newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

కెసిఆర్ కి షాక్ ... తెలంగాణలో ఒక్కరోజులో 50 పాజిటివ్ కేసులు

17-04-202017-04-2020 08:16:39 IST
Updated On 17-04-2020 08:36:37 ISTUpdated On 17-04-20202020-04-17T02:46:39.849Z17-04-2020 2020-04-17T02:46:04.419Z - 2020-04-17T03:06:37.048Z - 17-04-2020

కెసిఆర్ కి షాక్ ... తెలంగాణలో ఒక్కరోజులో 50 పాజిటివ్ కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో బుధవారానికి, గురువారానికి తేడా ఏమిటి అంటే 6 నుంచి 50 దాకా అనే సమాధానం వస్తుంది. ఇది కరోనా కేసుల సంఖ్య మరి. బుధవారంలో కేవలం 6 పాజిటివ్ కేసుల నమోదుతో కరోనా చైన్‌ను తెగ్గొట్టామని సంబరపడిన రాష్ట్ర ప్రభుత్వం, వైద్యాధికారులు, ప్రజలు గురువారం నాటి పరిస్థితిను చూసి బిత్తరపోయారు. రోజురోజుకూ కరోనా వ్యాప్తి నిరోధంపై వేసుకున్న అంచనాలు ఎంత తల్లకిందులవుతున్నాయంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో వ్యవస్థ మొత్తం కొట్టుమిట్టులాడుతోంది. 

లాక్ డౌన్ మాత్రం ఆర్భాటంగా ప్రకటించి అమలు చేసి కరోనా హుష్ కాకీ అంటే పోదని, అత్యధిక శాతం జనాభాకు వేగంగా పరీక్షలు నిర్వహించకపోతే భారత్‌లో కరోనాను అరికట్టడం అసాధ్యమని అంతర్జాతీయ నిపుణులు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు నిజమని నిరూపిస్తూ తెలంగాణలో 24 గంటల్లోనే 50 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 700కు చేరుకుంది.

బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 6 కేసులు మాత్రమే నమోదు కావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఇక పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతుందనే అంచనాలు 24 గంటలు కూడా గడవకముందే తలకిందులయ్యాయి. గురువారం ఏకంగా 50 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 700కి చేరుకుంది. గురువారం మొత్తం 800 మంది నమూనాలను పరీక్షించగా, 50 పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. నమోదైన కేసుల్లో అత్యధికం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. 

ఇప్పటివరకు రాష్ట్రంలో 18 మంది మరణించారు. ఇక గురువారం 68 మంది డిశ్చార్జి కావడంతో, కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లినవారి సంఖ్య 186కి చేరింది. పాజిటివ్ కేసులు అనూహ్యంగా 24 గంటల్లో 8 రెట్లు పెరగడంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గిందనే ఆనందం ఒక్కరోజులోనే ఆవిరైంది. 

తెలంగాణ మొత్తంలో ఒక్క సూర్యాపేటలోనే గురువారం కొత్తగా 16 మందికి కరోనా సోకింది. దీంట్లో కూడా ఒక్కరి నుంచి 14 మందికి వైరస్ వ్యాప్తి చెందడం గమనార్హం.  ఇక హైదరాబాద్‌లో కొత్తగా 25 మందికి పాజిటివ్ అని తేలింది. కొత్తగా నిజామాబాద్‌లో 3 కేసులు నమోదయ్యాయి. ఇది ఏరకంగానూ రాష్ట్రానికి మంచిదికాదని వైద్య అధికారులు వాపోతున్నారు. అంతకు మందు కూడా వరుసగా రెండు రోజులు 20 లోపే పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా మరుసటి రోజు 61 కేసులు నమోదయ్యాయి. రోజుకో రకమైన ఫలితాలు వస్తుండటంతో రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తిపై స్పష్టమైన అంచనా రావడం లేదు. కొత్తగా 50 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 700కు పెరిగింది. 

కొవిడ్‌ నుంచి కోలుకొని గురువారం 68 మంది డిశ్చార్జి అయ్యారు. గురువారం నమోదైన కేసుల్లో సూర్యాపేట, హైదరాబాద్‌ నుంచే ఎక్కువగా ఉన్నాయి. ముషీరాబాద్‌లోని కృష్ణకాలనీ సమీపంలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమెతో సన్నిహితంగా ఉండే మరో 18 మందిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

జిల్లాలవారీగా చూస్తే సూర్యాపేట పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన 14 మందికి వైరస్‌ సోకింది. తిరుమలగిరిలో ఒకరికి, ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ఏపూర్‌ గ్రామంలో ఆరేళ్ల బాలుడికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 39కి పెరిగింది. గ్రేటర్‌ పరిధిలో కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో చాలా వరకు ఇప్పటికే గుర్తించిన కంటైన్మెంట్‌  జోన్ల పరిధిలోనే నమోదయ్యాయి. అయితే కొత్తగా 6 ప్రాంతాల్లో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆరు ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లు గా ప్రకటించనున్నట్లు ఓ అధికారి చెప్పారు. 

యూకుత్‌పురా రెయిన్‌ బజార్‌లో ఓ కుటుంబంలో గతంలో రెండు కేసులు నమోదవగా తాజాగా అదే కుటుంబంలో 7 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్‌ జిల్లాలో గురువారం మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 58కి చేరింది. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం, కేంద్ర ప్రభుత్వం జిల్లాను రెడ్‌జోన్‌గా ప్రకటించడంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. 

గురువారం కోవిడ్ 19 పాజిటివ్ కేసులుగా గుర్తించిన వాటిలో 90 శాతం దాకా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించడంతో జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాలు కలవరపడుతున్నాయి. నిఘా బృందాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా  800 అనుమానిత కేసుల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాయని మంత్రి చెప్పారు.అయితే రాష్ట్రంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఎవరి పరిస్థితి విషమంగా లేదని, ముగ్గురు వెంటిలేటర్‌పై ఉన్నారని మంత్రి ఈటల తెలిపారు. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు.. వారితో కాంటాక్ట్‌ అయినవారు పరీక్షలకు ముందుకు రావాలని కోరారు.

వైరస్‌ అధికంగా ప్రబలుతున్న ప్రాంతాలను ప్రభుత్వం కంటైన్మెంట్‌ ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 28 జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి చెందగా, గురువారం నాటికి 13 జిల్లాల్లో 159 కంటైన్మెంట్‌ ప్రాంతాలను సర్కారు ఏర్పాటు చేసింది. ఇందులో తాజాగా 99,257 ఇళ్లకు వెళ్లి, 3,97,028 మందిని వైద్య బృందాలు కలిసి వారి వివరాలు సేకరించాయి. కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఏవైనా ఉన్నాయా? మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారి సెకండరీ కాంటాక్ట్‌లను ట్రేస్‌ చేసి పరీక్షలు చేస్తున్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఓ మహిళ కరోనాతో చనిపోయిందేమోనన్న అనుమానంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్న 33 మందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. సదరు మహిళ కొంతకాలంగా రక్త కేన్సర్‌తో బాధపడుతోంది. 3 నెలలుగా హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మంగళవారం చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు తమ సొంత గ్రామమైన రుద్రారానికి తీసుకెళ్లి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా అధికారుల ఆదేశానుసారం మొత్తం 33 మందిని జిల్లా కేంద్రంలోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.

ఏపీ నుంచి వచ్చిన బాలుడికి కరోనా పాజిటివ్

జగిత్యాల జిల్లాలో ఓ ఆశా కార్యకర్త అప్రమత్తత వంజరిపల్లె గ్రామాన్ని కరోనా నుంచి కాపాడింది. గ్రామానికి చెందిన ఓ బాలుడు(5) గుంటూరు ఆస్పత్రిలో కాక్లియర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసుకుని ప్రత్యేక అనుమతితో ఈ నెల 14న గ్రామానికి తన తాతతో కలిసి బయల్దేరాడు. విషయం తెలుసుకున్న వంజరిపల్లె ఆశా కార్యకర్త సుజాత వారిని 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని కోరింది. సర్పంచ్‌తో పాటు పెద్దలకు విషయాన్ని చెప్పింది. దీంతో ఆ బాలున్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. నమూనాలు తీసి హైదరాబాద్‌కు పంపగా అతనికి పాజిటివ్‌ వచ్చింది.

డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు పాజిటివ్.. గాంధీ ఆసుపత్రిలో భయాందోళనలు.. 

సికింద్రాబాద్‌ లోని గాంధీ మెడికల్‌ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి(35)కి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు నిర్ధారణ అయినట్టు తెలియడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పాతబస్తీలోని యాకుత్‌పురాకు చెందిన వ్యక్తి గాంధీ మెడికల్‌ కాలేజీలోని ఎలక్ట్రానిక్‌ లైబ్రరీలో రెగ్యులర్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (డీఈఓ)గా విధులు నిర్వహిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతుండటంతో రెండు రోజుల క్రితం అతడి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. గురువారం రాత్రి అందిన నివేదికలో అతడికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. వెంటనే సదరు బాధితుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. 

అయితే నమూనాలు ఇచ్చిన తర్వాత రెండు రోజులు అతడు యధావిదిగా విధులకు హాజరు కావడంతో గాంధీ ఆస్పత్రిలోని వైద్యులు, వైద్య విద్యార్థులు, ఇతర సిబ్బంది భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. అందరితోనూ అతడు కలివిడిగా ఉంటాడని తెలిసింది. బుధవారం గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓ పేషీల వద్ద అతడు తిరిగినట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఆయా పేషీలలోని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కాగా, గాంధీ మెడికల్‌ కాలేజీ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయాన్ని ధ్రువీకరించడానికి సంబంధిత అధికారులు అందుబాటులో లేరు.

మొత్తం పరిణామాలను చూస్తుంటే దేశంలో కరోనా చైన్‌ని తెగ్గొట్టడం అంత సులభం కాదని మే 31 దాకా లాక్ డౌన్ కొనసాగక తప్పదని అర్థమవుతోంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ఘనత గురించి డప్పు వాయించడం ఆపివేసి జనాభాలో అత్యధిక శాతానికి కరోనా టెస్టులు జరపడంపై  వెంటనే దృష్టి పెట్టాలని నిపుణుల ఉవాచ.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle