కుక్కను కాపాడడం కోసం సాహసం చేసిన తెలంగాణ పోలీసు
17-09-202017-09-2020 22:52:36 IST
Updated On 17-09-2020 22:53:29 ISTUpdated On 17-09-20202020-09-17T17:22:36.007Z17-09-2020 2020-09-17T17:22:33.989Z - 2020-09-17T17:23:29.241Z - 17-09-2020

వీధి కుక్కలను పట్టించుకునే నాథులే ఉండరు. ఏదో దారిలో దొరికినవి తింటూ ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ అలా అలా బ్రతికేస్తూ ఉంటాయి. అలాంటిది ఓ వీధికుక్క ప్రమాదంలో ఉందని తెలుసుకున్న ఓ పోలీసు.. ఆ కుక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎంతగానో కష్టపడ్డాడు. చివరికి తన ప్రాణాలకు కూడా రిస్క్ అని తెలిసినా కూడా అతడు ధైర్యంగా ఆ కుక్కను కాపాడాడు. నాగర్ కర్నూలుకు చెందిన హోమ్ గార్డు ముజీబ్ వాగులో కొట్టుకుపోతున్న వీధి కుక్కను కాపాడాడు. తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తుతూ ఉన్నాయి. అలా ఓ ప్రవాహం దగ్గర కుక్క చిక్కుకుపోయింది. కొన్ని ముళ్ల చెట్ల మధ్య అది ఉండిపోయింది. ఎటూ వెళ్లలేని పరిస్థితి..! వరద ఉధృతి పెరిగినా నీటిలో కొట్టుకుపోతుంది. ఆ కుక్క పరిస్థితిని గమనించిన ముజీబ్ జేసీబీ సహాయంతో నీటి లోకి దిగాడు. మొదట ఆ కుక్క కూడా చాలా భయపడింది.. అది గమనించిన ముజీబ్ దాన్ని సముదాయించాడు. ఒకానొక దశలో ఆ కుక్క కూడా అతడి చేతిలో నుండి జారిపోవడం.. అతడు కూడా జారిపోయే వాడే.. కానీ ఎట్టకేలకు ఆ వరదలో నిలబడ్డాడు. జేసీబీ మీద కుక్కను ఉంచి తాను కూడా సపోర్ట్ తీసుకున్నాడు. అలా జేసీబీ బకెట్ మీద కుక్కను ఉంచి ప్రాణాలను కాపాడాడు. ముజీబ్ చేసిన మంచి పనికి సర్వత్రా అభినందనలు లభిస్తూ ఉన్నాయి.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
8 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
11 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
14 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
5 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
15 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
12 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
15 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
16 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
9 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
18 hours ago
ఇంకా