newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కీలకంగా మారుతున్న మునిసిపల్ పోరు.. కేసీయార్ యాక్షన్ ప్లాన్

10-01-202010-01-2020 08:31:09 IST
Updated On 10-01-2020 10:14:31 ISTUpdated On 10-01-20202020-01-10T03:01:09.953Z10-01-2020 2020-01-10T03:01:04.409Z - 2020-01-10T04:44:31.575Z - 10-01-2020

కీలకంగా మారుతున్న మునిసిపల్ పోరు.. కేసీయార్ యాక్షన్ ప్లాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. సీఎం కేసీయార్ అన్ని మునిసిపాలిటీలలోనూ గులాబీ జెండా ఎగరేయడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నేతలతో భేటీ అవుతున్నారు. గురువారం కూడా కేసీయార్ మునిసిపల్ వ్యూహాల గురించి చర్చించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఏ, బీ ఫారాలను టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ పంపిణీ చేశారు.

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గం ఇంఛార్జీలతో సమావేశమైన సీఎం కేసీఆర్ ఆలస్యంగా వచ్చిన నేతలకు క్లాస్ పీకారు. మునిసిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని, సాదాసీదాగా తీసుకుంటే పదవులు గల్లంతు అవుతాయని హెచ్చరించారు. మున్సిపల్‌ ఎన్నికల బీ ఫారాల జారీ విధివిధానాలను వివరించారు. అభ్యర్థుల ఎంపికలో విపక్ష పార్టీలు అనుసరిస్తున్న తీరు, ప్రచార వ్యూహంపై సేకరించిన సమాచారంపై విశ్లేషించారు.

రాష్ట్రమంతా టీఆర్‌ఎస్‌కే ఓటర్లు సానుకూలంగా ఉన్నారని, ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేసుకుందామని సీఎం చెప్పారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఆశావాహుల నుంచి తీవ్ర పోటీ ఉందని, టికెట్లు రాని వారు నిరాశపడకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. టికెట్లు రాని వారికి భవిష్యత్‌లో నామినేటెడ్‌ పదవులు, ఇతర అవకాశాలు కల్పిస్తామన్నారు. రెబల్స్ బెడద లేకుండా చూసుకోవాలన్నారు. 

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జనవరి 22న ఎన్నికలు జరగనున్నాయి. 25న ఫలితాలు వెల్లడి కానున్నాయి. శుక్రవారం వరకే నామినేషన్ల గడువు వుండడంతో పార్టీలు తమ అభ్యర్ధుల ఎంపికను పూర్తిచేశాయి. 

ఇటు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కరీంనగర్‌ కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జనవరి 24న పోలింగ్, జనవరి 27న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. జనవరి 10 నుంచి నామినేషన్ల స్వీకరించనున్నట్టు తెలిపింది. జనవరి 12వ తేదీ నామినేషన్లకు చివరి తేదీ కాగా… 13న నామినేషన్లను పరిశీలించనున్నారు. 

లోక్ సభ ఎన్నికలలో కరీంనగర్ స్థానం బీజేపీ వశమయింది. బండి సంజయ్ గెలవడంతో ఇటు బీజేపీ కూడా ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. కరీంనగర్ మేయర్ పదవి రిజర్వేషన్ జనరల్ కేటగిరికి కేటాయించడంతో పార్టీలు బలమయిన అభ్యర్ధులను నిలపనున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్‌కు కూడా అన్ని కార్పొరేషన్లతో పాటుగా ఎన్నికలు జరగాల్సి ఉండగా… కోర్టు కేసు కారణంగా ఎన్నిక వాయిదా పడింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా.. సింగిల్ జడ్జీ తీర్పును నిలిపివేస్తున్నట్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

కోర్టు క్లియరెన్స్ రావడంతో కరీంనగర్ కార్పొరేషన్‌ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ వెలువరించింది. మొత్తం మీద రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపాలిటీల్లోని 2,727 వార్డులు, కార్పొరేషన్లలోని 325 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle