newssting
Radio
BITING NEWS :
భారీ విధ్వంసం సృష్టిస్తూ బుధవారం అర్థరాత్రి పుదుచ్చేరి వద్ద తీరం దాటిన నివర్ తుఫాన్. తీరందాటే సమయంలో భీకర గాలుల ధాటికి నేలకూలిన భారీ వృక్షాలు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత. * నివర్ తుఫాన్ ప్రభావంతో చిగురుటాకులా వణికిపోతున్న తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు. గత అర్థరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వాలు. ఇళ్లు సురక్షితం కాకుండా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచన. * తుఫాను సమయంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు. నెల్లూరు జిల్లా , తమిళనాడుకు చెందిన మత్స్యకారులు సేఫ్. శ్రీహరికోట తీరంలో తలదాచుకున్న మత్స్యకారులు. * ఎన్టీఆర్ ఘాట్ కూల్చాలన్న ఎంఐఎం వ్యాఖ్యల్ని ఖండించిన టీడీపీ నేతలు. ఎన్టీఆర్ పై అభిమానముంటే భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన టీడీపీ నేతలు. * అక్బరుద్దీన్ కు గట్టి కౌంటరిచ్చిన బీజేపీ నేత బండి సంజయ్. దమ్ముంటే పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చాలని సవాల్. వారి ఘాట్లను కూల్చిన వెంటనే దారుస్సలాంను కూల్చివేస్తామన్న బండి సంజయ్. * తెలంగాణలో కొత్తగా మరో 862 కరోనా కేసులు, ముగ్గురు మృతి. * సమ్మె చెేపట్టిన సింగరేణి కార్మికులు. కేంద్రం చేపట్టిన కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మె. సమ్మెలో పాల్గొన్న నాలుగు కార్మిక సంఘాలు. * 26/11 ముంబై ఉగ్రదాడులకు నేటితో 12 ఏళ్లు పూర్తి. ఉగ్రదాడుల్లో అమరులైన వారికి నివాళులర్పించిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, గవర్నర్.

కుమార్తెను కోల్పోయిన తండ్రిని బూటు కాలితో తన్నిన పోలీసు

27-02-202027-02-2020 12:02:30 IST
2020-02-27T06:32:30.166Z27-02-2020 2020-02-27T06:32:28.014Z - - 27-11-2020

కుమార్తెను కోల్పోయిన తండ్రిని బూటు కాలితో తన్నిన పోలీసు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కన్నకుమార్తెను నారాయణ కాలేజీ పొట్టన పెట్టుకుంటే, కుమార్తె మృతదేహాన్ని ఇవ్వమని ప్రాధేయపడుతున్న కన్నతండ్రిని హైదరాబాద్‌లోని పటాన్‌చెరు పోలీసులు బూటు కాలితో తన్నిన వైనం తీవ్ర నిరసనకు దారితీసింది. బిడ్డపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రిని డొక్కలో తన్నిన పోలీసు ఎవరి సంక్షేమం కోసం విధి నిర్వహిస్తున్నాడంటూ నెటిజన్లు, టీవీ చానల్స్ తీవ్రంగా ధ్వజమెత్తడంతో ఆ ఘాతుకానికి పాల్పడిన పోలీసును ఏఆర్‌ హెడ్‌‌క్వార్టర్‌ సంగారెడ్డికి అటాచ్‌ చేసినట్లు పోలీసుల అధికారులు తెలిపారు.

మంగళవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం వెలిమెలలోని నారాయణ బాలికల కళాశాలలో విద్యార్థిని సంధ్యారాణి (16) ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం మృతదేహంతో నారాయణ కళాశాల ఎదుట ధర్నా చేయాలని బాధితులు, కొన్ని విద్యార్థి సంఘాలు యత్నించాయి. ఈ క్రమంలో మృతురాలి తండ్రి ని ఓ కానిస్టేబుల్‌ బూటు కాలుతో తన్నడం ఉద్రిక్తతకు దారితీసింది. 

ఇంటర్‌ చదువుతున్న విద్యార్థిని సంధ్యారాణిది ఆత్మహత్య కాదని.. ఎవరో హత్య చేశారని ఆరోపిస్తూ మృతదేహాన్ని మార్చురీ నుంచి తరలించేందుకు చేసిన యత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం సంధ్యారాణి మృతదేహాన్ని మార్చురీ నుంచి నారాయణ కాలేజీకి తరలించి.. అక్కడ ధర్నా చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. కొందరు యువకులు ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీ తలుపుల తాళాలు పగులగొట్టి సంధ్యారాణి మృతదేహాన్ని తీసుకుని తెచ్చారు. 

పోలీసులు అడ్డుకుని మృతదేహాన్ని మళ్లీ మార్చురీ గదిలోకి తీసుకువెళ్లారు. ఆ సమయంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఓ దశలో పోలీసులు రెచ్చిపోయి లాఠీచార్జీ చేశారు. ఈ సందర్భంగా ఓ కానిస్టేబుల్‌.. మృతురాలి తండ్రి చంద్రశేఖర్‌ను బూటు కాలితో తన్నారు. సంధ్యారాణి మృతిపై ఆమె తండ్రి చంద్రశేఖర్‌ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన బిడ్డకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, ఎవరో హత్య చేసి.. బాత్‌రూమ్‌లో పడేశారని చెబుతున్నారు. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. 

బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వ్యక్తిపై సానుభూతి చూపాల్సిందిపోయి, దాడి చేయడం సమంజసం కాదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చంద్రశేఖర్‌ను కానిస్టేబుల్‌ కాలితో తన్నిన ఘటనపై మంత్రి ట్విట్టర్‌లో స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాల్సిందిగా హోంమంత్రిని, డీజీపీని కోరారు. 

కానిస్టేబుల్‌ శ్రీధర్‌ మృతిరాలి తండ్రితో దురుసుగా ప్రవర్తించడంపై శాఖ తరఫున చింతిస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్పీ చందనాదీప్తి అన్నారు. కానిస్టేబుల్‌ను ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్‌ సంగారెడ్డికి అటాచ్‌ చేశామన్నారు. ఘటనపై విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

మహిళా ఖైదీలకు శుభ‌వార్త చెప్పిన జ‌గ‌న్ స‌ర్కార్‌

మహిళా ఖైదీలకు శుభ‌వార్త చెప్పిన జ‌గ‌న్ స‌ర్కార్‌

   9 hours ago


ప్ర‌చారం చివ‌రి రోజున భాగ్య‌న‌గ‌రానికి వ‌స్తున్న మోదీ.. మ‌త‌ల‌బేంటీ..?

ప్ర‌చారం చివ‌రి రోజున భాగ్య‌న‌గ‌రానికి వ‌స్తున్న మోదీ.. మ‌త‌ల‌బేంటీ..?

   9 hours ago


అమూల్ చేతికి సహకార డైరీలు.. అసలు రహస్యం ఇదే?! (పార్ట్-1)

అమూల్ చేతికి సహకార డైరీలు.. అసలు రహస్యం ఇదే?! (పార్ట్-1)

   10 hours ago


బండ్ల గ‌ణేశ్ కు ఇంట్లో బ్యాండుమేళం..!

బండ్ల గ‌ణేశ్ కు ఇంట్లో బ్యాండుమేళం..!

   11 hours ago


అబ్బో.. బీజేపీ మేనిఫెస్టో బందోబ‌స్తుగ‌నే ఉంది..!

అబ్బో.. బీజేపీ మేనిఫెస్టో బందోబ‌స్తుగ‌నే ఉంది..!

   11 hours ago


'కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె' కేటీఆర్ సెటైర్లు

'కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె' కేటీఆర్ సెటైర్లు

   12 hours ago


మొన్న స‌ర్జిక‌ల్, నిన్న కూల్చివేతలు, రేపేంటి..?

మొన్న స‌ర్జిక‌ల్, నిన్న కూల్చివేతలు, రేపేంటి..?

   13 hours ago


పంప‌కాల్లో తేడాలు.. వైసీపీలో గొడ‌వలు

పంప‌కాల్లో తేడాలు.. వైసీపీలో గొడ‌వలు

   13 hours ago


పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం.. ఇదీ ఏపీలో ఉద్యోగుల పరిస్థితి!

పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం.. ఇదీ ఏపీలో ఉద్యోగుల పరిస్థితి!

   13 hours ago


తెలంగాణ‌లో ఎంత మంది మంత్రి ప‌ద‌వులు ఊడ‌తాయో..!

తెలంగాణ‌లో ఎంత మంది మంత్రి ప‌ద‌వులు ఊడ‌తాయో..!

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle