newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

05-08-202005-08-2020 09:29:39 IST
Updated On 05-08-2020 11:51:28 ISTUpdated On 05-08-20202020-08-05T03:59:39.126Z05-08-2020 2020-08-05T03:59:05.968Z - 2020-08-05T06:21:28.105Z - 05-08-2020

కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఇవాళ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. పాత సచివాలయ భవనాల కూల్చివేత పూర్తయిన నేపథ్యంలో.. నూతన సచివాలయ భవనం విషయమై ఈ భేటీలో చర్చ జరిపే అవకాశం ఉంది.

మరోవైపు కరోనా వైరస్ కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఈ భేటీలో చర్చిస్తారు. నియంత్రిత పంటల సాగుతోపాటు ఆర్డినెన్స్‌లను ఆమోదించడం లాంటి అంశాలు కేబినెట్ భేటీ అజెండాలో ఉన్నాయి.ఉద్యోగుల జీతాల్లో కోత, ఆయుష్‌ వైద్యుల వయోపరిమితి పెంపు కోసం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఉద్యోగుల పదవీ విరమణను 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతామని కేసీఆర్ గతంలో మాటిచ్చారు. 

ఈ మేరకు ఆర్డినెన్స్ తీసుకొస్తారని భావించారు. కానీ నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన ఎదురయ్యే అవకాశం ఉండటంతో.. ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.నూతన సచివాలయ డిజైన్లపై సీఎం కేసీఆర్ గత పది రోజులుపాటు సమావేశాలు నిర్వహించారు. నేటి కేబినెట్ భేటీలో నూతన సచివాలయ ప్రణాళికకు ఆమోదం తెలపనున్నారు.

ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాల నేపథ్యంలో ఆగష్టు 5న ఇరు రాష్ట్రాల సీఎంలు, సీఎస్‌లు, జలవనరుల శాఖ అధికారులతో సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాసింది.

కానీ ఇదే రోజు తెలంగాణ కేబినెట్ భేటీ అవుతోంది. అపెక్స్ కౌన్సిల్ భేటీ రోజే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలా అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.  ఇవాళ జరిగే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు సీఎం హాజరు కావాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   2 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   an hour ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   6 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   7 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   3 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   9 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   10 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   2 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   4 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   10 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle