కేటీఆర్‌కు లైన్ క్లియర్... ఇక ఆ కుర్చీ ఎక్కడమే మిగిలింది..!
14-08-202014-08-2020 08:25:09 IST
Updated On 14-08-2020 08:54:16 ISTUpdated On 14-08-20202020-08-14T02:55:09.303Z14-08-2020 2020-08-14T02:55:04.315Z - 2020-08-14T03:24:16.565Z - 14-08-2020

తెలంగాణ భవిష్యత్ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ భావి సారథి, కేసీఆర్ రాజకీయ వారసుడు ఎవరు అనే మూడు ప్రశ్నలు గతంలో ఎక్కువగా వినిపించేవి. తెలంగాణ రాజకీయాలను ఈ మూడు ప్రశ్నలు మార్చేస్తాయని చాలా మంది నమ్మేవారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయాలను బట్టి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారతాయని అంతా అనుకునే వారు. వారసత్వం విషయంలో కేసీఆర్ నిర్ణయం తర్వాత టీఆర్ఎస్లో లుకలుకలు మొదలవుతాయని, అవి తమకు కలిసొస్తాయని ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా ఆశలు పెట్టుకునేవి. కానీ, ఎటువంటి అసంతృప్తులు లేకుండానే ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ వారసుడిపై ఒక క్లారిటీ ఇచ్చేశారు. వ్యూహాత్మకంగా పార్టీలో కేటీఆర్‌ను కీలకం చేసిన కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వంలోనూ ఆయననే ముఖ్యుడిగా చేశారు. ఎంతలా అంటే.. కేసీఆర్ లేకుండానే కేటీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ జరిగేంత ప్రాధాన్యత కేటీఆర్‌కు వచ్చింది. బుధవారం జరిగిన మంత్రివర్గ భేటీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుండా కేటీఆర్ అధ్యక్షతన జరిగింది. ఇది తెలంగాణ రాజకీయాలకు సంబంధించి చాలా కీలక పరిణామం. భవిష్యత్ ముఖ్యమంత్రి ఎవరనే ఒక హింట్ ఇస్తున్నట్లుగా ఈ సమావేశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వారసుడి విషయంలో కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్‌రావు నడుమ పోటీ ఉంటుందని అంతా భావించారు. ఒకరికి వారసత్వాన్ని ఇస్తే మరొకరు అసంతృప్తికి లోనవుతారనే చర్చ జరిగేది. ఒకానొక సమయంలో హరీష్‌రావును వ్యూహాత్మకంగా పక్కన పెడుతున్నారనే ప్రచారం జరిగింది. హరీష్ రావును క్రమంగా తెర వెనకకు నెట్టి కేటీఆర్‌కు లైన్ క్లీయర్ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారనే విశ్లేషణలు వినిపించాయి. ఇలా చేసిన తర్వాత హరీష్ ఎటువంటి అడుగు వేస్తారనే అంశం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఇటువంటి డైలమాలు, హంగామాలు లేకుండా సాఫీగా కేసీఆర్ తన వారసుడిగా కేటీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠానికి దగ్గర చేస్తున్నారు. మొదట కేటీఆర్‌కు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ బాధ్యతలు అప్పగించి పార్టీని చాలా వరకు కేటీఆర్ చేతుల్లో పెట్టారు. ఈ బాధ్యతలను కేటీఆర్ సమగ్రంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పార్టీ వ్యవహారాలు అన్నీ కేటీఆర్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. పార్టీ శ్రేణులకు, నాయకులకు ఆయనే దిశానిర్దేశం చేస్తున్నారు. అన్ని ఎన్నికల బాధ్యతలను కేటీఆర్ చూసుకుంటున్నారు. ఇలా పార్టీపై పూర్తిగా గ్రిప్ సంపాదించిన తర్వాత ప్రభుత్వంలోనూ కేటీఆర్ కొంతకాలంగా కీ రోల్ పోషిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేటీఆర్ కూడా అన్ని శాఖలపైన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మంత్రులకు ఆయన నేరుగానే ఆదేశాలు ఇస్తున్నారు. మంత్రులు కూడా కేటీఆర్ ఆదేశాలను పాటిస్తూ వస్తున్నారు. ఇలా ప్రభుత్వంపైన కూడా కేటీఆర్ పట్టు పెరిగింది. ఈ నేపథ్యంలో 2013 ఎన్నికలకు ముందే కేటీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ నేతల్లో కూడా ఇదే ప్రచారం ఉంది. అందుకే చాలా మంది టీఆర్ఎస్ నేతలు కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకోవడానికే ఎక్కువగా తాపత్రయపడుతున్నారు. ఎన్నికలకు ముందే కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసి ఆయన సారథ్యంలోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా కేసీఆర్ లేకుండానే కేటీఆర్ మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. అయితే, గతంలో అనుకున్నట్లుగా వారసత్వం విషయంలో ఇప్పుడు టీఆర్ఎస్లో ఎటువంటి అనుమానాలు, అసంతృప్తులు లేవు. అంతా సాఫీగా సాగుతున్నది. కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పీఠంపైకి లైన్ క్లీయర్ అయ్యింది. అయితే, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. ఇదే సమయంలో కొందరు మంత్రులు మాత్రం కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని చెబుతున్నారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
13 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
14 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
14 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
18 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
19 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
17 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
20 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
20 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
15 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
a day ago
ఇంకా