newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేంద్రం తీరుపై మండిపడ్డ కేసీయార్.. ప్యాకేజ్ పచ్చిమోసం

18-05-202018-05-2020 20:44:44 IST
Updated On 19-05-2020 08:00:11 ISTUpdated On 19-05-20202020-05-18T15:14:44.071Z18-05-2020 2020-05-18T15:14:26.247Z - 2020-05-19T02:30:11.413Z - 19-05-2020

కేంద్రం తీరుపై మండిపడ్డ కేసీయార్.. ప్యాకేజ్ పచ్చిమోసం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రం తీరుపై మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీయార్. కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్బర్ ప్యాకేజీ అంతా డొల్ల అన్నారు. రాష్ట్రంలో కంటైన్మెంట్‌ ఏరియాలు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలను గ్రీన్‌ జోన్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇక ఇప్పటికే 29 దాకా లాక్ డౌన్ ప్రకటించామన్న ఆయన కేంద్రం చెప్పినట్టు తెలంగాణలోనూ 31 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తామని తెలిపారు.

కంటైన్మెంట్‌ ఏరియాలలో కేవలం 1452 కుటుంబాలు మాత్రమే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో లాక్‌డౌన్‌ మార్గదర్శకాల గురించి ఆయన వివరించారు. కంటైన్మెంట్‌ ఏరియాలో లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని,  పూర్తిగా పోలీసు పహారాలోనే కంటైన్మెంట్‌ ఏరియా ఉంటుందని పేర్కొన్నారు. కంటైన్మెంట్‌ ఏరియాలో ఉండే కుటుంబాలకు నిత్యావసరాలు ప్రభుత్వమే సరఫరా చేస్తుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇక కరోనాకు వ్యాక్సిన్‌ రేపోమాపో వచ్చే పరిస్థితి లేదని ప్రపంచం అంగీకరించిందన్న ఆయన కరోనాతో కలసి జీవించడం నేర్చుకోవాలని అన్నారు. బతుకుదెరువు కోసం అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాలని ఆయన చెప్పుకొచ్చారు.  

ఇవాళ్టి  కేబినెట్‌ సమావేశంలో కేంద్ర మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చించినట్లు  చెప్పారు. అధికారులతో మాట్లాడి వ్యూహరచన చేసినట్లు వివరించారు.   రాష్ట్రంలో కంటైన్మెంట్‌ ఏరియాలు  మినహా.. మిగతావన్నీ గ్రీన్‌జోన్లేనని పేర్కొన్నారు. కేబినెట్‌ సమావేశం అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌ నగరం తప్ప అన్నిచోట్లా అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎక్కడ దుకాణాలు తెరవాలో ప్రకటిస్తారని' సీఎం పేర్కొన్నారు. సిటీ బస్సులు తప్ప ఆటోలు తిరుగుతాయన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు ఎలాంటి రాజీ పడబోమన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ తీరుని ఆయన తప్పుబట్టారు. 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   an hour ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   an hour ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   5 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   7 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   2 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   9 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   10 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   2 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   4 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   10 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle