కేంద్రమంత్రికీ తప్పని లాక్ డౌన్ కష్టాలు
13-04-202013-04-2020 12:36:10 IST
Updated On 13-04-2020 12:52:09 ISTUpdated On 13-04-20202020-04-13T07:06:10.879Z13-04-2020 2020-04-13T07:05:50.865Z - 2020-04-13T07:22:09.428Z - 13-04-2020

ఆయనో కేంద్రమంత్రి. అదేదో ఆషామాషీ శాఖ కాదు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆయన సహాయకుడు. సికింద్రాబాద్ ఎంపీ. కరోనా లాక్ డౌన్ వేళ నిబంధనలు పాటించే వారిలో ఆయన కూడా ఒకరు. ఏపీనుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి తెగ తిరిగేస్తున్నారు మంత్రులు, ఎంపీలు. కానీ హెంశాఖ సహాయమంత్రి మాత్రం రూల్స్ బ్రేక్ చేయలేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లి సంవత్సరీకం కార్యక్రమాన్ని సోదరులు, బంధువుల తో కలిసి నిర్వహించారు. ఆయనే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి.
కరోనా లాక్ డౌన్ వేళ దేశ రాజధాని ఢిల్లీని వీడలేని పరిస్థితి. తల్లి సంవత్సరికానికి హాజరు కాలేకపోయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశానికి హోం శాఖ సహాయ మంత్రి అయినా స్వస్థలానికి వెళ్లలేని పరిస్థితిలో వున్నారు. కరోనా వైరస్ నివారణ, పర్యవేక్షణ బాధ్యతలతో గత నెల రోజులుగా ఢిల్లీ లోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉండిపోయారు.హోం శాఖ బాధ్యతలు ఉన్న తాను స్వయంగా లాక్ డౌన్ నియమాన్ని ఉల్లంఘించదలుచుకోలేదు అన్నారు కిషన్ రెడ్డి.
ఢిల్లీ లోని తన నివాసంలో ఒక్కడే తల్లి సంవత్సరీకం నిర్వహించారు కిషన్ రెడ్డి. భార్య, పిల్లలు, సోదరులు అందరూ స్వగ్రామం తిమ్మాపూర్ నుంచి, మంత్రి ఢిల్లీ నుంచి ఆన్ లైన్లో సంవత్సరీకంలో పాల్గొన్నారు. కష్ట సమయంలో ఢిల్లీ బాధ్యత వదిలి వెళ్ళదలుచుకోలేక అక్కడ నుంచే కార్యక్రమం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లి సంవత్సరీకం కార్యక్రమాన్ని సోదరులు, బంధువుల తో కలిసి నిర్వహించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న వేళ కిషన్ రెడ్డి తలచుకుంటే హైదరాబాద్ రాగలరు. కానీ మోడీ బాటలోనే నడిచే కిషన్ రెడ్డి నియమాలను పాటించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అదే మన పక్కనున్న ఏపీలో అయితే మంత్రులు తెలంగాణకు వచ్చేస్తారు. మరో ఎంపీ విజయసాయిరెడ్డి అయితే ఏకంగా వైజాగ్ నుంచి హుటాహుటిన అమరావతికి వచ్చేస్తారు. కానీ వీరికి మాత్రం నియమాలు వర్తించవనే కామెంట్లు పడుతున్నాయి. కిషన్ రెడ్డికి మిగిలిన రాజకీయనేతలకు ఎంత తేడా అని అంతా చర్చించుకుంటున్నారు.


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
5 hours ago

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!
6 hours ago

షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!
3 hours ago

తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు
6 hours ago

కూరలో కరవేపాకు అయిన బండి సంజయ్
39 minutes ago

జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భవిష్యత్
7 hours ago

అబ్బో సమస్యలపై కూడా జగన్ ఫోకస్ చేస్తున్నారా
8 hours ago

కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ
21 hours ago

కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు
17-04-2021

దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి
a day ago
ఇంకా