newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కృత్రిమంగా పడకల కొరత సృష్టిస్తే తాట తీస్తాం. ప్రైవేటుకు కేసీఆర్ వార్నింగ్

18-07-202018-07-2020 06:51:44 IST
Updated On 18-07-2020 10:35:30 ISTUpdated On 18-07-20202020-07-18T01:21:44.102Z18-07-2020 2020-07-18T01:21:41.357Z - 2020-07-18T05:05:30.289Z - 18-07-2020

కృత్రిమంగా పడకల కొరత సృష్టిస్తే తాట తీస్తాం. ప్రైవేటుకు కేసీఆర్ వార్నింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ప్రైవేటు ఆస్పత్రులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో బెడ్ల విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనాతో ప్రజలు హైరానా పడి ప్రైవేట్‌ ఆస్పత్రులకు పోవద్దని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి నెలకొందని, వైరస్‌ విషయంలో ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాల్సిందేనని మనోధైర్యాన్ని నింపారు. రాష్ట్రంలో అంత భయంకరమైన పరిస్థితి లేదని, అదే సమయంలో ప్రజలు నిర్లక్ష్యానికి తావివ్వకూడదు సూచించారు. 

రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న తరుణంలో శుక్రవారం ప్రగతిభవన్‌లో వైద్యశాఖ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్‌పై ముందుండి పోరాడుతున్న సిబ్బందికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం వరాల జల్లు కురిపించారు. సాధారణ బడ్జెట్ కేటాయింపులకంటే వందకోట్ల రూపాయలను అదనంగా వైద్య ఆరోగ్య శాఖకు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. కరోనాపై పోరాటంలో ఏ అత్యవసర ఖర్చుకైనా దీన్ని వినియోగించడానికి ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ల ఆజమాయిషీలో ఈ వందకోట్లను పెడుతున్నట్లు కేసీఆర్ చెప్పారు.

‘ప్రజలు హైరానా పడి అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం మంచి చికిత్స అందుతున్నది. ఎవరికి లక్షణాలు కనిపించినా వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లి, వైద్యుల సలహా తీసుకోవాలి. చికిత్స పొందాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వైద్యం అందించడానికి ఏర్పాట్లున్నాయి. కాబట్టి వీటిని ప్రజలు వినియోగించుకోవాలి. కరోనా వ్యాప్తి నివారణకు, వైరస్‌ సోకిన వారికి మంచి వైద్యం అందించడానికి ఎంత ఖర్చయినా పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని సీఎం భరోసా ఇచ్చారు. 

కరోనా వ్యాప్తి నివారణ, చికిత్సలో గొప్ప సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఎంతో గొప్పగా సేవలు అందిస్తున్నారు. అవగాహన లేకుండా ఎవరో చేసే చిల్లర మల్లర విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలి. ప్రజలకు మెరుగైన వైద్యం సమర్థవంతంగా అందించే విషయంపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి’ అని సీఎం వైద్య సిబ్బందికి పిలుపునిచ్చారు.

ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, వైద్య సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.

‘ప్రైవేటు ఆసుపత్రులు బెడ్ల అందుబాటు విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రతీ ఆసుపత్రి తమ వద్ద ఎన్ని బెడ్లు ఉన్నాయి అందులో ఎన్ని ఖాళీగా ఉన్నాయనే విషయాలను బహిరంగపరచాలి. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వివరాలు తెలియచేయాలి. ’ అని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.  

హైదరాబాద్‌లోని గాంధి, టిమ్స్‌లోనే దాదాపు 3వేల బెడ్లు ఆక్సిజన్‌ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఆక్సిజన్‌ బెడ్లను సిద్ధం చేశాము. అన్ని ఆసుపత్రుల్లో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల బెడ్లను కేవలం కరోనా కోసమే ప్రత్యేకంగా కేటాయించి పెట్టాము. ఇన్ని బెడ్లు గతంలో ఎన్నడూ లేవు. 1,500 వెంటిలేటర్లు సిద్దంగా ఉన్నాయి. లక్షల సంఖ్యలో పీపీఈ కిట్లు, ఎన్‌–95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయి. మందులు, ఇతర పరికరాల కొరత లేదు అని కేసీఆర్‌ తెలిపారు. 

రాష్ట్రంలో రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉన్నది. గురువారం నాటికి ఆసుపత్రుల్లో ఉండి చికిత్స పొందుతున్న వారు 3,692 మంది ఉన్నారు. వారిలో తీవ్రమైన ఇతర జబ్బులున్న 200 మంది తప్ప మిగతా వారంతా కోలుకుంటున్నారు. రాష్ట్రంలో గురువారం నాటికి 41,018 మందికి వైరస్‌ సోకింది. అందులో 27,295 మంది (67శాతం) కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. ఎలాంటి లక్షణాలు లేని 9,636 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. మిగతా వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారంతా వేగంగా కోలుకుంటున్నారు. లక్షణాలు లేనప్పటికీ కోవిడ్‌ ప్రోటోకాల్‌ ప్రకారం వైరస్‌ సోకిన వారందరి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన గైడెన్స్‌తో చికిత్స అందిస్తున్నాం అని కేసీఆర్ ప్రజలకు భరోసా ఇచ్చారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle