.667Z26-02-2020 2020-02-26T03:22:17.790Z - - 12-04-2021

కేటీఆర్ క్యాబినెట్లో కవితకు మంత్రి పదవి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కొంతకాలంగా కేటీఆర్ ముఖ్యమంత్రి కానున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారానికి సొంత పార్టీ నేతలు, రాష్ట్ర మంత్రులే కొంత కారణంగా కాగా కేటీఆర్ ఎప్పటికప్పుడు ఆ ప్రచారాన్ని ఖండిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మరో ప్రచారం కూడా మొదలైంది. అదే రాష్ట్రంలో ఏర్పడే కేటీఆర్ కొత్త క్యాబినెట్లో కేసీఆర్ కుమార్తె కవితకు మినిస్టర్ బెర్త్ దక్కించుకోనున్నారని ప్రచారం సాగుతుంది.

నిన్న మొన్నటి వరకు కవితను రాజ్యసభకు పంపనున్నారని రాజకీయ వర్గాలలో విస్తృత ప్రచారం జరిగింది. కాగా మంగళవారం రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఏప్రిల్ లో రాజ్యసభలో ఖాళీకానున్న 55 ఎంపీ స్థానాలకు మార్చి 26వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. అందులో తెలంగాణలో రెండు స్థానాలు ఖాళీకానున్నాయి. కేవీపీ, గరికపాటి మోహన్‌ రావు రిటైర్‌ కానున్నారు.

అయితే, ఈ స్థానాలకు గాను ఏపీ నుండి రాజ్యసభలో ఉన్న తెలంగాణ సీనియర్ నేత కేకేతో పాటు ఎందరో ఆశిస్తున్నారు. ఈక్రమంలోనే కవితకు అవకాశం ఇస్తే సంకేతాలు మారతాయని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే నిజామాబాద్ రాజకీయాలలో ఎక్కడా కవిత ప్రస్తావన కనిపించడం లేదంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నేతలలో కూడా ఎక్కడా కవిత ప్రస్తావన కనిపించడం లేదు.

కవితను రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశమే ఉంటే ఇప్పటికే ఆ పార్టీ నేతలు ఆమె ప్రస్తావన తీసుకురావడంతో పాటు కుటుంబ రాజకీయాలంటూ ప్రతిపక్షాల విమర్శలు.. టీఆర్ఎస్ నేతలు ఆమెను వెనకేసుకురావడం వంటి ఎన్నో పరిణామాలను చూడాల్సి వచ్చేదని.. కేసీఆర్ కు ఆమెని ఎంపిక చేసే ఉద్దేశ్యమే లేకపోవడంతో రాజకీయాలలో కూడా ఆమె ప్రస్తావన రావడం లేదని చర్చలు నడుస్తున్నాయి.

అయితే, ఇప్పట్లో ఇక ఎన్నికలకు చాన్స్ లేదు కనుక మరో నాలుగేళ్ళ పాటు ఆమె రాజకీయాలకు దూరంగా ఉండనున్నారా? అంటే దీనిపై మరో ప్రచారం కూడా మొదలైంది. మరో ఏడాదిలో మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేందుకు కసరత్తులు జరిగిపోతున్నాయని ఆ పార్టీలోనే గట్టి ప్రచారం జరుగుతుంది. బేగంపేట మెట్రో భవన్ కూడా కేటీఆర్ కోసమే సరికొత్తగా ముస్తాబవుతోంది.

అన్నీ అనుకున్నట్లుగా జరిగి కేటీఆర్ సీఎం అయితే సోదరి కవితకు అయన క్యాబినెట్ లో మంత్రిగా బెర్త్ దొరికే అవకాశాలున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ప్రతిపక్షాలు కుటుంబ పార్టీ అంటూ తీవ్రంగా విమర్శలకు దిగడం ఖాయం. మరోవైపు కవిత విషయంలో కేసీఆర్ ఏదో ఒక నిర్ణయం తీసుకొనే వరకు ఇలాంటి ఊహాగానాలకు కూడా బ్రేక్ పడే అవకాశాలు కనిపించడం లేదు. మరి గులాబీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle