newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

కేంద్రంతో క‌య్యానికి సిద్ధం..!

09-12-201909-12-2019 07:30:36 IST
2019-12-09T02:00:36.439Z09-12-2019 2019-12-09T01:59:17.041Z - - 24-02-2020

కేంద్రంతో క‌య్యానికి సిద్ధం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్ర ప్ర‌భుత్వంతో అవ‌లంభించాల్సిన విధానం ప‌ట్ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చారు. ఇక నుంచి కేంద్రంతో మెత్త‌గా మాట్లాడితే లాభం లేద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ వ్యాఖ్య‌లే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. కేంద్రం విధానాల వ‌ల్లే రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు అని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ద‌క్షిణాధిని కేంద్రం చిన్న చూపు చూస్తోందని మంత్రి కేటీఆర్ నిందిస్తున్నారు.

2014 నుంచి 2018 వ‌ర‌కు టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య స‌ఖ్య‌త బాగానే ఉండేది. అనేక బిల్లుల‌కు పాస్ అయ్యేందుకు టీఆర్ఎస్ పార్ల‌మెంటులో కేంద్రానికి స‌హ‌క‌రించింది. కేంద్ర‌మంత్రులు త‌ర‌చూ తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌శంస‌లు కురిపించే వారు. కేసీఆర్ కూడా ఎప్పుడూ కేంద్రాన్ని గ‌ట్టిగా విమ‌ర్శించిన దాఖ‌లాలు లేవు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభ‌జ‌న హామీలు సాధించుకోవ‌డంలోనూ కేంద్రంతో స‌ఖ్య‌త‌గా న‌డిచారు.

కానీ, 2019 త‌ర్వాత ప‌రిస్థితి మారింది. పార్ల‌మెంటు ఎన్నిక‌ల స‌మ‌యంలో కేసీఆర్ బీజేపీపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేశారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. ఇది బీజేపీకి కేసీఆర్ ప‌ట్ల అసంతృప్తికి కార‌ణ‌మైంద‌నే ప్ర‌చారం ఉంది. ఇక‌, తెలంగాణ‌లో నాలుగు లోక్‌స‌భ గెల‌వ‌డంతో రాష్ట్రంలో బ‌ల‌ప‌డాల‌నే టార్గెట్ పెట్టుకుంది బీజేపీ. ఇందులో భాగంగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు పెంచింది.

ఇప్పుడు తెలంగాణ‌ను రాజ‌కీయ కోణంలో బీజేపీ చూస్తోంది. దీంతో స‌హ‌జంగానే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌తో దూరం పెరిగింది. తాజా ప‌రిణామాల‌తో బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య స‌ఖ్య‌త మ‌రింత చెడింది. ఇటీవ‌ల ఆర్టీసీ కార్మికుల స‌మ్మె వ్య‌వ‌హారంలో బీజేపీ రాష్ట్ర ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పులు తెచ్చింది. ఆర్టీసీ విష‌యంలో కేసీఆర్ ఆలోచ‌న‌లు అమ‌లు కాకుండా కేంద్రమే చేసింద‌నే ప్ర‌చారం ఉంది.

తెలంగాణ‌కు రావాల్సిన‌న్ని నిధులు ఇవ్వ‌డం లేద‌నేది రాష్ట్ర ప్ర‌భుత్వ వాద‌న‌. ఈ ప‌రిస్థితి కొత్తేమీ కాకున్నా ఇంత‌కాలం చేయ‌న‌న్ని విమ‌ర్శ‌లు ఇప్పుడు టీఆర్ఎస్ చేస్తోంది. స్వయంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధించేందుకు గ‌ట్టిగా డిమాండ్ చేయాల‌ని కేసీఆర్ నిర్ణ‌యానికి వ‌చ్చారు.

తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు రాజ‌కీయంగా ఇప్పుడు కాంగ్రెస్ ఎంత శ‌త్రువో బీజేపీ కూడా అంతే శ‌త్రువుగా మారింది. ఆ మాట‌కొస్తే కాంగ్రెస్ కంటే బీజేపీనే ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా ఎదుగుతోంది. ఈ ప‌రిస్థితుల్లో రాజ‌కీయంగా కూడా బీజేపీతో స‌ఖ్య‌త అనేది సాధ్యం కాదు. దీంతో ఇక నుంచి బీజేపీపై కేసీఆర్ వార్ ప్రక‌టించిన‌ట్లే లెక్క‌.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle