newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేంద్రమంత్రిపై గుత్తా ఫైర్.. అసెంబ్లీ సీట్లు పెంచాలని డిమాండ్

02-03-202002-03-2020 12:43:57 IST
2020-03-02T07:13:57.529Z02-03-2020 2020-03-02T07:13:54.480Z - - 19-04-2021

కేంద్రమంత్రిపై గుత్తా ఫైర్.. అసెంబ్లీ సీట్లు పెంచాలని డిమాండ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్ర హోం శాఖ సహాయమంత్రిపై తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పార్లమెంటు ఆమోదించిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం అగౌరవ పరుస్తోందన్నారు. అసెంబ్లీ సీట్ల పెంపుపై గుత్తా సుఖేందర్ రెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సరికావన్నారు. రాష్ట్ర విభజన రాత్రిళ్ళు చేసుకున్నారని అవహేళన చేయడం కిషన్ రెడ్డికి తగదన్నారు. 

డిలిమిటేషన్ ప్రక్రియ జమ్మూకాశ్మీర్ కే వర్తిస్తుందని అనడం విడ్డూరంగా ఉందన్నారు. పునర్విభజన చట్టాన్ని గౌరవించి రెండు రాష్ట్రాల్లో డిలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఏపీ పునర్విభజన చట్టంలో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించిన క్లాజ్ అమలు చేయాలన్నారు. అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పటికే జరగాల్సి వున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి మంచి కార్యక్రమం అని, ప్రజలందరినీ భాగస్వామ్యం చేసే కార్యక్రమం ఇదన్నారు. దీనికి రాజకీయాలు జోడించాల్సిన అవసరం లేదని, ఒకరిని ఒకరు విమర్శించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు గుత్తా. 

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle