కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్.. తదుపరి వ్యూహమేంటి?
21-09-202021-09-2020 13:30:01 IST
2020-09-21T08:00:01.299Z21-09-2020 2020-09-21T07:59:58.471Z - - 19-04-2021

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు జాతీయంగా మద్దతిస్తూనే వచ్చింది. రాష్ట్రంలో నేతలు విమర్శ, ప్రతి విమర్శలకు దిగుతున్నా ఇప్పటి వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన బిల్లులను టీఆర్ఎస్ సమర్ధిస్తూ వచ్చింది. గతంలో కేవలం పార్లమెంటులో కేంద్ర బిల్లుకు ఓటేయడం కోసమే టీఆర్ఎస్ ఎంపీ, పార్టీ ముఖ్యనేత సంతోష్ కుమార్ జోగినపల్లి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి ఓటేసిన వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు తొలిసారిగా కేంద్ర బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఓటేసింది.
బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులు తీవ్ర రగడను రేపాయి. లోక్ సభలో బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఉండడంతో సులభంగా బిల్లు ఆమోదించుకున్న ప్రభుత్వం రాజ్యసభలో మాత్రం మూజువాణి ఓటుతో ఆమోదించుకోవాల్సి వచ్చింది. రాజ్యసభలో ఈ బిల్లులపై కాంగ్రెస్ పార్టీతో సహా చాలా పార్టీలు వ్యతిరేకించినా ప్రభుత్వం మూజువాణితో ఆమోదం చేసుకుంది. దీనిపై సభ్యులు రగడకు దిగడంతో చైర్మన్ ఎనిమిది మంది సభ్యులను సస్పెండ్ కూడా చేశారు. అయినప్పటికీ సభ్యులు సభను వదిలివెళ్లకపోవడంతో వివాదం సోమవారం కూడా కొనసాగుతూనే ఉంది.
కాగా, టీఆర్ఎస్ ఈ తాజా తిరుగుబాటు చేయడం వెనుక రాజకీయ పరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. వ్యవసాయ బిల్లులతో పాటు కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ బిల్లును కూడా కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ సర్కార్‌పై కేసీఆర్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు జాతీయ రాజకీయాలపై టీఆర్ఎస్ వ్యూహమేంటదానిపై సర్వత్రా చర్చసాగుతోంది. వ్యవసాయ, విద్యుత్ బిల్లుల్లపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని చెప్తున్న కేసీఆర్ ఆ విధంగా దక్షణాది రాష్టాలను కలుపుకొని తన గళం వినిపిస్తారా అనే అనుమానపు చర్చలు జరుగుతున్నాయి.
తాజాగా వ్యవసాయ బిల్లును ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దక్షణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దక్షణాదిలో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ తప్ప మిగతా వారంతా కేంద్రానికి వ్యతిరేకంగానే గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ పార్టీలను టీఆర్ఎస్ బాస్ కలుపుకొని పోతూ జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేకం ఉద్యమానికి తెరలేపుతారా అనే మీమాంస కొనసాగుతుంది. వచ్చే రెండు నెలలలో తెలంగాణలో పలు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఈ అంశం ప్రధానంగా ఉపయోగపడే అవకాశం ఉండడంతో ఆ దిశగానే కేసీఆర్ ఈ ఎత్తుకు తెరలేపారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా గులాబీ బాస్ తదుపరి వ్యూహం ఏంటన్నది ఆసక్తిగా మారిందనే చెప్పాలి!

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
4 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
5 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
an hour ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
8 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
8 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
23 minutes ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
2 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
8 hours ago

ఇక కేటీఆర్ టైం వచ్చినట్లేనా
10 hours ago

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
18-04-2021
ఇంకా