newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేంద్ర విద్యుత్ బిల్లు విషయంలో తెలుగు రాష్ట్రాల సీఎంల చెరోదారీ!

16-09-202016-09-2020 17:58:59 IST
2020-09-16T12:28:59.034Z16-09-2020 2020-09-16T12:28:57.305Z - - 12-04-2021

కేంద్ర విద్యుత్ బిల్లు విషయంలో తెలుగు రాష్ట్రాల సీఎంల చెరోదారీ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరు ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా ఉంది. కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ బిల్లు చట్ట రూపం దాలిస్తే విద్యుత్ విషయంలో రాష్ట్రాల పూర్తిగా పరాధీనమైపోతాయి. మొత్తం పెత్తనం కేంద్రానికే దఖలౌతుంది. విద్యుత్‌ నియంత్రణ అంతా కేంద్రం చేతుల్లోకి వెళ్లనుంది. ఆఖరికి కరెంట్‌ కట్‌ అయినా కేంద్రం నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది.

ఇది సామాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. ఇంత స్పష్టంగా రాష్ట్రాల హక్కులను కేంద్రం లాగేసుకుంటుంటే... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమష్టిగా వ్యతిరేక గళం వినిపిస్తారని ఎవరైనా భావిస్తారు. అయితే అందుకు విరుద్ధంగా వీరి పరిస్థితి ఉంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్రంపై ఇంచుమించుగా యుద్ధం ప్రకటించినట్లుగా ధిక్కార స్వరం వినిపిస్తుంటే...ఏపీ సీఎం జగన్ మాత్రం కేంద్ర విధానాన్ని సంపూర్తిగా సమర్ధిస్తున్నారు. ఇందుకు కారణం ఉంది. కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ బిల్లు వల్ల ఏపీ రాష్ట్రంలో జగన్ సర్కార్ కు వచ్చిన నష్టం ఏమీ లేదు. పై పెచ్చు కేంద్రం బిల్లు కనుక చట్టరూపం దాల్చి అమలు అయితే జగన్ సర్కార్ నెత్తిన పాలు పోసినట్లే అవుతుంది.

విద్యుత్ సరఫరా పంపిణీలలో సర్కార్ వైఫల్యాలన్నీ కేంద్రం ఖాతాలోకి తోసేయ వచ్చు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికి మాత్రం కేంద్రం విధానం వల్ల ఎనలేని నష్టం వాటిల్లుతుంది. విద్యుత్ విషయంలో తెలంగాణ దేశంలో ఏ రాష్ట్రమూ చేయలేని విధంగా వ్యవసాయానికి పూర్తి ఉచిత విద్యత్ అదీ నాణమ్యేన విద్యుత్ ను నిరంతరాయంగా 24 గంటలూ సరఫరా చేస్తున్నది.

అంతే కాకుండా గృహ, పారిశ్రామిక అవసరాలకు నిరంతరాయంగా కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నది. ఇప్పుడు కేంద్రం జోక్యం వల్ల ఆ ఘనత రాష్ట్రానికి దక్కకుండా పోతుంది. ఉచిత విద్యుత్ కు కూడా లెక్కలంటూ మీటర్లు బిగించాల్సి రావడం అదనపు వ్యయంగా మారి రాష్ట్రంపై భారం పడుతుంది. ఇక ఏపీ సీఎం కేంద్ర విద్యుత్ విధానానికి ఎందుకు వత్తాసు పలుకుతున్నారంటే... ఏపీలో నిరంతర వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కేవలం నాలుగైదు గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు.  అది నాలుగైదు గంటలు మాత్రం ఉచితంగా ఇస్తున్నారు.

అందులోనూ లెక్కలేని అనధికార కనెక్షన్లు ఉండటంతో వాటి వల్ల ఒనగూరే నష్టాలను తగ్గించుకోవాలన్న ప్రభుత్వ యోచన వల్ల ఎదురయ్యే ప్రజావ్యతిరేకత..ఇప్పుడు కేంద్రం విధానం వల్ల ఆ ఖాతాలలో పడిపోతుంది. ఇక గృహ,పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు కూడా నిరంతర విద్యుత్‌ ఏపీలో అందడం లేదు. అందుకే ఏపీ సర్కార్ కు కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ బిల్లు ఔదాల్యమే ఔతుంది. అందుకే ఏపీ సర్కార్ కేంద్ర విధానాన్ని అంగీకరిస్తున్నది. కేసీఆర్ మాత్రం కేంద్రం విద్యుత్ పాలసీ వల్ల పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని అంచనా వేశారు. అందుకే వ్యతిరేకించడమే కాదు..అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు.

కలిసి వచ్చే అన్ని పార్టీలూ, రాష్ట్రాలతో కలిసి ఆందోళనా పథంలో ముందుకెళ్లాలని నిర్ణయించారు. వ్యవసాయానికి నిరంతరాయంగా ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం యావద్దేశంలోనూ తెలంగాణ ఒక్కటే. అలాగే గృహ, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు అంతరాయం లేకుండా 24 గంటలూ విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణయే. కరోనా కష్టాల్లో ప్రజలు ఉండగా ఆదుకోవాల్సిన కేంద్రప్రభుత్వం ఇదే అదనుగా భావించి, సంస్కర ణల పేరుతో వినాశకర విధానాల వేగం పెంచిందనడానికి నిలువెత్తు నిదర్శనంగా  విద్యుత్‌ నియంత్రణ బిల్లును చెప్పుకోవచ్చు.   

అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి. వాటన్నిటినీ కలుపుకుని కేంద్రంపై పోరుకు తెలంగాణ సీఎం సిద్ధమౌతుంటే...జగన్ సర్కార్ మాత్రం అప్పుడే వెూటర్లకు విూటర్లు బిగించి నగదు బదిలీ పథకానికి తెరతీసారు. దీనిని బట్టి చూస్తే జగన్ వెూడీ సర్కార్ షరతులను వ్యతిరేకించకపోవడమే కాదు, వాటిని కేంద్రం కంటే వేగంగా అమలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారని అర్ధమౌతుంది.   


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle