newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

కీసర ఎమ్మార్వో సామాన్యుడు కాదు.. కలెక్టర్ కూడా అడ్డంగా బుక్కైనట్లే

04-09-202004-09-2020 07:10:19 IST
Updated On 04-09-2020 07:26:48 ISTUpdated On 04-09-20202020-09-04T01:40:19.243Z04-09-2020 2020-09-04T01:40:13.527Z - 2020-09-04T01:56:48.174Z - 04-09-2020

కీసర ఎమ్మార్వో సామాన్యుడు కాదు.. కలెక్టర్ కూడా అడ్డంగా బుక్కైనట్లే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్‌ కోటి రూపాయల అవినీతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారుల విచారణలో భాగంగా సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుల ఏసీబీ కస్టడీ వాగ్మూలం మీడియా చేతికి చెక్కింది. ఈ కేసులో కీసర ఎమ్మార్వోతో పాటు పలువురు ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో బహిర్గతమైంది. 

కలెక్టర్‌, కీసర ఆర్డీవో, మరో తహశీల్దార్‌ పాత్ర ఉందని నిందితుల వాంగ్మూలంలో తేలింది. వరంగల్‌ జిల్లా హన్మకొండ ఎమ్మార్వో కిరణ్‌ ప్రకాష్‌ ద్వారానే ఆర్డీవో రవితో నాగరాజు ఒప్పందం కుదిరిందని ఈ కేసులో ఏ3 నిందితుడు శ్రీనాథ్‌ వాంగ్మూలం ఇచ్చారు. దయారాలోని 614, మరికొన్ని సర్వే నెంబర్లలోని 61 ఎకరాల 20 గుంటల భూమి.. సాయిరాజ్‌, అంజిరెడ్డి ద్వారా అగ్రిమెంట్‌ కుదరిందన్నారు. మొయినుద్దీన్ మరో 37 మంది వద్ద నుంచి భూమి అగ్రిమెట్ చేసినట్లు విచారణలో వెల్లడించారు. 

కలెక్టర్‌తో భూమి మ్యూటేషన్ చేపించే బాధ్యత ఆర్డీవో, ఎమ్మార్వో చూసుకుంటారని మాట్లాడుకున్నట్లు పేర్కొన్నారు ఏసీబీ అధికారులకు చిక్కిన కోటి పదిలక్షల రూపాయలను వరంగల్ నుంచి తీసుకొచ్చినట్లు చెప్పారు. కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకే భూ వివాదంపై మాట్లాడేందుకు గెస్ట్ హౌస్‌కి వెళ్లానని ప్రధాన నిందితుడు ఎమ్మార్వో నాగరాజు (ఏ1) తెలిపారు. శ్రీనాథ్‌కు చెందిన ఎలాంటి భూ వివాదం తన పరిధిలో లేదని స్పష్టం చేశారు. (ఈ కలెక్టర్ ఎవరు అనేది బహిర్గతం కాలేదు)

గతంలో తనతండ్రి డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేశాడని, తన తండ్రి ఉద్యోగం తనకు వచ్చినట్లు  శ్రీనాథ్ తెలిపారు. 1995లో టైపిస్టుగా రెవెన్యూ శాఖలో చేరినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి కుత్బుల్లాపూర్, తాండూరు, ఘటకేసర్, ఉప్పల్, ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేసినట్లు విచారణలో చెప్పారు. అంతేకాకుండా తన పేరు మీద భారీగా ఆస్తులు ఉన్నట్లు ఒప్పుకున్నారు. 

కాగా 2011లోనే నాగరాజుపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 10కోట్ల ఆస్తులు గుర్తించారు. ఇక తాజా కేసు నేపథ్యంలో అతని బ్యాంకు లాకర్‌లలో 55లక్షల బంగారు ఆభరణాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బినామీ ఆస్తులు, ఆస్తుల డాక్యుమెం‍ట్స్‌పై విచారణ కొనసాగుతోంది. 

గిన్నిస్ బుక్ రికార్డులోకి కీస‌ర త‌హ‌సీల్దార్

అవినీతి నిరోధక‌శాఖకు ప‌ట్టుబ‌డ్డ కీస‌ర త‌హ‌సీల్దార్ బాల‌రాజు నాగ‌రాజు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కించాల‌ని అవినీతికి వ్య‌తిరేకంగా ఉద్య‌మిస్తున్న‌ చెందిన రెండు స్వ‌చ్ఛంద సంస్థ‌లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను కోరాయి. ఒక‌ భూప‌ట్టా విష‌యంలో రూ.2 కోట్ల‌కు డీల్ మాట్లాడుకుని రూ. 1.10 కోట్లు స్వీక‌రిస్తూ ఇటీవ‌లే త‌హ‌సీల్దార్ ప‌ట్టుబ‌డిన విష‌యం తెలిసిందే. 

ఒక ప్ర‌భుత్వ ఉద్యోగి 20 మిలియ‌న్ల‌ను లంచం రూపంలో తీసుకుంటూ ప‌ట్టుబ‌డ‌టం ప్ర‌పంచంలోనే ఇదే తొలిసారి అయి ఉండ‌వ‌చ్చ‌ని యూత్ ఫ‌ర్ యాంటీ క‌రప్ష‌న్ (వైఏసీ) అధ్య‌క్షుడు ప‌ల్నాటి రాజేంద‌ర్, వ‌రంగ‌ల్ కేంద్రంగా అవినీతి వ్య‌తిరేక అవ‌గాహ‌న‌ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న జ్వాల సంస్థ అధ్య‌క్షుడు సుంక‌రి ప్ర‌శాంత్ గిన్నిస్ బుక్ వ‌ర‌ల్డ్ రికార్డ్ కు ఆన్ లైన్లో చేసుకున్న ద‌ర‌ఖాస్తులో తెలిపారు. 

దీనికి గిన్నిస్ బుక్ సంస్థ స్పందించింది. ప్ర‌భుత్వ అధికారుల అవినీతికి సంబంధించిన త‌మ‌వ‌ద్ద ఇంత‌వ‌ర‌కు ఎలాంటి కేట‌గిరీ లేద‌ని, దీనికోసం ప్ర‌త్యేకంగా కేట‌గిరి ప్రారంభించే విషయాన్ని ప‌రిశీలిస్తామ‌ని తెలిపింది. 

అక్రమాస్తుల గుట్టురట్టు... అవినీతి సామ్రాట్లు ఇంకెందరో?


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle