newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేటీఆర్ కు సీఎం రేంజ్ ఇచ్చేసిన ప్రభుత్వం..!

08-01-202008-01-2020 14:57:09 IST
Updated On 08-01-2020 15:04:11 ISTUpdated On 08-01-20202020-01-08T09:27:09.758Z08-01-2020 2020-01-08T09:26:55.476Z - 2020-01-08T09:34:11.671Z - 08-01-2020

కేటీఆర్ కు సీఎం రేంజ్ ఇచ్చేసిన ప్రభుత్వం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమైనా ఉందా అంటే ముందుగా ముఖ్యమంత్రి కానున్న కేటీఆర్ అన్న విషయం కనిపిస్తుంది. గులాబీ పార్టీలో ఏ జరుగుతుందో.. గులాబీ బాస్ కేసీఆర్ మనసులో ఉన్న మాట ఏమిటో కానీ కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఇక్కడ జరిగిపోతున్న ప్రచారం.. అందుకు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితులు అన్నీ ఇన్నీ కావు.

కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి అనే మంత్రులు.. మా బాబు బంగారం కనుక ఆయనే మా తర్వాత సీఎం అనే నేతలు ఈ మధ్యకాలంలో మనం చూసేసాం. అయితే బయట ప్రజలు చూడని మాటలు కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. కేటీఆర్ సీఎం అయితే మాకు ఫలానా శాఖ మంత్రి పదవి వస్తుందని కొందరు మంత్రులు చెప్పుకోవడం కూడా మినిస్టర్స్ క్వార్ట్రర్స్ పరిసరాలలో వినిపిస్తుంది.

మొత్తంగా ఈ పరిస్థితిలను చూస్తే.. కేటీఆర్ సీఎం అన్నది ఎక్కడ పుట్టిందో.. ఎందుకు పుట్టిందో కానీ టీఆర్ఎస్ పార్టీలోఇన్నాళ్లు ఆయన్ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగానే చూసిన నేతలు ఇప్పుడు సగానికి సగం మంది కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఫిక్స్ అయిపోయారు.  ఇక ప్రభుత్వం కూడా కేటీఆర్ ను ఇన్నాళ్లు మంత్రులుగానే చూస్తే తాజాగా ఆయనను ముఖ్యమంత్రి స్థాయిలోనే చూస్తున్నారని అర్ధమవుతుంది.

మంగళవారం వరంగల్ ప్రభుత్వం అధికారిక కార్యక్రమం జరిగింది. నగరంలోని మడికొండలో సైయెంట్, టెక్ మహీంద్రా, ప్రాంగణాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీంతోపాటు ఐటీ గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను కూడా ఆరంభించారు. అయితే ఈ పర్యటన అందరినీ ఆకట్టుకుంది. ఇందులో ఒకటి కేటీఆర్ కి సీఎం స్థాయిలోనే ఏర్పాట్లు చేస్తే రెండోది కేటీఆర్ స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ కాన్వాయ్ లో వెళ్లారు.

ముందుగా వరంగల్ లో దిగిన మంత్రి కేటీఆర్‌కు స్వాగతం పలికేందుకుగాను నిట్‌ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్దకు అధికార పార్టీ నేతలంతా క్యూ కట్టారు. ఇక సాధారణంగా మంత్రుల కాన్వాయ్‌లో ప్రత్యేకంగా అంబులెన్స్‌ ఉండదు. ఒక్క సీఎం కాన్వాయ్ లో మాత్రమే అధికారులు అంబులెన్స్ ను కేటాయిస్తారు. ఈ పర్యటనలో కేటీఆర్ కాన్వాయ్ లో అంబులెన్సు కనిపించింది.

అంతేకాదు సీఎం స్థాయికి ఇచ్చే రోప్‌ పార్టీని సైతం కేటీఆర్ కు ఏర్పాటు చేశారు. మీడియాకు సైతం అదే రేంజిలో ఎంట్రీ పాస్‌లను అందజేశారు. మొత్తం కేటీఆర్ సీఎం అయిపోయారన్న విధంగానే ఇక్కడ పరిస్థితులు కనిపించాయి. ఇక ఈ పర్యటనలోనే సైయెంట్‌ కంపెనీ అధినేత బీవీ మోహన్‌రెడ్డి బెంజ్‌ కారును కేటీఆర్‌ స్వయంగా నడుపుకుంటూ వెళ్లారు.

ముందుగా మినిస్టర్ కాన్వాయ్ తో సంబంధం లేకుండా కేటీఆర్ బెంజ్‌ కారును నడుపుకుంటూ వెళ్తుండగా ఓ కానిస్టేబుల్ ఆపారు. చివరికి కేటీఆర్ అని తెలుసుకొని దారిచ్చారు. అనంతరం కేటీఆర్ బెంజిని తన కాన్వాయ్‌లోని ఇతర వాహనాలతో సమానంగా నడిపించారు. సీఎం స్థాయికి చేయాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు కేటీఆర్ కి చేస్తే అయన మాత్రం చలాకీగా చక్కర్లు కొట్టారు అన్నమాట..!

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle