newssting
BITING NEWS :
* జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం

కేంద్రంపై కేటీఆర్ విమర్శలు .. సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోందని ఆందోళన

14-02-202014-02-2020 08:41:16 IST
2020-02-14T03:11:16.437Z14-02-2020 2020-02-14T03:07:57.241Z - - 30-05-2020

కేంద్రంపై కేటీఆర్ విమర్శలు .. సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోందని ఆందోళన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సమయం వచ్చినప్పుడల్లా కేంద్రంపై తన పోరాట వైఖరిని అటు తెలంగాణ సీఎం కేసీయార్, మంత్రి కేటీఆర్ తెలియచేస్తూనే వుంటారు. కేంద్రంలో వున్నవి జాతీయ పార్టీలు కానేకావని, అవన్నీ పెద్ద సైజు ప్రాంతీయపార్టీలేనని అన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ సమ్మిట్ లో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ‘దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో మాట్లాడారు.

కేంద్రం విధివిధానాలు ఎన్ని ఉన్నా వాటి ఆచరణ అంతా రాష్ట్రాల్లోనే ఉందన్నారు. కేంద్రం నిర్వహించే కార్యక్రమాల అమలును సైతం రాష్ట్ర ప్రభుత్వాలే చేయాల్సి ఉంటుందని చెప్పారు. మేకిన్‌ ఇండియా లాంటి కార్యక్రమాల్లోనూ రాష్ట్రాల అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సహకారం వంటి అంశాలు కీలకంగా ఉంటాయన్నారు.

కేంద్రం రాష్ట్రాలకు నిధులు ఇచ్చే విషయంలో అనుసరిస్తున్న వైఖరిని మంత్రి కేటీయార్ విమర్శించారు. వివిధ పన్నులు అన్నీ రాష్ట్రాలనుంచే కేంద్రానికి వస్తాయి.  రాష్ట్రాలు కూడా కేంద్రానికి నిధులు సమకూరుస్తున్నా రాష్ట్రాల అవసరాలు సరిగా తీర్చడంలేదన్నారు.  తెలంగాణ నుంచి గడిచిన ఐదేళ్లలో రూ.2.72 లక్షల కోట్లు కేంద్రానికి పన్నుల రూపంలో ఇస్తే తిరిగి తెలంగాణకు కేంద్రం రూ.1.12 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని గుర్తుచేశారు.

తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులతో పోల్చుకుంటే.. కేంద్రం అన్ని నిధులను రాష్ట్రానికి తిరిగి ఇవ్వడంలేదని, వివిధ పథకాల కోసం రాష్ట్రాలు అప్పులు చేయాల్సి వస్తోందన్నారు.

గతంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు అంశాన్ని కూడా ఈ సమ్మిట్లో కేటీయార్ ప్రస్తావించారు. నోట్ల రద్దు ద్వారా దేశానికి మంచి జరుగుతుంది.. సంపూర్ణ క్రాంతి వస్తుందన్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం అన్న మాటలు నమ్మి మద్దతిచ్చాం. కానీ పెద్ద నోట్ల రద్దు ద్వారా దేశానికి నష్టం జరిగిన విషయం తేలిన తర్వాత మా నిర్ణయం తప్పని తేలిందన్నారు. ఈ విషయంలో తమ పార్టీపై విమర్శలు వచ్చాయన్నారు. 

దేశంలో ప్రత్యామ్నాయ కూటమి ఆవశ్యకతను కేటీయార్ నొక్కిచెప్పారు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీలే బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ వస్తున్నాయి. భవిష్యత్తులో కచ్చితంగా ప్రత్యామ్నాయ కూటమికి అవకాశాలు ఏర్పడుతున్నాయి.

రెండు జాతీయ పార్టీలు దేశాన్ని ఇప్పటికే నిరాశ పరిచాయి. ఈ రెండుపార్టీలకు భిన్నంగా, జనం గురించి, ఆర్థిక అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీలు అవసరం. పౌరసత్వ సవరణ చట్టంపై కేటీయార్ విమర్శలు చేశారు. ఇలాంటి వివాదాస్పద చట్టాలపై కాకుండా.. అతి ప్రాధాన్యత కలిగిన ఇతర అంశాలపై ఫోకస్ పెడితే బాగుండేదన్నారు. 

భారతదేశానికి రెండో జాతీయ రాజధానిగా ప్రకటించాల్సి వస్తే హైదరాబాద్‌ ప్రజలు అంగీకరిస్తారో లేదో అనే విషయంలో నాకు అనుమానం ఉందన్నారు. అత్యుత్తమ నగరాల జాబితాలో, ప్రజలకు సురక్షితమయిన నగరంగా హైదరాబాద్ తన విశిష్టతను కాపాడుకుంటోందన్నారు.

దేశంలో సమాఖ్య విధానం సరిగా అమలు కావడంలేదన్నారు. నీతి ఆయోగ్‌ తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థికంగా సహకరించాలని అనేక సూచనలు చేసినా, ఇప్పటిదాకా మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి వాటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఇలాంటి విషయాల్లో రాష్ట్రాలపై ఉదాశీనవైఖరి అనుసరించడం మంచిది కాదన్నారు. 

 

బ్రేకింగ్: జూన్ 30 వరకూ లాక్ డౌన్ 5.O

బ్రేకింగ్: జూన్ 30 వరకూ లాక్ డౌన్ 5.O

   7 minutes ago


మెడికల్ స్టూడెంట్స్‌కు జగన్ బంపర్ ఆఫర్

మెడికల్ స్టూడెంట్స్‌కు జగన్ బంపర్ ఆఫర్

   20 minutes ago


వారసులకే జయ ఆస్తులు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

వారసులకే జయ ఆస్తులు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

   3 hours ago


ఒక వైపు కరోనా ఉధృతి.. పిడుగురాళ్ళలో సున్నపురాయి దోపిడీ

ఒక వైపు కరోనా ఉధృతి.. పిడుగురాళ్ళలో సున్నపురాయి దోపిడీ

   7 hours ago


నిమ్మగడ్డ రమేష్ కేసు.. ఎవరెవరు ఏమన్నారంటే...?

నిమ్మగడ్డ రమేష్ కేసు.. ఎవరెవరు ఏమన్నారంటే...?

   7 hours ago


అనంతలో కలకలం రేపిన మిడతల దండు..శాస్త్రవేత్తల భరోసా

అనంతలో కలకలం రేపిన మిడతల దండు..శాస్త్రవేత్తల భరోసా

   7 hours ago


దేశాన్నే అబ్బురపరిచే కేసీఆర్ ‘తీపి కబురు’ ఏమిటి? సర్వత్రా ఆసక్తి

దేశాన్నే అబ్బురపరిచే కేసీఆర్ ‘తీపి కబురు’ ఏమిటి? సర్వత్రా ఆసక్తి

   8 hours ago


వరవరరావుని వెంటనే విడుదల చేయాలి.. భార్య హేమలత డిమాండ్

వరవరరావుని వెంటనే విడుదల చేయాలి.. భార్య హేమలత డిమాండ్

   9 hours ago


వరవరరావుకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

వరవరరావుకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

   10 hours ago


ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కరోనా కలకలం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కరోనా కలకలం

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle