newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

24-05-202024-05-2020 09:58:22 IST
Updated On 24-05-2020 12:52:58 ISTUpdated On 24-05-20202020-05-24T04:28:22.631Z24-05-2020 2020-05-24T04:28:09.441Z - 2020-05-24T07:22:58.522Z - 24-05-2020

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల్లో కెమికల్ లీకేజీలు ఇబ్బంది పెడుతున్నాయి.  విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ,  హెచ్ పీసీఎల్ పొగలు.. మరిచిపోకముందే మెదక్ జిల్లాలో లో ఒక కెమికల్ ఫ్యాక్టరీ లో కెమికల్స్ లీకేజ్ కావడంతో సుమారు పది మందికి కంటి చూపునకు ప్రమాదం ఏర్పడింది. కళ్ళలో విపరీతమైన మంట ఏర్పడడంతో కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండలం చందంపేట లోని MSN కెమికల్ ఫ్యాక్టరీ లో మూడు రోజుల క్రితం కెమికల్ లీకేజీతో అక్కడ పనిచేస్తున్న చందంపేట గ్రామానికి చెందిన మహిళలు కంటి చూపు మందగించి కళ్లలో మంటలు చెలరేగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఈ విషయం తెలిసిన కంపెనీ యాజమాన్యానికి వారు ఈ పది మందిని హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించి మందులు అందజేశారు అయినా వారి ఆరోగ్యం కుదుట పడలేదు.అయితే ఈ రోజు చందంపేట గ్రామస్తులంతా కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని నిలదీశారు ఎలాంటి సేఫ్టీ పద్ధతి లేకుండా కెమికల్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారని గాగుల్స్ ,గ్లోజేస్ లు అందించాలని అలాంటివి లేకపోవడం వల్లే సుమారు పది మంది కార్మికులు అస్వస్థతకు గురై కంటి చూపు సమస్యను ఎదుర్కొంటున్నారు.

ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చూడాలని బాధితులు బాగుపడే వరకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. చందంపేట గ్రామస్తులు కోరారు. ప్రమాదానికి గురైన కార్మికులకు వెంటనే ఆర్థిక సాయం చేసే ఆదుకోవాలన్నారు. కెమికల్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం సరైన చర్యలు చేపట్టాలని చందంపేట గ్రామస్తులు సర్పంచ్ డిమాండ్ చేశారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle