కృష్ణా నదిలో ప్రమాదం.. పుట్టిమునిగి నలుగురు గల్లంతు
18-08-202018-08-2020 08:17:19 IST
2020-08-18T02:47:19.195Z18-08-2020 2020-08-18T02:37:06.854Z - - 17-04-2021

భారీవర్షాల కారణంగా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. తాజాగా కృష్ణా నదిలో పుట్టి మునిగి నలుగురు గల్లంతవడంతో విషాదం నెలకొంది, నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పస్పల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిని దాటే క్రమంలో పుట్టి నీటిలో మునిగిపోయిందని తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎదురుగా వస్తున్న పుట్టిలోని ప్రయాణికులు సకాలంలో స్పందించి పలువురు ప్రయాణికులను కాపాడడంతో ప్రమాదం తీవ్రత తగ్గింది. నారాయణపేట జిల్లా పస్పల గ్రామం నుంచి సుమారు 20 మంది కూలీలు పుట్టిల్లో కర్ణాటక రాష్ట్రంలోని కురవాపురం గ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యంలో నదిని దాటే క్రమంలో పుట్టి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగింది. వెంటనే మరో పుట్టిలోని ప్రయాణికులు అప్రమత్తమై నీటిలో మునిగిన కొంతమందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. 11 మందిని కాపాడగలిగారు. గల్లంతైన వారిలో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పుట్టి కోసం వెళ్లిన వారు వెనక్కి వచ్చారు. ఘటన ఎలా జరిగింది, ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు, సహాయక సిబ్బంది గల్లంతైనవారి కోసం గాలింపు చేపట్టారు. ఈఘటనలో గల్లంతైన వారు కురవపురానికి చెందిన తల్లి సుమలత, కుమార్తె రోజా, పార్వతమ్మ, నరసమ్మగా గుర్తించారు.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
9 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
14 hours ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
11 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
15 hours ago

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
13 hours ago

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత
18 hours ago

లక్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడినట్లే- రఘురామ
17 hours ago

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
19 hours ago

షర్మిల పక్కనే విజయమ్మ.. లాభమా నష్టమా
16 hours ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
20 hours ago
ఇంకా