newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేంద్రం, ఏపీ రెండింటి సందేహాలు తీరుస్తాం.. సీమ ఎత్తిపోతల్ని అడ్డుకుంటాం.. కేసీఆర్

21-08-202021-08-2020 07:50:31 IST
2020-08-21T02:20:31.805Z21-08-2020 2020-08-21T02:20:23.820Z - - 15-04-2021

కేంద్రం, ఏపీ రెండింటి సందేహాలు తీరుస్తాం.. సీమ ఎత్తిపోతల్ని అడ్డుకుంటాం.. కేసీఆర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ నదీజలాల వినియోగం విషయంలో వస్తున్న అభ్యంతరాలన్నింటికీ ఆగస్టు 25న జరగనున్న అపెక్స్ కౌన్సిల్ భేటీలో సమాధానాలు ఇస్తామని, కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రెండింటి సందేహాలను తీరుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఏపీ అభ్యంతరాల నివృత్తికి సమగ్ర సమాచారం సిద్ధం చేయాలని ఆదేశించిన కేసీఆర్ రాయలసీమ ఎత్తిపోతలపై గట్టిగా అభ్యంతరం చెప్పాలని నిర్ణయించారు. 

ఈ నెల 25న అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన ముఖ్యమంత్రి.. భేటీ విషయంలో సంసిద్ధతను వ్యక్తం చేస్తూ లేఖ రాయాలని నిర్ణయించారు. ఎజెండాలో చేర్చాల్సిన అంశాలను సైతం ఆ లేఖలో పేర్కొంటామని తెలిపారు. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.

కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ లేవనెత్తిన సందేహాలన్నింటినీ అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో నివృత్తి చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణకు ఉన్న అభ్యంతరాలను సైతం సమావేశంలో లేవనెత్తుతామని వెల్లడించారు. 

తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులపై కేంద్రం, ప్రత్యేకించి ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అన్ని సందేహాలను కౌన్సిల్‌ భేటీలో నివృత్తి చేయాలని, దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వాస్తవానికి తెలంగాణలో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదని, ఉమ్మడి ఏపీలోని ప్రాజెక్టులనే రాష్ట్ర అవసరాలను తీర్చేలా రీడిజైన్‌ చేశామని తెలిపారు. ఇదే విషయాన్ని ఆధారాలతో సహా కౌన్సిల్‌ సమావేశంలో చెప్పాలని నిర్ణయించారు. 

ఆయా ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి.. ఎన్ని నిధులు కేటాయించారు.. తెలంగాణ వచ్చే నాటికి ఎంత ఖర్చు చేశారు.. ఎంతభూమి సేకరించారు.. ఎన్ని టీఎంసీలు కేటాయించారన్న వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వాడకానికి సంబంధించి బచావత్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన అవార్డుకు అనుగుణంగానే తెలంగాణ వ్యవహరించిందన్న విషయాన్ని ఆధార సహితంగా వివరించాలని సూచించారు. 

అదేసమయంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుతో పాటు ఏపీ కొత్తగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గట్టిగా అభ్యంతరం చెప్పాలని నిర్ణయించారు. నీటి కేటాయింపులు లేకున్నా, అనుమతులు లేకున్నా, ట్రిబ్యునల్‌ అవార్డుకు భిన్నంగా గోదావరి, కృష్ణా నదుల్లో ఏపీ అక్రమంగా వాడుకుంటున్న నీటి విషయంలో కూడా సమావేశంలో నిలదీయాలని స్పష్టం చేశారు. వీటికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని, అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. 

కేంద్రం కానీ, ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యక్తం చేసిన అభ్యంతరాలన్నీ అర్ధంపర్థం లేనివే అని పేర్కొన్నారు. నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేశామని, ఈ అపెక్స్‌ కౌన్సిల్‌లో అయినా ఆ అంశాలను చేర్చి న్యాయం చేయాలని కోరతామని సీఎం తెలిపారు.

 

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   2 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle