newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

కేకే వెన‌క్కు... ఆశ‌లు ఆవిరి..!

17-10-201917-10-2019 17:50:16 IST
2019-10-17T12:20:16.823Z17-10-2019 2019-10-17T12:20:15.241Z - - 24-02-2020

కేకే వెన‌క్కు... ఆశ‌లు ఆవిరి..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో ఆర్టీసీ కార్మికుల స‌మ్మె రోజురోజుకూ తీవ్ర‌త‌రం అవుతోంది. ఇద్ద‌రు కార్మికుల బ‌లిదానాల‌తో స‌మ‌స్య మ‌రింత జ‌టిల‌మైంది. మ‌రో వైపు తాత్కాలిక డ్రైవ‌ర్ల వ‌ల్ల ప్ర‌మాదాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు చ‌ర్చ‌ల‌కు రావాల‌ని, స‌మ‌స్య‌ను తీవ్రం కాక ముందే ప‌రిష్క‌రించాల‌ని టీఆర్ఎస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, ఎంపీ కె.కేశ‌వ‌రావు చెప్ప‌డంతో అంద‌రికీ ఆయ‌న‌పై ఆశ‌లు మొద‌ల‌య్యాయి. మ‌రోసారి చ‌ర్చ‌ల‌కు కేకే చొర‌వ తీసుకుంటార‌ని అంతా భావించారు.

ఆర్టీసీ కార్మికులు సైతం చ‌ర్చ‌ల‌కు తాము సిద్ధంగా ఉన్నామ‌ని, కేకే మ‌ద్యవ‌ర్తిత్వం చేయాల‌ని కోరుతున్నారు. ఇన్ని రోజులుగా స‌మ్మెపై ప్ర‌భుత్వం నుంచి మాట్లాడుతున్న మంత్రులు తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన్న వారు కాదు. కానీ, కేకే ప‌ట్ల ఆర్టీసీ కార్మికుల్లో మంచి అభిప్రాయం ఉంది. ఉద్య‌మంలో కేకేతో వారికి అనుబంధం ఉంది. దీంతో ఆయ‌న మ‌ద్య‌వ‌ర్తిత్వం చేస్తే చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌ని వారు ప్ర‌క‌టించారు. హుటాహుటిన ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ చేరుకున్న కేకే ఏమైందో ఏమో గానీ వెన‌క్కు త‌గ్గారు.

త‌న‌కు ముఖ్య‌మంత్రి అందుబాటులో లేర‌ని, చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డానికి తానెవ‌రినీ అంటూ ఆయ‌న వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో కేకేపై అంద‌రూ పెట్టుకున్న ఆశ‌లు ఆవిర‌య్యాయి. ఈ వ్య‌వ‌హారం బ‌ట్టి చూస్తే ప్ర‌భుత్వం ఆర్టీసీ కార్మికులు స‌మ్మె మానేసి వ‌స్తే త‌ప్ప చ‌ర్చ‌ల‌కు సిద్ధంగా లేన‌ట్లు క‌నిపిస్తోంది. కానీ, చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మైతేనే స‌మ్మె మానేస్తామ‌ని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు.

ఇదిలా ఉండ‌గా ఆర్టీసీ కార్మికుల స‌మ్మె వెనుక త‌మ నేత‌లు ఉన్నార‌ని టీఆర్ఎస్ జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి వ్యాఖ్యానించ‌డం కూడా ఆస‌క్తిక‌రంగా మారింది. త‌ర్వాత ఆయ‌న నేన‌లా అనేలేద‌ని చెప్పినా యాద‌గిరిరెడ్డి వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

ప్ర‌స్తుతం కార్మికుల స‌మ్మె గురించి ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, గంగుల క‌మ‌లాక‌ర్ మాట్లాడుతున్నారు. వీరెవ‌రికీ ఆర్టీసీ కార్మికుల‌తో పెద్ద‌గా స‌ఖ్య‌త లేదు.

సీనియ‌ర్ మంత్రులు హ‌రీష్ రావు, ఈటెల రాజేంద‌ర్‌తో ఆర్టీసీ కార్మికుల నేత‌లకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఉద్య‌మంలో క‌లిసి ప‌నిచేసిన అనుభం ఉంది. పైగా హ‌రీష్ రావు తెలంగాణ మ‌జ్దూర్ యూనియ‌న్‌కు గౌర‌వ అధ్య‌క్షుడిగా చాలా కాలం ప‌నిచేశారు. అయితే, ఈ మంత్రులు ఇద్ద‌రూ ఇంత‌వ‌ర‌కు ఆర్టీసీ కార్మికుల స‌మ్మెపై పెద‌వి విప్ప‌డం లేదు. క‌నీసం ప్ర‌భుత్వం ప‌క్షాన కూడా మాట్లాడ‌టం లేదు.

టీఆర్ఎస్‌లో ప‌నిచేసి ఏడాది క్రితం కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి ఈ విష‌య‌మై వీరిద్ద‌రినీ సంప్ర‌దించే ప్ర‌య‌త్నం చేసినా వారు అందుబాటులోకి రాలేదు. దీంతో హ‌రీష్‌, ఈటెల ఈ విష‌యంలో జోక్యం చేసుకునేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

దీంతో ప్ర‌భుత్వం త‌ర‌పున ఎవ‌రు చొర‌వ తీసుకొని ఆర్టీసీ కార్మికుల‌తో చ‌ర్చ‌ల‌కు ఏర్పాట్లు చేస్తారో ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. దీంతో నిన్న స‌మ్మె వ్య‌వ‌హారం ప‌రిష్కారం దిశ‌గా వెళుతున్న‌ట్లు క‌నిపించినా మ‌ళ్లీ మొద‌టికొచ్చింది.

 

రుణమాఫీలు శాశ్వత పరిష్కారం కాదు. గిట్టుబాటు ధరలే సమస్య: ఉపరాష్ట్రపతి

రుణమాఫీలు శాశ్వత పరిష్కారం కాదు. గిట్టుబాటు ధరలే సమస్య: ఉపరాష్ట్రపతి

   10 hours ago


తెలంగాణలో కలకలం రేపిన 'దొంగలతో దోస్తీ' కథనం!

తెలంగాణలో కలకలం రేపిన 'దొంగలతో దోస్తీ' కథనం!

   14 hours ago


‘‘ఈజీవో నాపై వేధింపులకు పరాకాష్ట’’బాబు ట్వీట్

‘‘ఈజీవో నాపై వేధింపులకు పరాకాష్ట’’బాబు ట్వీట్

   15 hours ago


నూజివీడు ఘటనపై మంత్రి సురేష్ సీరియస్

నూజివీడు ఘటనపై మంత్రి సురేష్ సీరియస్

   15 hours ago


మిలీనియం టవర్స్ చుట్టూ అల్లుకున్న రాజకీయం!

మిలీనియం టవర్స్ చుట్టూ అల్లుకున్న రాజకీయం!

   15 hours ago


భూములు లాక్కోవడంలేదు.. తప్పుచేయకుంటే ఎందుకంత భయం?

భూములు లాక్కోవడంలేదు.. తప్పుచేయకుంటే ఎందుకంత భయం?

   16 hours ago


విద్యార్ధుల భవిష్యత్తే మాకు ముఖ్యం... నూజివీడు ట్రిపుల్ ఐటీ వీసీ హేమచంద్రారెడ్డి

విద్యార్ధుల భవిష్యత్తే మాకు ముఖ్యం... నూజివీడు ట్రిపుల్ ఐటీ వీసీ హేమచంద్రారెడ్డి

   16 hours ago


సిట్‌కు స‌హ‌క‌రించే సీన్ ఉందా..?

సిట్‌కు స‌హ‌క‌రించే సీన్ ఉందా..?

   17 hours ago


12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   22-02-2020


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   22-02-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle