newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

కేటీఆర్‌కు ప్ర‌మోష‌న్ ఖాయ‌మేనా..?

06-02-202006-02-2020 08:15:10 IST
Updated On 06-02-2020 08:56:30 ISTUpdated On 06-02-20202020-02-06T02:45:10.512Z06-02-2020 2020-02-06T02:44:54.071Z - 2020-02-06T03:26:30.276Z - 06-02-2020

కేటీఆర్‌కు ప్ర‌మోష‌న్ ఖాయ‌మేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టారు. ముమ్మాటికీ జాతీయ స్థాయి రాజ‌కీయాల్లోకి వెళ్తాన‌ని ఆయ‌న స్ప‌ష్టంగా చెబుతున్నారు. ఇందుకు ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితులే అనువుగా చేసుకొవాల‌నే ఆలోచ‌న‌తో ఉన్నారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం, ఎన్ఆర్‌సీని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న కేసీఆర్ త్వ‌ర‌లో హైద‌రాబాద్‌లో భారీ నిర‌స‌న స‌భ నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ స‌భ నుంచే ఆయ‌న జాతీయ స్థాయి రాజ‌కీయాలు మొద‌లుపెట్టాల‌ని భావిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి వెళితే మంత్రి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌ెసిడెంట్ కేటీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. టీఆర్ఎస్ మంత్రులే ప‌దేప‌దే కేటీఆర్ కాబోయే ముఖ్య‌మంత్రి అని చెబుతున్నారు.

గ‌తంలో టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ వార‌స‌త్వం గురించి కొంత డైల‌మా ఉండేది. కేటీఆర్, హ‌రీష్‌రావు మ‌ధ్య ఇందుకోసం పేచీ ఉంటుందేమో అనే అనుమానాలు వ‌చ్చాయి. కానీ, ఇప్పుడు ఇటువంటి అనుమానేమీ లేవు. ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌లో నెంబ‌ర్ 2గా ఉన్న కేటీఆర్ క‌చ్చితంగా కేసీఆర్ రాజ‌కీయ వార‌స‌త్వం పొంద‌బోతున్నారు.

అయితే, ఎప్పుడు ఆయ‌న ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చుంటార‌నేది మాత్రం చెప్ప‌లేం. త‌న ఆరోగ్యం బాగా ఉంద‌ని, ఇప్ప‌ట్లో తాను ముఖ్య‌మంత్రి ప‌దవి నుంచి దిగిపోన‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. అయినా, కేటీఆర్ ముఖ్య‌మంత్రి అవుతార‌నే ప్ర‌చారం మాత్రం ఆగ‌డం లేదు. ఇదిలా ఉండ‌గా తాజాగా టీఆర్ఎస్ పార్టీలో కొత్త చ‌ర్చ మొద‌లైంది. అదే కేటీఆర్ ఉప ముఖ్య‌మంత్రి కాబోతున్నార‌ని. జాతీయ స్థాయి రాజ‌కీయాల‌పై కేసీఆర్ దృష్టి పెట్టే క్ర‌మంలో రాష్ట్రంలో వ్య‌వ‌హారాలు చూసుకునేందుకు కేటీఆర్‌ను ఉప ముఖ్య‌మంత్రి చేస్తార‌నే ఊహాగానాలు వ‌స్తున్నాయి.

మొద‌టిసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన‌ప్పుడు క‌డియం శ్రీహ‌రి, మ‌హ‌మూద్ అలీకి ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు కేసీఆర్‌. కానీ, రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక ఎవ‌రినీ ఉప ముఖ్య‌మంత్రులుగా తీసుకోలేదు.

ఇప్పుడు కేటీఆర్‌కు ప్ర‌మోష‌న్ ఇచ్చి ఉప‌ముఖ్య‌మంత్రిని చేస్తార‌ని, కేసీఆర్ అందుబాటులో లేక‌పోతే ఉప ముఖ్య‌మంత్రిగా ప‌రిపాల‌నా వ్య‌వ‌హారాలు కేటీఆర్ చూసుకునే అవ‌కాశం ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకు ముహూర్తం కూడా కుదిరింద‌ని, త్వ‌ర‌లోనే కేటీఆర్ కొత్త బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌ని అంటున్నారు.

ఇప్ప‌టికే వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ హోదాలో పార్టీలో, మంత్రివ‌ర్గంలో కేటీఆర్ కీల‌కంగా వ్య‌వ‌హరిస్తున్నారు. పార్టీ వ్య‌వ‌హారాలు పూర్తిగా చూసుకుంటున్న ఆయ‌న పాల‌నా వ్య‌వ‌హారాల్లోనూ కీల‌కంగా ఉంటున్నారు. ఇక‌, ఉప ముఖ్య‌మంత్రి హోదా క‌నుక తీసుకుంటే ఆయ‌న ప‌రిపాల‌న‌లో మ‌రింత కీ రోల్ పోషించే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ ఈ ప్ర‌చారం నిజ‌మై కేటీఆర్ ఉప ముఖ్య‌మంత్రి అయితే మాత్రం మ‌రికొన్ని రోజుల పాటు కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతార‌నే అర్థం.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle