newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి షాక్.. వెబ్ సైట్ హ్యాక్

26-08-202026-08-2020 08:43:09 IST
Updated On 26-08-2020 09:22:13 ISTUpdated On 26-08-20202020-08-26T03:13:09.914Z26-08-2020 2020-08-26T03:12:57.224Z - 2020-08-26T03:52:13.523Z - 26-08-2020

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి షాక్.. వెబ్ సైట్ హ్యాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహా య మంత్రి జి.కిషన్‌రెడ్డి కి హ్యాకర్లు షాకిచ్చారు. ఆయన వ్యక్తిగత వెబ్‌సైట్‌ ‘కిషన్‌ రెడ్డి డాట్‌ కాం’ను పాకిస్థానీ హ్యాకర్లు భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున హ్యాక్‌ చేశారు. అందులో కశ్మీర్‌ ఆజాదీ, పాకిస్థాన్‌ అనుకూల, భారత ప్రభుత్వ వ్యతిరేక నినాదాలను పోస్టు చేశారు. వెబ్‌సైట్‌ను సాంకేతిక బృందం పునరుద్ధరిస్తోంది.

కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కావడంతో హ్యాకర్లు అందులో కీలక సమాచారం వుండి వుంటుందని భావించి వుంటారు. ఆగస్టు 15 నుండి కిష‌న్ రెడ్డి వెబ్ సైట్ లో దేశ వ్యతిరేక పోస్టులు కనిపించడాన్ని ఆయన అనుచ‌రులు గుర్తించారు. దీంతో వెబ్ సైట్ హ్యాక్ కు గురైనట్టు నిర్ధారించారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆ వెబ్‌సైట్‌పై 'temporarily unavailable' అన్న సందేశం కనిపిస్తోంది. దీని వెనక అసలు కారణాలను వెతుకుతున్నారు. కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్ సైట్ కావడంతో దానిలో దేశ భద్రతకు సంబంధించి ఎలాంటి సమాచారం పొందుపర్చలేదని అధికారులు తెలిపారు. 

బీజేపీ కార్యక్రమాలకు సంబంధించి అందులో సమాచారం వుంటుంది. పుట్టినరోజులు, పండుగ శుభాకాంక్షలు, ఆయన వ్యక్తిగత పర్యటనలకు సంబంధించిన పోస్టులు అందులో వుంటాయి. కేవలం వ్యక్తిగత కార్యక్రమాలకు సంబందించిన సమాచారం మాత్రమే ఉందని, హ్యాకర్ల వల్ల ఎలాంటి ఇబ్బందిలేదన్నారు. ప్రస్తుతం సాంకేతిక నిపుణుల సహాయంతో వెబ్ సైట్ ను హ్యాకర్ల నుండి తప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు సైబ‌ర్ పోలీసులు తెలిపారు. హ్యాకర్ల వీఐపీల వెబ్ సైట్లపై కన్నేసి వుంచుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్లను హ్యాకర్లు టార్గెట్ చేస్తుంటారు.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   13 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   17 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   15 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   20 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   19 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   18 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle